Switch to English

నేడే విడుదల: రాజుగారి బాణం ‘లక్ష్యాన్ని’ ఛేదించేనా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,469FansLike
57,764FollowersFollow

మరికొద్ది గంటల్లోనే రాజుగారి బాణం.. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో ‘లక్ష్యాన్ని’ తాకనుందట.! ఈ విషయమై ప్రముఖ న్యాయవాది జంధ్యాల రవిశంకర్‌ సోషల్‌ మీడియా వేదికగా ప్రశ్నించారు. ‘లక్ష్యాన్ని ఛేదిస్తుందా..’ అంటూ ఆయన ట్వీటేశారు. గత కొద్ది రోజులుగా నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజుకీ, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకీ మధ్య ‘మాటల యుద్ధం’ జరుగుతున్న విషయం విదితమే.

రఘురామకృష్ణరాజుకి ఇటీవల వైసీపీ ముఖ్య నేత, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి షోకాజ్‌ నోటీస్‌ కూడా జారీ చేశారు. ఈ నేపథ్యంలో రఘురామకృష్ణరాజు, ఢిల్లీ వేదికగా రసవత్తర రాజకీయం నడిపారు. కేంద్ర ప్రభుత్వ పెద్దలతో సమావేశమయ్యారు. కేంద్ర ఎన్నికల సంఘం అధికారులతో చర్చించారు. ‘వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఉనికిని’ ఆయన ప్రశ్నించారు. అదసలు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కాదు, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌.. అంటున్నారు రఘురామకృష్ణరాజు. ‘పార్టీ గుర్తింపుకే విజయసాయిరెడ్డి ఎసరు పెట్టేలా వున్నారు..’ అంటూ రఘురామరాజు చేసిన వ్యాఖ్యల్లో ఆంతర్యం ఏంటన్నది అర్థం చేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు.

ఇక, తనకు విజయసాయిరెడ్డి జారీ చేసిన షోకాజ్‌ నోటీస్‌పై రఘురామకృష్ణరాజు ఈ రోజు పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డికి సమాధానమిస్తారట. అంతేనా.? అంతకు మించి ఇంకేమైనా వుంటుందా.? ఏమోగానీ, ఈ రోజు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి రఘురామకృష్ణరాజుకి స్పష్టత రాబోతోందనీ, ఆ తర్వాత అన్ని విషయాల్నీ ఆయన మీడియా ముందు చెబుతారనీ, రేపు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డికి ఆయన లేఖ రాస్తారనీ తెలుస్తోంది.

ఈలోగా, ఈ రోజు విజయసాయిరెడ్డికి ఇంకో స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఆయన ఇవ్వబోతున్నారని సమాచారమ్. కొద్ది రోజుల క్రితం, ప్రముఖ న్యాయవాది జంధ్యాల రవిశంకర్‌, తన ట్వీట్‌లో రఘురామకృష్ణరాజు వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ, ‘షోకాజ్‌ నోటీస్‌కి సమాధానమిస్తారా.? ప్రశ్నాస్త్రాలు సంధిస్తారా.?’ అంటూ ట్వీటేసిన విషయం విదితమే. ఆయన ట్వీటేసినట్లే, రఘురామకృష్ణరాజు.. జవాబు స్థానంలో ప్రశ్నాస్త్రాలు సంధించారు. సో, ఇప్పుడూ రఘురామకృష్ణరాజు ‘టార్గెట్‌’ మిస్‌ అయ్యేలా కన్పించడంలేదు.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

Ritu Varma: నభా నటేశ్-ప్రియదర్శికి రీతూవర్మ క్లాస్.. ట్వీట్ వార్ వైరల్

Ritu Varma: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ‘డార్లింగ్’ సంబోధనపై మాటల యుద్ధం వైరల్ అయిన సంగతి తెలిసిందే....

Chiranjeevi: చిరంజీవితో రష్యన్ సినిమా ప్రతినిధుల భేటీ.. చర్చించిన అంశాలివే

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)తో రష్యా నుంచి వచ్చిన మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి...

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్...

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం...

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh)....

రాజకీయం

రఘురామకృష్ణరాజు పంతం పట్టి మరీ సాధించుకున్నారుగానీ.!

