Switch to English

ఆర్ ఆర్ ఆర్ పై మరోసారి క్లారిటీ ఇచ్చిన జక్కన్న

తెలుగులో తెరకెక్కుతున్న భారీ సినిమాల్లో ఆర్ ఆర్ ఆర్ ప్రధానమైంది. రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా మొదట జులైకి విడుదల అనుకున్నా కానీ ప్రొడక్షన్ లో ఆలస్యం జరుగుతున్న కారణంగా జనవరి 8న వాయిదా వేసిన సంగతి తెల్సిందే. అయితే ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ ప్లాన్ ప్రకారం జరుగుతుండగా లాక్ డౌన్ కారణంగా షూట్ ఆగిపోయింది. అయితే రెండు నెలలు పూర్తి కావొస్తున్నా కానీ ఇంకా షూటింగ్ కు ఎప్పటి నుండి అనుమతి లభిస్తుందో తెలియని కారణంగా ఆర్ ఆర్ ఆర్ కచ్చితంగా వచ్చే సమ్మర్ కు వాయిదా పడుతుందని అంటున్నారు. అయితే రాజమౌళి మాత్రం ఆ అవకాశాలను తోసిపుచ్చాడు.

ఆర్ ఆర్ ఆర్ కు ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ కాకుండా కొంత బఫర్ టైం పెట్టుకున్నామని, ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా అది కూడా పూర్తైపోయిందని తెలిపాడు. అయితే వచ్చే నెల నుండి షూటింగ్ మొదలైనట్లు అయితే చెప్పిన డేట్ కు రిలీజ్ చేసే అవకాశాలు ఇంకా ఉన్నాయని అంటున్నాడు. షూటింగ్ కు ఎలాంటి అనుమతులు లభిస్తాయో ఇంకా తెలీట్లేదు. కాస్ట్ అండ్ క్రూ ఎంత మంది ఉండాలో, ఎలాంటి నిబంధనలు పెట్టాలో వంటివేం ఇంకా తెలీదు. దాన్ని బట్టి కానీ రిలీజ్ డేట్ విషయంలో స్పష్టత రాదు. ఏదేమైనా షూటింగ్ మొదలైతే కానీ ఎలాంటి విషయం చెప్పలేం.

ఇక లాక్ డౌన్ కారణంగా స్క్రిప్ట్ లో మార్పులు చేసిన విషయం గురించి స్పందిస్తూ ఆ వార్తల్లో అసలు నిజం లేదని, ఒకసారి స్క్రిప్ట్ ను లాక్ చేసాక దాన్ని మార్చడం నాకు అసలు ఇష్టం ఉండదు. ముందు అనుకున్న స్క్రిప్ట్ ప్రకారమే ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ తిరిగి మొదలవుతుంది అని చెప్పుకొచ్చాడు. ఇంకా మాట్లాడుతూ తన కెరీర్ లో ఇప్పటివరకూ బాగా ఇబ్బంది పెట్టిన ప్రాజెక్ట్ గా ఆర్ ఆర్ ఆర్ ను ప్రస్తావించాడు జక్కన్న.

సినిమా

పుకార్లన్నింటికి చెక్‌ పెట్టేందుకు పెళ్లి

బాలీవుడ్‌ హీరోయిన్స్‌ ఇద్దరు ముగ్గురిని ప్రేమించడం ఆ తర్వాత బ్రేకప్‌ అవ్వడం చాలా కామన్‌ విషయాలు. అయితే సౌత్‌ లో మాత్రం హీరోయిన్స్‌ ఎక్కువ లవ్‌...

ఎట్టకేలకు తిరుమలేషుడి దర్శన భాగ్యం

కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్‌ డౌన్‌ కారణంగా దేశ వ్యాప్తంగా అన్ని దేవాలయాల్లోకి భక్తులను అనుమతించని విషయం తెల్సిందే....

ప్రభాస్‌20 ఫస్ట్‌లుక్‌కు అంతా రెడీ

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ సాహో చిత్రం విడుదలకు ముందు ప్రారంభం అయిన రాధాకృష్ణ మూవీ ఇంకా విడుదల కాలేదు. విడుదల సంగతి అలా ఉంచి...

కోటీశ్వరులు అయిన ఈ స్టార్స్‌ ఫస్ట్‌ రెమ్యూనరేషన్‌ ఎంతో తెలుసా?

ప్రస్తుతం సినిమాల్లో నటిస్తూ కోట్లు సంపాదిస్తున్న స్టార్స్‌ ఒకప్పుడు కనీసం తిండికి కూడా ఇబ్బందులు పడ్డ సందర్బాలు చాలానే ఉన్నాయి. వాటిని ఆయా స్టార్స్‌ చెబుతున్న...

గోపీచంద్, అనుష్క ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ!

తెలుగు సినిమాల్లో కొన్ని జంటలను చూడగానే చూడముచ్చటగా భలే ఉన్నారే అనిపిస్తుంది. అలాంటి జంటల్లో ఒకటి గోపీచంద్, అనుష్కలది. ఇద్దరూ హైట్ విషయంలో కానీ వెయిట్...

