Switch to English

పవర్ ప్లే మూవీ రివ్యూ – చూసిన ప్రతి ఒక్కరూ పక్కా డకౌట్.

Critic Rating
( 1.50 )
User Rating
( 5.00 )

No votes so far! Be the first to rate this post.

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,466FansLike
57,764FollowersFollow
Movie పవర్ ప్లే
Star Cast రాజ్ తరుణ్, హేమల్, పూర్ణ
Director జయ్ కుమార్ కొండ
Producer దేవేష్ - మహీధర్
Music సురేష్ బొబ్బిలి
Run Time 1 గంట 58 నిముషాలు
Release మార్చ్ 5, 2021

ఒరేయ్ బుజ్జిగా లాంటి ఎంటర్టైనర్ తర్వాత యంగ్ హీరో రాజ్ తరుణ్ – డైరెక్టర్ విజయ్ కుమార్ కొండా ట్రై చేసి థ్రిల్లర్ మూవీ ‘పవర్ ప్లే’.  అతి తక్కువ టైం లో తీసిన ఈ సినిమాలో హేమల్, పూర్ణ, అజయ్ లు ప్రధాన పాత్రలు పోషించారు. చాలా కాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్న రాజ్ తరుణ్ లవ్ అండ్ కామెడీ స్టోరీలని పక్కన పెట్టి చేసిన ఈ థ్రిల్లర్ మూవీ అయినా కోరుకున్న హిట్ ఇచ్చిందో లేదో ఇప్పుడు చూద్దాం..

కథ:

ఒక గ్యాంగ్ ఎవరికీ తెలియకుండా ఎటిఎంలలో ఒరిజినల్ నోట్లు దొంగతనం చేసి డూప్లికేట్ నోట్స్ పెడుతుంటారు. అలా ఓ రోజు ఎటిఎం నుంచి తెలియక దొంగ నోట్స్ డ్రా చేసుకొని పార్టీ ఇచ్చిన విజయ్ ని (రాజ్ తరుణ్) పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఆ పోలీస్ కేసు వల్ల ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయితో పెళ్లి కాన్సల్ అవుతుంది. విజయ్ లైఫ్ రోడ్ మీదకి వచ్చేస్తుంది. ఎలా అయినా విజయ్ తను అమాయకుడు అని ప్రూవ్ చేసుకోవడం కోసం ఆ ఎటిఎం దగ్గర వెతకగా ఎదురుగా ఉన్న ఒక మెకానిక్ షాప్ లో సిసి టీవీ ఉంటుంది. కానీ ఓనర్ సిసి టీవీ ఫుటేజ్ ఇవ్వను అంటాడు. ఇక అక్కడి నుంచీ ఆ సీసీటీవీ ఫుటేజ్ కోసం విజయ్ పడ్డ కష్టాలేమిటి? సీసీటీవీ ఫుటేజ్ చూసిన ఆ మెకానిక్ షాప్ ఓనర్ ఏకంగా కాబోయే సీఎం పూర్ణ(పూర్ణ)ని ఎందుకు బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు అడుగుతాడు.? అటు విజయ్ నిర్దోషిగా నిరూపించుకోగలిగాడా? లేదా? పూర్ణ భయపడేంతలా ఆ ఫుటేజ్ లో ఏముంది? ఎటిఎం లలో దొంగనోట్లు పెడుతున్న ముఠా ఎవరు అనేదే కథ.

తెరమీద స్టార్స్..

ఇప్పటివరకూ ఎంటర్టైంగ్ పాత్రల్లో కనిపించిన రాజ్ తరుణ్ మొదటి సారి థ్రిల్లర్ సినిమాలో కనిపించాడు. టెన్షన్, బాధ, కోపం లా అన్నీ కలగలిపిన పాత్రలో బాగా చేసాడు. పూర్ణ ఓ ముఖ్యమంత్రి కుమార్తె పాత్రలో, పవర్ఫుల్ ఎక్స్ ప్రెషన్స్ ని పలికించడంలో సూపర్బ్ అనిపించింది. హేమల్ ఇంగ్లే ఉన్నంతలో బాగానే చేసింది. ముఖ్య పాత్రలు పోషించిన అజయ్, రాజా రవీంద్ర, కోట శ్రీనివాసరావు, రవి వర్మ, ధన్ రాజ్ లు స్క్రీన్ మీద కనిపించినంతలో ఓకే అనిపించారు.

తెర వెనుక టాలెంట్..

