వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణ రాజు.. త్వరలో తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. అయితే.. తనపై అనర్హత వేటు వేయించాలని చూస్తున్నారని.. వారికి తాను వారం సమయం ఇస్తున్నానని.. వారి వల్ల కాకపోతే.. అప్పుడు తానే రాజీనామా చేస్తానని అన్నారు. వైసీపీ నేతలు.. తమ వల్ల కావడం లేదని చెప్తే రాజీనామా చేస్తానన్నారు. వారంలో తమ నిర్ణయం చెప్పాలని వైసీపీ నాయకుల్ని, అధిష్టానాన్ని ఉద్దేశించి అన్నారు.
ఎంపీ పదవికి రాజీనామా చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్తానని.. వైసీపీపై ఉన్న వ్యతిరేకతను ఎన్నికల ద్వారా తెలియజేస్తానని అన్నారు. ప్రజల కోసం, రాష్ట్రానికి పట్టిన దరిద్రాన్ని వదిలించడం కోసం.. రాజధానిగా అమరావతే కొనసాగాలని ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు రఘురామ చెప్పారు. రఘురామ చాలెంజ్ పై వైసీపీ వర్గాలు ఇంతవరకూ స్పందించ లేదు. మరి.. వైసీపీ అధినాయకత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.