‘రాహులా.. డింకచకా.. డింకచకా..’ అంటూ ఓ పక్క వితిక షెరు, పునర్నవి భూపాలం.. డాన్సులేస్తోంటే, శ్రీముఖి పరిస్థితి ఎలా వుంటుందో ఒక్కసారి ఊహించుకోండి.! పొరపాటున చల్లదనం ఎక్కువైతే, ఆ తప్పు రాహుల్ సిప్లిగంజ్‌దే. వర్షం పడినా, దానికి కారణం రాహుల్ సిప్లిగంజ్ మాత్రమే. ఇదీ బిగ్‌బాస్ రియాల్టీ షో మూడో సీజన్‌లో శ్రీముఖి తీరు. ‘బెస్ట్ ఫ్రెండ్’ అనే మాటకి అర్థమే మార్చేస్తోంది శ్రీముఖి. నిజానికి, రాహుల్ సిప్లిగంజ్‌ని శ్రీముఖితోపాటు హౌస్‌లో చాలామంది టార్గెట్ చేస్తున్నారు. అందులో కొందరు జెన్యూన్‌గానే, రాహుల్ తప్పుల్ని ఎత్తిచూపుతున్నారు. రాహుల్ వ్యహారశైలి అతన్ని ఎంతో ఇష్టపడే పునర్నవికి కూడా నచ్చడంలేదు.
కానీ, రాహుల్ విషయంలో శ్రీముఖి చేస్తోన్న ‘ఎక్స్‌ట్రాలు’ మాత్రం, బిగ్‌బాస్ చూస్తోన్నవారిలో ఎవరికీ నచ్చకపోవడం గమనార్హం. మహేష్‌ని టాస్క్ సందర్భంగా రాహుల్ ఏదో అనకూడని మాట అన్నాడట. ఆ విషయమై ఆల్రెడీ ‘దోషి’గా తేలాడు. అంతకు ముందే ఆ విషయమై రాహుల్, మహేష్‌కి క్షమాపణ చెప్పాడు. మళ్ళీ వీకెండ్ ఎపిసోడ్‌లో హోస్ట్ నాగార్జున సాక్షిగా క్షమాపణ చెప్పాడు కూడా. సరే, ఆ విషయాన్ని శ్రీముఖి ప్రస్తావించడం తప్పేమీ కాదు. ‘దోషి’ అవునా.? కాదా.? అని అడిగితే, ‘అవును రాహుల్ దోషి’ అని శ్రీముఖి ప్లకార్డు చూపించింది మిగతా కంటెస్టెంట్స్‌తో కలిసి. అక్కడితో ఆ ఎపిసోడ్ అయిపోయింది.
శ్రీముఖిని ప్రత్యేకంగా నాగ్ ఇంకో సన్నివేశంలో కంప్లయింట్ చెప్పమంటే, మళ్ళీ పాత కథే చెప్పింది. పోనీ, కొత్త కథ ఏదన్నా చెబితే అది ఇంకో లెక్క. ‘నేను పదే పదే చెబుతున్నాను.. మాట తీరు మార్చుకోవడంలేదు.. నా బెస్ట్ ఫ్రెండ్ అయినా నా మాట వినడంలేదు..’ అంటూ శ్రీముఖి చెప్పిన కథ ఎవరికీ నచ్చడంలేదు. కుప్పలు తెప్పలుగా సోషల్ మీడియాలో మీమ్స్ హల్‌చల్ చేస్తున్నాయి శ్రీముఖికి వ్యతిరేకంగా. ‘రాహుల్ బెస్ట్ కంటెస్టెంట్ అని చెప్పలేం.. కానీ, శ్రీముఖి చెత్త కంప్లయింట్స్ కారణంగా రాహుల్ ఇమేజ్ పెరిగిపోతోంది..
గత సీజన్‌లో కౌశల్‌తో పోల్చితే ఏమాత్రం కాన్ఫిడెంట్‌గా కన్పించని రాహుల్‌ని, కౌశల్ కంటే బిగ్ స్టార్‌ని చేసేదాకా శ్రీముఖి ఊరుకునేలా లేదు.. శ్రీముఖి ఎంతలా రాహుల్‌ని వ్యతిరేకిస్తే.. రాహుల్‌కి అంత మేలు జరుగుతుంది..’ అని సోషల్ మీడియాలో అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎప్పుడైతే రాహుల్ సేఫ్ అయ్యాడని నాగ్ ప్రకటించాడో, అంతే.. శ్రీముఖి ఒక్కసారిగా షాక్‌కి గురయ్యింది. అదే ఇంకో కంటెస్టెంట్ ఎవరైనా సేఫ్ అయి వుంటే.. తాను ఇంకా ఎలిమినేషన్‌లోనే వున్నా.. శ్రీముఖి ఎగిరి గంతేసేదే.