నంద్యాల రవి తీసుకున్న కథ చెప్పుకోదగినది కాదు. ఒక రెండు క్రైమ్ పాయింట్స్ ని కలుపుతూ కథ రాసుకున్నారు. ఇలాంటి సినిమాలకి కథ కన్నా కథనం అందులో వచ్చే థ్రిల్స్ చాలా ఇంపార్టెంట్. కానీ ఇందులో మనల్ని నెక్స్ట్ ఏం జరుగుతుందా అని కట్టిపడేసే కథనమూ లేదు, మధ్య మధ్యలో ఎగ్జైట్ చేసే థ్రిల్స్ కూడా లేకపోవడంతో సినిమా ఆధ్యంతం బోరింగ్ గా సాగుతుంది. ఇప్పటి వరకూ ప్రేమ కథలని డీల్ చేసి అందులోనూ పెద్దగా సక్సెస్ కాలేకపోయిన విజయ్ కుమార్ కొండ థ్రిల్లర్ సినిమా తీయడంలోనూ ఫెయిల్ అయ్యాడు. ఇక్కడ హీరో ప్రాబ్లెమ్ లో ఇరుక్కున్నాడు ఆ సమస్య నుంచి ఎలా బయటకి వచ్చాడు అనేదే కథ అయినప్పుడు అతని పెయిన్, ఎమోషన్స్, భయటపడతాడా లేదా అనే ఫీలింగ్ ఆడియన్స్ కి కలగాలి, కానీ 2 గంటల పాటు ఎక్కడా ఆ ఫీల్ కలగకపోవడంతో చూసే ప్రతి ఒక్కరినీ డిజప్పాయింట్ చేస్తుంది.

ఐ ఆండ్రూ విజువల్స్ మాత్రం ఒక థ్రిల్లర్ సినిమా అనే ఫీలింగ్ ని కలుగజేస్తాయి, ఆ విజువల్స్ ఫీల్ కి తగ్గట్టు సురేష్ బొబ్బిలి మ్యూజిక్ కూడా బాగుంది. అక్కడక్కడా నిద్ర వస్తున్నా మ్యూజిక్ వలనే సినిమాలో ఏదో ఉందని లేచి చూస్తుంటాం. తీసినంతలో ఉన్నదాన్ని ఎడిటర్ ప్రవీణ్ పూడి షార్ట్ గానే కట్ చేసాడు కానీ అది కూడా బోర్ కొట్టించేసింది. దేవేష్ – మహీధర్ నిర్మాణ విలువలు అయితే బాగున్నాయి.

విజిల్ మోమెంట్స్:

– రాజ్ తరుణ్ అండ్ పూర్ణ పెర్ఫార్మన్స్
– బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
– థ్రిల్లర్ మూడ్ ని సెట్ చేసే విజువల్స్

బోరింగ్ మోమెంట్స్:

– కథ
– కథనంలో ఆసక్తి లేకపోవడం
– స్లో నేరేషన్ ఫీలింగ్
– నో థ్రిల్స్, నో కామెడీ, నో ఎమోషన్స్
– వీక్ డైరెక్షన్
– లాజిక్స్ లేని క్రైమ్ సాల్వింగ్
– పరమ బోరింగ్ ఫస్ట్ హాఫ్

విశ్లేషణ:

పవర్ ప్లే – క్రికెట్ లో ఈ పదం వినగానే చూసే ఆడియన్స్ రోమాలు నిక్కబొడుచుకుంటాయి, ఏమవుతుందా అనే టెన్షన్ హైలో ఉంటుంది. ఈ సినిమా అలానే ఉంటుందనుకొని సినిమాకి వెళ్లారో మీకు నీరసం, చిరాకు, ఎందుకు వచ్చామురా బాబు అనే ఫీలింగ్ కలగడం మాత్రం పక్కా.. విజయ్ కుమార్ కొండ – రాజ్ తరుణ్ ల కాంబినేషన్ లో మరో ప్లాప్ ‘పవర్ ప్లే’. కానీ కెరీర్ పరంగా రాజ్ తరుణ్ కి మరో కోలుకోలేని దెబ్బ అని చెప్పచ్చు.

చూడాలా? వద్దా?: స్కిప్ చేసే మూవీస్ లిస్టులో చేర్చేయచ్చు.

తెలుగుబులెటిన్.కామ్ రేటింగ్ : 1.5/5 

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Nani: ‘జెర్సీ’ @5..! ధియేటర్లో సినిమా చూసిన నాని.. ఎమోషనల్ పోస్ట్

Nani: నాని (Nani) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ (Jersey) విడుదలై నిన్నటికి 5ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమాను...

Upasana: ఆవకాయ పట్టిన అత్తమ్మ.. ఆటపట్టించిన ఉపాసన.. వీడియో వైరల్  

Upasana: టాలీవుడ్ (Tollywood) లో మెగా ఫ్యామిలీ (Mega Family) అంటే ఒక సందడి. ఒక బ్రాండ్. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi). ఆయనొక ఇన్ స్పిరేషన్...

