Switch to English

రాజశేఖర్ ‘దెయ్యం’ మూవీ రివ్యూ

Critic Rating
( 1.50 )
User Rating
( 3.00 )

No votes so far! Be the first to rate this post.

Movie దెయ్యం
Star Cast రాజశేఖర్, స్వాతి దీక్షిత్
Director రాంగోపాల్ వర్మ
Producer నట్టి కుమార్
Music డి.ఎస్.ఆర్
Run Time 1 గంట 38 నిమిషాలు
Release ఏప్రిల్ 16, 2021

విలక్షణ మరియు వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో డా. రాజశేఖర్ చేసిన మొదటి హారర్ సినిమా ‘పట్ట పగలు’. 2014 లో విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ లభించింది. ఎప్పుడు రిలీజవుతుందా అని చూసిన ఆ సినిమా ఆ తర్వాత కనిపించలేదు. దాదాపు ఏడేళ్ల తర్వాత మళ్ళీ ఆ సినిమా బూజు విదిలించి, పట్ట పగలు టైటిల్ ని కాస్తా ‘దెయ్యం’గా మార్చి నేడు విడుదల చేసాడు ఆర్జీవీ. ట్రైలర్ తో కాస్త క్రేజ్ తెచ్చుకున్న ఈ సినిమా ఎంత వరకూ ప్రేక్షకుల్ని భయపెట్టిందో ఇప్పుడు చూద్దాం..

కథ:

మెకానిక్ అయిన శంకర్(రాజశేఖర్)కి తన కుమార్తె విజ్జి(స్వాతి దీక్షిత్) అంటే చాలా ఇష్టం. శంకర్ ఎంతో గారాబంగా పెంచుకునే విజ్జి కి కూడా కాలేజ్, ఇల్లు ప్రపంచంగా ఉంటుంది. కానీ సడన్ గా విజ్జి ప్రవర్తనలో మార్పు వస్తుంది, తన విచిత్రమైన చేష్టలతో విజ్జి ఇంట్లో వాళ్ళని, చుట్టూ ప్రక్కల కాలనీ వాళ్ళని భయానికి గురి చేస్తుంది. దాంతో శంకర్ ఎక్కడెక్కడో చూపించగా ఫైనల్లీ విజ్జికి దెయ్యం పట్టిందని ఒక నిర్దారణకు వస్తారు. ఇంతకీ విజ్జిని ఆవహించింది ఎవరు? విజ్జిని సెలక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? తన కూతురిలో ఉన్న దెయ్యాన్ని వెళ్లగొట్టడానికి శంకర్ ఎన్ని ఇబ్బందులు పడ్డాడు? చివరికి శంకర్ కి తన కూతురు దక్కిందా? లేదా? అన్న ప్రశ్నలకి సమాధానం తెలియాలంటే దెయ్యం చూడాల్సిందే.

తెరమీద స్టార్స్..

నటన పరంగా ప్రధాన హైలైట్ స్వాతి దీక్షిత్ అని చెప్పాలి. దెయ్యం పట్టిన పాత్రలో ప్రేక్షకులను తన నటనతో భయపెట్టగలిగింది. తనకి ఇచ్చిన పాత్రకి పూర్తి న్యాయం చేసింది. తండ్రి పాత్రలో రియలిస్టిక్ పెర్ఫార్మన్స్ తో రాజశేఖర్ కూడా ఆకట్టుకున్నాడు. ఎమోషనల్ సీన్స్ కూడా బాగా చేశారు కానీ ఇక్కడ సమస్య ఏంటంటే రాజశేఖర్ కి చెప్పిన డబ్బింగ్ వాయిస్ అసలు సెట్ కాలేదు. ఒక్క రాజశేఖర్ కి మాత్రమే కాదు తెలుగు ప్రేక్షకులకు పరిచయం ఉన్న తనికెళ్ళ భరణి, బెనర్జీ, అనంత్, సన తదితర నటులది కూడా సొంత డబ్బింగ్ కాకపోవడంతో ఆ పాత్రలకి కనెక్ట్ కాలేకపోతాము. దాంతో చాలా చోట్ల కథకి డిస్కనెక్ట్ అవుతాం.

తెర వెనుక టాలెంట్..

ఏడాది గడిస్తేనే ఆ కథ – కథనాలు పాతవి అయిపోతున్న తరుణంలో దాదాపు ఏడేళ్ల క్రితం సినిమా అంటే చూడటానికి ఎంత పాతగా అనిపించి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఆర్జీవీ తన హారర్ హిట్ ఫిలిమ్స్ లోని సీన్స్ ని మళ్ళీ రీక్రియెట్ చేయడానికి ట్రై చేశారే తప్ప కొత్తగా ఏమీ చెప్పలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆర్జీవీ నుంచి వచ్చిన మరో డిజప్పాయింట్ మెంట్ ఫిల్మ్ దెయ్యం. థియేటర్స్ ఖాళీగా ఉన్నాయి కదా అని ఆర్జీవీ పేరుని క్యాష్ చేసుకుందామని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఆగిపోయిన దాన్ని ఫినిష్ చేసి రిలీజ్ చేశారు నట్టి కుమార్. తప్పులేదు కానీ మినిమమ్ క్వాలిటీ మైంటైన్ చేయాలి కదా.. డబ్బింగ్ విషయంలో ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ తో వేరియేషన్ లేకుండా ముగ్గురు నలుగురికి చెప్పించారు, పైగా వాయిస్ సింక్ కూడా సరిగా లేదు. అందరి వాయిస్ లు ఒకేలా ఉండడం చాలా చిరాగ్గా అనిపిస్తుంది.