రాజకీయం

ఫ్లాష్ న్యూస్: శ్రీశైలం మల్లన్న అక్రమార్కులను పట్టేసిన పోలీసులు

ఏపీలోని ప్రముఖ శైవ క్షేత్రం అయిన శ్రీశైలం మల్లన్న ఆలయంలో అధికారులు మరియు ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు కుమ్మక్కు అయ్యి స్వామి వారి ఆదాయంను భారీగా దోచుకున్నారు అంటూ కొన్ని రోజుల క్రితం...

మద్యం అక్రమ రవాణాతో వారికి సైడ్ బిజినెస్

ఏపీలో దొరికే మద్యం బ్రాండ్లలో ఎక్కువగా పేరున్నవి లేకపోవడంతో తెలంగాణలో దొరికే మద్యానికి ఫుల్ డిమాండ్ ఏర్పడింది. దీంతో అక్రమ మద్యం తరలింపు ఎక్కువవుతోంది. తెలంగాణ నుంచి తెచ్చే ఒక్కో ఫుల్‌ బాటిల్‌ను...

రామాయణాన్ని వక్రీకరించారంటూ టీటీడీపై విమర్శలు

హిందువుల మనోభావాలకు టీటీడీ లాంటి ధార్మిక సంస్థ చాలా జాగ్రత్రగా ఉండాలి. టీటీడీ నుంచి వచ్చే సప్తగిరి మాసపత్రికలో జరిగిన పొరపాటు ఇప్పుడు టీటీడీని వివాదాల్లోకి నెడుతోంది. టీటీడీ నుంచి ప్రతి నెలా...

మీడియాకి అలర్ట్: మీడియాపై కేసులు పెట్టే టీంని రంగంలోకి దింపిన వైసీపీ వైసీపీ

ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరాధారమైన, వాస్తవ విరుద్ధమైన, తప్పుడు కథనాలు ప్రచురించినా.. ప్రసారం చేసినా సదరు మీడియా సంస్థలపై కేసులు పెట్టే అధికారాన్ని ఆయా శాఖల అధిపతులకు కట్టబెడుతూ జగన్ సర్కారు జీవో నెం.2430...

ఏపీలో తెరపైకి కొత్త ఎస్ఈసీ?

ఏపీలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామక వ్యవహారం కొత్త మలుపులు తిరుగుతోంది. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎస్ఈసీగా నియమించకూడదనే రీతిలో రాష్ట్ర ప్రభుత్వం సాగుతోంది. హైకోర్టు తీర్పును సవాల్...

ఎక్కువ చదివినవి

నడిరోడ్డుపై గ్యాంగ్ వార్.. గ్యాంగ్ స్టర్ కాల్చివేత

గ్యాంగ్ స్టర్ లు ఎలా ఉంటారో, గ్యాంగ్ వార్ ఎలా జరుగుతాయో తెలుసుకోవాలంటే మనం రామ్ గోపాల్ వర్మ సినిమాలు చూడాల్సిందే. సత్య, కంపెనీ.. వంటి సినిమాలను ఆ కథలతోనే తెరెకెక్కించి రీల్...

‘కరోనా’ కేవలం ప్రారంభం మాత్రమే.!

అ!, కల్కి చిత్రాల దర్శకుడు ప్రశాంత్ వర్మ మూడో సినిమాతో వచ్చేస్తున్నాడు. కొన్ని నెలల క్రితం కరోనా వైరస్ నేపధ్యంలో ఒక చిత్రాన్ని చేయబోతున్నట్లు ప్రకటించిన ప్రశాంత్ నిన్న ఆ చిత్రానికి సంబంధించిన...

డాక్టర్‌ బాబుకు మెగాస్టార్‌ తల్లి ఇచ్చిన గిఫ్ట్‌ ఏంటో తెలుసా?

తెలుగు బుల్లి తెరపై ఇప్పటి వరకు ఎన్నో వందల సీరియల్స్‌ వచ్చాయి. కాని కార్తీక దీపం సీరియల్‌కు వచ్చినంత ప్రజాధరణ ఏ సీరియల్‌కు రాలేదు అనడంలో ఎలాంటి సందేహం లేదు. కార్తీక దీపం...

మరో స్టార్‌ను బలి తీసుకున్న కరోనా

కరోనా కారణంగా గత రెండు నెలలుగా షూటింగ్స్‌ లేకపోవడంతో సినీ కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కేవలం సినీ కార్మికులు మాత్రమే కాకుండా కొందరు స్టార్స్‌ కూడా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవలే...

క్రైమ్ న్యూస్: 10 యేళ్ల కొడుక్కు ఉరి వేసి తాను ఆత్మహత్య చేసుకుంది

అనారోగ్యంతో పిల్లల బాగోగులు చూసుకోలేక పోతున్నాను అనే బాధతో భార్గవి అనే గృహిణి తన పదేళ్ల కొడుకుకు ఉరి వేసి అతడు చనిపోయిన తర్వాత ఆమె కూడా ఉరి వేసుకుని మృతి చెందింది....