Puri Jagannadh: ఎవరు కొడితే బొమ్మ బ్లాక్ బస్టరవుద్దో.. అతనే ‘పూరి...

Puri Jagannadh: సినిమాకి హీరోకి ఉండే క్రేజే వేరు. సరైన సినిమాపడి స్టార్ స్టేటస్ వస్తే ఫ్యాన్స్ పెరుగుతారు.. డెమీ గాడ్ కూడా అయిపోతాడు. హీరో...

Harish Shankar: చోటా కె.నాయుడుపై హరీశ్ శంకర్ ఆగ్రహం.. బహిరంగ లేఖ

Harish Shankar: టాలీవుడ్ (Tollywood) సీనియర్ స్టార్ సినిమాటోగ్రాఫర్ చోటా కె.నాయుడు (Chota K Naidu) పై బ్లాక్ బస్టర్ దర్శకుడు హరీశ్ శంకర్ (Harish...

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

రాజకీయం

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

కులాంతరంలో కూడా రాజకీయ క్రీడ.!

ప్రజల నుంచి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోవాలి అంటే.. ప్రజలందరికి మంచి చెయ్యటం వ్యక్తులకి సాధ్యం కాదు. అందుకని మనుషులని ఎదో ఒకరకంగా కూడగట్టాలి. ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు,...

ఎన్డిఏ కూటమి అభ్యర్థులను గెలిపించండి.. అభిమానులకు మెగాస్టార్ పిలుపు

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు సీఎం రమేష్, పంచకర్ల రమేష్ బాబును గెలిపించాలంటూ మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi) తన అభిమానులకు పిలుపునిచ్చారు. ఏపీలో చంద్రబాబు నాయుడు,...

నర్సాపురం అసెంబ్లీ గ్రౌండ్ రిపోర్ట్: ఎడ్జ్ జనసేన పార్టీకే.!

2024 ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నర్సాపురం కూడా ఒకింత హాట్ టాపిక్ అవుతున్న నియోజకవర్గమే. నర్సాపురం లోక్ సభ నియోజకవర్గం అలాగే, ఆ పరిధిలోని నర్సాపురం అసెంబ్లీ నియోజకవర్గం.. ఈ...

మెగాస్టార్ చిరంజీవి మీద పడి ఏడుస్తున్న వైసీపీ బ్యాచ్.!

2024 ఎన్నికల్లో దారుణ పరాజయాన్ని ముందే ఊహించుకున్న వైసీపీ, ప్రతి చిన్న విషయానికీ కలత చెందుతోంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పుట్టినరోజు సందర్భంగా పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు...

ఎక్కువ చదివినవి

Harish Shankar: చోటా కె.నాయుడుపై హరీశ్ శంకర్ ఆగ్రహం.. బహిరంగ లేఖ

Harish Shankar: టాలీవుడ్ (Tollywood) సీనియర్ స్టార్ సినిమాటోగ్రాఫర్ చోటా కె.నాయుడు (Chota K Naidu) పై బ్లాక్ బస్టర్ దర్శకుడు హరీశ్ శంకర్ (Harish Shankar) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్దేశపూర్వకంగా...

రఘురామకృష్ణరాజు పంతం పట్టి మరీ సాధించుకున్నారుగానీ.!

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు, వైసీపీని వీడి టీడీపీలో చేరి, టీడీపీ నుంచి ఉండి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీకి దిగుతున్న సంగతి తెలిసిందే. నర్సాపురం లోక్ సభ సీటుని బీజేపీ నుంచి ఆశించి...

Chiranjeevi: చిరంజీవితో రష్యన్ సినిమా ప్రతినిధుల భేటీ.. చర్చించిన అంశాలివే

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)తో రష్యా నుంచి వచ్చిన మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి నివాసంలో జరిగిన వీరి భేటికీ టాలీవుడ్...

కూలీలపై హత్యా నేరం మోపుతారా.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరం నడిబొడ్డున హత్యాయత్నం జరిగిందంటూ వైసీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారం సందర్భంగా, గుర్తు తెలియని వ్యక్తి విసిరిన...

స్క్రిప్ట్ చేతిలో వైఎస్ జగన్ ఎందుకు బందీ అయ్యారు.!?

అసలేమయ్యింది వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి.? సుదీర్ఘ పాదయాత్ర చేసిన సమయంలో ఎవరి స్క్రిప్ట్ అవసరం లేకుండానే ప్రసంగాలు చేశారు కదా.? కానీ, ఇప్పుడేమయ్యింది.? స్క్రిప్టు చేతిలో వుంటే తప్ప మాట్లాడలేకపోతున్నారు.. ఆ...