అలాగే హారర్ సినిమాకి కీలకమైన సౌండ్ మిక్సింగ్ అనేది కూడా వెరీ బ్యాడ్. సతీష్ ముత్యాల విజువల్స్ తో అక్కడక్కడా హర్రర్ ఫీల్ ని కలుగజేసే ప్రయత్నం చేసినా, డి.ఎస్.ఆర్ నేపధ్య సంగీతం మరియు సౌండ్ మిక్సింగ్ లు సరిగా లేకపోవడంతో ఏంట్రా ఇది, యూట్యూబ్ లోనే దీనికన్నా బెటర్ క్వాలిటీ కనపడుతుంది కదా అనే ఫీలింగ్ వస్తుంది. నిర్మాతగా నట్టి కుమార్ థియేటర్స్ దొరుకుతున్నాయని ఎలాగోలా రిలీజ్ చేసేసి నాలుగు పైసలు తెచ్చుకోవాలని ఆలోచించారే తప్ప, కంటెంట్ బాలేకపోతే ఆ నాలుగు కాదు రెండు పైసలు కూడా రావనే లాజిక్ ని మిస్ అయ్యారు.

విజిల్ మోమెంట్స్:

– స్వాతి దీక్షిత్ నటన
– రాజశేఖర్ హీరో అనే టాగ్

బోరింగ్ మోమెంట్స్:

– ఒకటా రెండా అన్నీ మైనస్ లే..

విశ్లేషణ:

కోవిడ్ సెకండ్ వేవ్ విస్తృతంగా ఉండడంతో ఇప్పటికే పలు పెద్ద సినిమాలు వాయిదా పడ్డాయి, థియేటర్స్ కొన్ని మూతపడ్డాయి. ఇలాంటి తరుణంలో ప్రేక్షకుల్లో కూడా థియేటర్ కి వెళ్ళాలా లేదా అనే అనుమానాలు తలెత్తుతున్న తరుణంలో వచ్చిన దెయ్యం సినిమా విషయంలో.. ఆర్జీవీ, రాజశేఖర్ పేర్లు ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసే విషయాలు అయితే, దెయ్యం సినిమా థియేటర్ లో చూసి ఎంజాయ్ చేసే కంటెంట్ లేకపోవడం బిగ్గెస్ట్ మైనస్. కావున ఏడేళ్ల తర్వాత వచ్చిన ‘దెయ్యం’ సినిమా రిలీజ్ కాలేదనుకోవడమే బెటర్.

చూడాలా? వద్దా?: లైట్ తీస్కోవచ్చు.

తెలుగుబులెటిన్.కామ్ రేటింగ్ : 1.5/5 

సినిమా

మెగాస్టార్ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా

మెగాస్టార్ చిరంజీవి వరస ప్రాజెక్ట్స్ ను సెట్ చేసుకున్న విషయం తెల్సిందే. కొరటాల శివ డైరెక్షన్ లో ఆచార్య చిత్రాన్ని దాదాపు పూర్తి చేసాడు. దీని...

మా అధ్యక్షురాలి రేసులోకి హేమ!

మా (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) ఎన్నికల హంగామా విడుదలైంది. మా అధ్యక్ష పీఠం కోసం ఈసారి భారీ పోటీ ఉండబోతోంది. ఎందుకంటే ఇప్పటికే ఇద్దరు ప్రముఖులు...

కమెడియన్‌ ను దర్శకుడిగా తీసుకు రాబోతున్న నాగ్‌

ఎంతో మంది దర్శకులను పరిచయం చేసిన అక్కినేని వారు మరో దర్శకుడిని పరిచయం చేసేందుకు సిద్దం అయ్యారు. ప్రస్తుతం సినిమా షూటింగ్‌ లు పునః ప్రారంభం...

రష్మిక ఇంటికి వెళ్లిన ఫ్యాన్‌.. పోలీసులు అరెస్ట్‌

హీరోలు మరియు హీరోయిన్స్‌ కు ఉండే అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వారు తమ అభిమాన స్టార్స్ ను చూసేందుకు ఎంత దూరం అయినా వెళ్తారు....

ఫారెస్ట్‌ ఫ్రంట్ లైన్‌ హీరోస్‌ కోసం ఉపాసన

మెగా పవర్ స్టార్‌ రామ్‌ చరణ్‌ సతీమణి ఉపాసన కొణిదెల చేసే కార్యక్రమాలు అన్ని ఇన్నీ కావు. ఆమె చేస్తున్న షో లతో మరియు ఆమె...

