సింగర్ రాహుల్ సిప్లిగంజ్ది ఫన్‌తో కూడిన యాటిట్యూడ్. కోపం ఊరికే వచ్చేస్తుంది, ఆ తర్వాత వెంటనే రియలైజ్ అయిపోతాడు. కానీ, వెంటనే కోపమొచ్చేయడం.. వెంటనే సర్దుకుపోవడం అనే వైఖరి బిగ్‌బాస్ హౌస్‌లో ఎవరికీ నచ్చడంలేదు. రాహుల్ సిప్లిగంజ్ని బాగా ఇష్టపడే పునర్నవి భూపాలం కూడా ఇదే విషయమై రాహుల్‌ని పదే పదే హెచ్చరిస్తూ వస్తోంది.
తాజా ఎపిసోడ్లో ఎలిమినేషన్ నామినేషన్స్ సందర్భంగా పునర్నవి, రాహుల్‌ని నామినేట్ చేసింది. పునర్నవి – రాహుల్ మధ్య ‘బిగ్ కెమిస్ట్రీ’ నడుస్తున్న విషయం విదితమే. నామినేట్ చేసిన అనంతరం కారణం చెబుతూ పునర్నవి కొంత ఉద్వేగానికి లోనయ్యింది. ‘నిన్ను నువ్వు మార్చుకో.. లేకపోతే చాలా కష్టం..’ అని ప్రేమగా హెచ్చరించింది. మరోపక్క, నామినేషన్ ప్రక్రియలో అత్యధిక ఓట్లు రాహుల్ సిప్లిగంజ్‌కే వచ్చాయి.
ఆ కోణంలో చూస్తే, ఈ సీజన్‌కి ఇదే అతి పెద్ద రికార్డ్ అనుకోవచ్చు. దానర్థం హౌస్‌లో ఒకరిద్దరు మినహా రాహుల్ యాటిట్యూడ్‌ని ఎవరూ సమర్థించడంలేదన్నమాట. నామినేషన్స్ ప్రక్రియ సందర్భంగా రాహుల్, కన్ఫెషన్ రూమ్‌లోకి వెళ్ళి తాను నామినేట్ చేయదలచుకున్న వ్యక్తుల గురించి చెప్పాల్సి వచ్చింది. శ్రీముఖి తనను అపార్థం చేసుకుందనీ, ఎంతలా ఆమెతో కలిసిపోవాలనుకున్నా కుదరవడంలేదనీ, తనను విలన్‌గానే చూస్తోందని ఆవేదన వ్యక్తం చేశాడు రాహుల్.
కాగా, నామినేషన్ ప్రక్రియ సందర్భంగా రాహుల్ మొహాన రంగు కొట్టి మరీ ‘కసి’ తీర్చుకోవాలన్న శ్రీముఖికి ఆ కోరిక నెరవేరలేదు. రాహుల్ లాగానే నామినేషన్ కోసం ఓటింగ్ చేయడానికి శ్రీముఖి, కన్ఫెషన్ రూమ్‌కి వెళ్ళాల్సి వచ్చింది. ముందు అనుకున్నట్టుగానే ఆమె రాహుల్‌ని నామినేట్ చేసింది.
491917 607159hi!,I like your writing so much! share we communicate a lot more about your post on AOL? I call for an expert on this area to solve my problem. Perhaps thats you! Looking forward to see you. 259204