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు, వైసీపీని వీడి టీడీపీలో చేరి, టీడీపీ నుంచి ఉండి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీకి దిగుతున్న సంగతి తెలిసిందే. నర్సాపురం లోక్ సభ సీటుని బీజేపీ నుంచి ఆశించి...

ఎలక్షన్ కమిషన్ నెక్స్ట్ టార్గెట్ ఏపీ సీఎస్, డీజీపీ!

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో ఫిర్యాదులు అందిన పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఇప్పటికే బదిలీ...

21 అసెంబ్లీ సీట్లు.! జనసేన ప్రస్తుత పరిస్థితి ఇదీ.!

మొత్తంగా 21 అసెంబ్లీ సీట్లలో జనసేన పార్టీ పోటీ చేయబోతోంది.! వీటిల్లో జనసేన ఎన్ని గెలవబోతోంది.? పోటీ చేస్తున్న రెండు లోక్ సభ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ఎంత బలంగా వుంది.? ఈ...

గ్రౌండ్ రిపోర్ట్: నగిరిలో రోజా పరిస్థితేంటి.?

ముచ్చటగా మూడోసారి నగిరి నియోజకవర్గం నుంచి రోజా గెలిచే అవకాశాలున్నాయా.? అంటే, ఛాన్సే లేదంటోంది నగిరి ప్రజానీకం.! నగిరి వైసీపీ మద్దతుదారులదీ ఇదే వాదన.! నగిరి నియోజకవర్గంలో రోజాకి వేరే శతృవులు అవసరం...

పవన్ కళ్యాణ్‌కీ వైఎస్ జగన్‌కీ అదే తేడా.!

ఇతరుల భార్యల్ని ‘పెళ్ళాలు’ అనడాన్ని సభ్య సమాజం హర్షించదు. భార్యల్ని కార్లతో పోల్చడం అత్యంత జుగుప్సాకరం.! ఈ విషయమై కనీస సంస్కారం లేకుండా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

ఎక్కువ చదివినవి

అవినాష్ వర్సెస్ సునీత.! కడపలో వైసీపీ ఖేల్ ఖతం.!

సీబీఐ ఛార్జిషీట్‌లో పేర్కొన్న అంశాల్నే ప్రస్తావిస్తున్నారు మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి.! 2019 ఎన్నికల సమయంలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగితే, సీబీఐ విచారణ కోసం...

వైసీపీ మార్కు సౌమ్యులు, బుద్ధి మంతులు..!

వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు తెలుసు కదా.? చాలా మంచోడు, సౌమ్యుడు.. ఇంకా నయ్యం.. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమేనని అన్లేదు.! మరో వైసీపీ ఎమ్మెల్యే, మంత్రి కూడా అయిన అంబటి రాంబాబు...

పవన్ కళ్యాణ్ పై రాయితో దాడి

ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన 'వారాహి' యాత్రలో స్వల్ప అపశృతి చోటుచేసుకుంది. గుంటూరు జిల్లా తెనాలిలో పవన్ ప్రసంగిస్తుండగా.. గుర్తుతెలియని దుండగుడు ఆయనపై రాయి విసిరాడు. రాయి...

Ram Charan: ‘డాక్టర్ రామ్ చరణ్’.. వేల్స్ యూనివర్శిటీ అరుదైన గౌరవం

Ram Charan: మెగా పవర్ స్టార్ నుంచి గ్లోబల్ స్టార్ స్థాయికి ఎదిగిన రామ్ చరణ్ (Ram Charan) ఇప్పుడు మరో అరుదైన గౌరవం అందుకున్నారు. ‘డాక్టర్’ రామ్ చరణ్ అయ్యారు. చెన్నైకి...

Jr.Ntr: ఎన్టీఆర్ తో ఊర్వశి రౌతేలా సెల్ఫీ..! సారీ చెప్పిన నటి.. ఎందుకంటే..

Jr.Ntr: యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr.Ntr) బాలీవుడ్ (Bollywood) లోకి అడుగు పెడుతున్న సంగతి తెలిసిందే. హృతిక్ రోషన్ తో కలిసి వార్-2 (War 2) సినిమాలో నటిస్తున్నాడు. ఇందుకు సంబంధించిన షూటింగ్...