రాజకీయం

నారా లోకేష్ పవర్ పంచ్: నడి రోడ్డు మీద కాల్చెయ్యమన్లేదు కదా.?

స్క్రిప్టు ఫాలో అవుతున్నారా.? లేదంటే, నిజంగానే నారా లోకేష్ రాజకీయ నాయకుడిగా తనలోని ‘పవర్ ఫుల్’ యాంగిల్ చూపిస్తున్నారా.? అన్న విషయాన్ని పక్కన పెడితే, ఈ మధ్య టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిలో...

ఇసుక వర్సెస్ మట్టి.. నెల్లూరు ‘బులుగు’ ఫైట్.!

ఇద్దరూ అధికార పార్టీకి చెందిన నేతలు. పైగా ప్రజా ప్రతినిథులు. అందునా, కీలకమైన పదవుల్లో వున్న వ్యక్తులు. ‘పవర్’ వుంటే, దోచెయ్యాల్సిందే కదా.. అన్నట్టు, తమకు తోచిన రీతిలో దోచేస్తున్నారట. అందులో ఒకరి...

డెల్టా ప్లస్ వచ్చేసింది.. రాజకీయం చూస్తే సిగ్గేస్తోంది.!

నవ్విపోదురుగాక మనకేటి సిగ్గు.? అన్నట్టుంది రాజకీయ నాయకుల తీరు. కొందరు రాజకీయ ప్రముఖులు కరోనా మొదటి వేవ్, కరోనా రెండో వేవ్ సమయాల్లో ప్రాణాలు కోల్పోయారు. ఆ కారణంగా ఉప ఎన్నికలూ వచ్చాయి....

కరోనా సమయంలో పరీక్షలా.. రఘురామ మరో లేఖ

ఏపీలో అధికార పార్టీ తిరుగుబాటు ఎంపీ రఘురామ కృష్ణరాజు లేఖాస్త్రాలు కొనసాగుతున్నాయి. నవ హామీలు-వైఫల్యాల పేరుతో ఇప్పటివరకు సీఎం జగన్ కు తొమ్మిది లేఖలు రాసిన ఆయన.. నవ ప్రభుత్వ కర్తవ్యాల పేరుతో...

విజయసాయిరెడ్డి స్థాయికి అశోక్ గజపతిరాజు దిగజారాల్సిందేనా.?

‘16 నెలలు జైల్లో వుండి వచ్చిన వ్యక్తికి అందరూ దొంగల్లానే కనిపిస్తారు.. ఇందులో ఆశ్చర్యపోవడానికేముంది.?’ అని ఒక్క మాటతో తన మీద వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలకు ‘దిమ్మ తిరిగి మైండ్...

ఎక్కువ చదివినవి

పరీక్షలు రద్దు చేస్తే అందరు లోకేష్‌ లా తయారు అవుతారు: రోజా

వైకాపా ఎమ్మెల్యే రోజా మరోసారి తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్సీ నారా లోకేష్‌ పై కౌంటర్ వేసింది. కరోనా వేల పరీక్షలు రద్దు చేయాలంటూ డిమాండ్‌ చేస్తూ తెలుగు దేశం పార్టీ నాయకులు...

మైనర్ బాలికను అవకాశాలు ఇప్పిస్తానని వేధించిన దర్శకుడు

ఒక 16 ఏళ్ల కుర్రాడు తన 13 ఏళ్ల కూతుర్ని వేధిస్తున్నాడని తల్లి కేరళలోని అట్టింగల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ 16 ఏళ్ల కుర్రాడ్ని విచారించగా తాను వేధించలేదని, తాము రిలేషన్...

ధనుష్ తో ప్యాన్ ఇండియా చిత్రాన్ని ప్లాన్ చేస్తోన్న శేఖర్ కమ్ముల?

ఎవరూ ఊహించని కాంబినేషన్ ఇది. క్లాస్ చిత్రాలతో తనకంటూ ప్రత్యేకమైన మార్క్ ను క్రియేట్ చేసుకున్న శేఖర్ కమ్ముల సౌత్ ఇండియాతో బాలీవుడ్ లో కూడా పేరు సంపాదించుకున్న ధనుష్ తో సినిమా...

ధాన్యం బకాయిలు చెల్లించండి.. జగన్ కు బాబు లేఖ

రైతులకు ధాన్యం బకాయిలు వెంటనే చెల్లించాలని టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన గురువారం సీఎం జగన్ కు లేఖ రాశారు. ధాన్యం బకాయిలు చెల్లించకపోవడంతో రైతులు తీవ్రంగా...

బాలీవుడ్ ఆఫర్ ను పట్టేసిన సాయి పల్లవి?

తన న్యాచురల్ నటనకు తోడు అదరగొట్టే డ్యాన్సింగ్ టాలెంట్ ఉన్న సాయి పల్లవి కథాబలం ఉన్న చిత్రాలను మాత్రమే ఎంచుకుంటోంది. ప్రస్తుతం నాని సరసన శ్యామ్ సింగ రాయ్ చిత్రంలో నటిస్తోన్న సాయి...