Kanguva: ‘గజినీ’కి తమిళ హీరో సూర్య తెలుగు రాష్ట్రంలో చేసిన ప్రమోషన్ ఓ కేస్ స్టడీగా తీసుకున్నా.. బాహుబలిని జాతీయస్థాయిలో తీసుకెళ్లడానికి ఆయనే స్ఫూర్త’ని దర్శకుడు రాజమౌళి అన్నారు. కంగువా ప్రీ-రిలీజ్ ఈవెంట్లో అతిధిగా పాల్గొన్న ఆయన మాట్లాడారు.
‘సూర్య ప్రమోషన్ చూపించి అందరికీ చెప్పేవాడిని. అలా చేయాలి.. కేస్ స్టడీగా తీసుకోమని. గతంలో సూర్యతో ఓ సినిమా చేయాలనుకున్నా. కానీ.. మిస్ అయ్యా. ఆయన నాతో సినిమా మిస్ అయ్యానంటున్నారు. నేను ఆయనను మిస్సయ్యా. టెక్నికల్ గా గ్రాండయర్ కనిపిస్తోంది. కంగువా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా’నని అన్నారు.
సూర్య మాట్లాడుతూ.. ‘ప్రాంతీయ సరిహద్దులు చెరిపేసి బాహుబలితో ఓ దారి చూపించారు. కంగువాకు మీరే స్ఫూర్తి. నిర్మాత జ్ఞానవేల్ రాజా మీ ఫొటోనే పెట్టుకున్నాడు. ఎక్కాల్సిన రైలు మిస్సయ్యా. నేనింకా రైల్వే స్టేషన్లోనే ఉన్నా. ఎప్పటికైనా రైలెక్కుతాననే అనుకుంటున్నా’నని అన్నారు.