రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘రాజాసాబ్’ ట్రైలర్ ఇవాళ సాయంత్రం 6 గంటలకు రిలీజ్ కానుంది. ఈ వార్తతో ఫ్యాన్స్‌లో భారీ ఎగ్జైట్మెంట్ క్రియేట్ అయింది. ట్రైలర్ విజువల్ ఫీస్ట్‌లా ఉండబోతుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ప్రభాస్ డైలాగ్స్, కొత్త లుక్ ఈ సారి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని టాక్. అంతేకాకుండా ఒక హిందీ పాటను రీమిక్స్ చేసి వాడారని కూడా సమాచారం. ట్రైలర్‌లో మరికొన్ని సర్ప్రైజ్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయని ఫిలింనగర్ చర్చ.
ప్రభాస్ ఫ్యాన్స్ ఈ ట్రైలర్ కోసం సోషల్ మీడియాలో భారీగా కౌంట్‌డౌన్ ప్రారంభించారు. యాక్షన్, ఎంటర్టైన్‌మెంట్ మిక్స్‌తో ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపుతుందని అంచనా. మారుతి డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా ప్రభాస్ కెరీర్‌లో మరో మాస్ ఎంటర్టైనర్‌గా నిలుస్తుందనే హైప్.
‘రాజాసాబ్’ ట్రైలర్‌పై ఇప్పటికే యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్ రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ మూవీ రిలీజ్ డేట్‌పై కూడా త్వరలో క్లారిటీ రానుంది.
