సినీ నటుడు రాజ్ తరుణ్‌కి పెళ్ళయ్యిందా.? నిజానికి, అధికారికంగా ఆయన ఇప్పటికీ బ్యాచిలర్ మాత్రమే.! ఆయనకి పెళ్ళి కాలేదు. కానీ, రాజ్ తరుణ్ తనను పెళ్ళి చేసుకున్నాడంటోంది లావణ్య అనే యువతి. గుడిలో ఇద్దరూ పెళ్ళి చేసుకున్నారట. ఈ విషయమై ప్రశ్నిస్తే, ‘నాకు పెళ్ళి కాలేదు’ అని రాజ్ తరుణ్ అంటున్నాడు.
కానీ, లావణ్యతో రాజ్ తరుణ్‌కి పరిచయం వుంది. ఇద్దరూ కొంతకాలం కలిసే వున్నారు. అంటే, సహజీవనం అన్నమాట. ఈ రోజుల్లో ఇదంతా కామన్. లావణ్య నుంచి కొంతకాలం క్రితమే రాజ్ తరుణ్ విడిపోయాడట. లావణ్య వేరే వ్యక్తితో వుంటోందట. ఈ మాట చెబుతున్నది రాజ్ తరుణ్.
అయితే, మాల్వి మల్హోత్రా అనే హీరోయిన్‌తో ప్రేమలో పడ్డాక తనను రాజ్ తరుణ్ దూరం పెట్టాడంటోంది లావణ్య. మాల్వి – రాజ్ తరుణ్ ‘తిరగబడరా సామీ’ అనే సినిమాలో కలిసి నటిస్తున్నారు. అంతకు ముందు బిగ్ బాస్ ఫేం అరియానా గ్లోరీతోనూ రాజ్ తరుణ్ ఎఫైర్ పెట్టుకున్నాడనీ, పలువురు హీరోయిన్లతో శారీరక సంబంధాలు రాజ్ తరుణ్‌కి వున్నాయనీ లావణ్య ఆరోపిస్తుండడం గమనార్హం.
తనకు లావణ్యతోనే కాదు, ఎవరితోనూ శారీరక సంబంధాల్లేవని రాజ్ తరుణ్ కుండబద్దలుగొట్టేస్తున్నాడు. ఇంతలో, ఈ కేసుకు సంబంధించి కొన్ని ఆధారాల్ని న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర, మీడియా ముందుంచారు.
లావణ్యకు గతంలో రాజ్ తరుణ్ అబార్షన్ చేయించాడనీ, లావణ్యను వదిలించుకోవడానికి ఆమెపై రాజ్ తరుణ్ భౌతిక దాడులకు దిగాడనీ, ఆమెకు అక్రమ సంబంధాలు అంటగడుతున్నాడనీ, లావణ్యపై దాడుల్లో మాల్వి మల్హోత్రా హస్తం కూడా వుందని లావణ్య తరఫు న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర చెబుతుండడం గమనార్హం.
ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే, తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు లావణ్య, న్యాయవాదికి సమాచారం ఇవ్వడం. న్యాయవాది, పోలీసులకు సమాచారం ఇవ్వడంతో, లావణ్య ఇంటికి చేరుకున్న పోలీసులు ఆమెకు కౌన్సెలింగ్ ఇచ్చివచ్చారట.
మొత్తమ్మీద, కేసు ముదిరి పాకాన పడింది.! రాజ్ తరుణ్ కొత్త సినిమా రిలీజ్‌కి ముందు ఈ హంగామాని ఎలా అర్థం చేసుకోవాలి.? ఈ కేసులో లావణ్యని ‘ఇంటరాగేట్’ చేస్తున్న ఓ సెక్షన్ మీడియా, ‘పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ ప్రస్తావన తెచ్చేలా ఆమెను పాంపరింగ్’ చేస్తుండడాన్ని ఏమనుకోవాలి.?
వాస్తవానికి, సినీ రంగంలో హీరోలు – హీరోయిన్ల చుట్టూ బోల్డన్ని గాసిప్స్ వస్తుంటాయి. నిర్మాతలు, దర్శకులు, కొరియోగ్రాఫర్లు, కమెడియన్లు.. ఇలా గాసిప్స్‌కి ఎవరూ అతీతం కాదు. బుల్లితెర నటీనటులు, యాంకర్లపైనా చూస్తుంటాం ‘ఎఫైర్స్ గాసిప్స్’. రాజ్ తరుణ్ విషయంలో కూడా అదే రీతిన గాలి వార్తలు ప్రచారంలోకి వచ్చాయా.?
లావణ్యతో తనకున్న సంబంధం గురించి రాజ్ తరుణ్ స్వయంగా ఒప్పుకున్నాక, ఈ కేసులో న్యాయపరమైన వ్యవహారాలు ఎలా వుంటాయ్.? ఈ విషయమై బోల్డంత ఉత్కంఠ నెలకొంది.