బెంగళూరు మునిగింది.. తెలంగాణలో బీజేపీ నేతలు ఇప్పుడేమంటారు.? హైద్రాబాద్‌లో భారీ వర్షాలు కురిసి, పలు ప్రాంతాలు ముంపుకి గురైతే ఓవరాక్షన్ చేసిన బీజేపీ నేతలు, బెంగళూరుకి వెళ్ళి అక్కడి ప్రభుత్వాన్ని నిలదీయగలరా.? అంటూ తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు, కార్యకర్తలు తెగ హడావిడి చేసేస్తున్నారు. నవ్విపోదురుగాక మనకేటి సిగ్గు.? అన్నట్లుంది వ్యవహారం. లేకపోతే, హైద్రాబాద్‌లో ముంపు సమస్యపై తెలంగాణ బీజేపీ నేతలు మాట్లాడటాన్ని ఎలా తప్పు పట్టగలం.? హైద్రాబాద్ వరదలు, తెలంగాణకు సంబంధించిన సమస్య. బెంగళూరు వరదలు కర్నాటకకు సంబంధించిన సమస్య.
సరే, బీజేపీ జాతీయ పార్టీ గనుక, అక్కడొకలా, ఇక్కడొకలా వ్యవహరించడాన్ని కొంతవరకు ప్రశ్నించొచ్చు. కానీ, ఇంతలానా.? మరీ ఇంత బాధ్యతారాహిత్యమా.? తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి ఆరేళ్ళు పూర్తయిపోయింది. ఆరేళ్ళ పాలనలో హైద్రాబాద్‌ని టీఆర్ఎస్ ఏం ఉద్ధరించింది.? అన్న ప్రశ్నకు టీఆర్ఎస్ నేతలు సమాధానం చెప్పాలి. హైద్రాబాద్‌ని విశ్వనగరంగా పేర్కొనడమొక్కటీ సరిపోదు. ఆ విశ్వనగరం మాటున, విశ్వనరకం ఏంటో బయటపడిపోయింది భారీ వర్షాలు, వరదలతో. రికార్డు స్థాయి వర్షం కురిసింది కాబట్టి, ఇది తమ తప్పు కాదని టీఆర్ఎస్ చెబితే అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు.
ఎంతమంది ఈ ఉత్పాతం కారణంగా ప్రాణాలు కోల్పోయారన్నదానిపై భిన్న వాదనలున్నాయి. వందలాది వాహనాల ఆచూకీ తెలియకుండా పోయింది. ఎన్ని భూగర్భంలో కలిసిపోయాయో తెలియని దుస్థితి. ఇది నిజంగానే ప్రకృతి వైపరీత్యం. అదే సమయంలో పాలకుల నిర్లక్ష్యం కారణంగానే ఈ దుస్థితికి వచ్చింది. గత పాలకులు, ప్రస్తుత పాలకులు.. అందరూ బాధ్యత వహించాల్సిందే. బెంగళూరులో వరదల వ్యవహారాన్ని అక్కడి రాజకీయాలు చూసుకుంటాయ్. ఆ పేరు చెప్పి, హైద్రాబాద్‌లో అసలు సమస్యే లేదని టీఆర్ఎస్ చెప్పాలనుకుంటే అంతకన్నా దివాళాకోరు రాజకీయం ఇంకోటుండదు.
992723 258775Wow, fantastic blog structure! How lengthy have you been blogging for? 305512
908072 589451Woh I like your content material , saved to bookmarks ! . 406605
717855 300468wonderful post. Neer knew this, thanks for letting me know. 652025
265440 263201Dude.. My group is not considerably into searching at, but somehow I acquired to read several articles on your weblog. Its wonderful how fascinating it is for me to pay a visit to you fairly often. 93235
52019 268423You completed numerous nice points there. I did a search on the problem and identified practically all people will have exactly the same opinion along with your weblog. 848852
915034 69003Great post. I previousally to spend alot of my time water skiing and watching sports. It was quite possible the best sequence of my past and your content kind of reminded me of that period of my life. Cheers 115224
344060 569728Lovely sharp post. Never considered that it was that effortless. Praises to you! 974789