Switch to English

రఘురామకృష్ణరాజు రాజీనామాస్త్రం: వైఎస్సార్సీపీకి ‘తెగువ’ వుందా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,518FansLike
57,764FollowersFollow

తిరుపతి లోక్ సభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో గెలిచారు.. కడప జిల్లా బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో గెలిచారు.. స్థానిక ఎన్నికల్లో దుమ్మురేపేశారు.. అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తమకు తిరుగే లేదని చెప్పుకుంటున్నారు.. అయినాగానీ, ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైసీపీకి ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు అంటే ఎందుకంత భయం.?

పొద్దున్న లేస్తే రఘురామ, అధికార వైసీపీ మీద దుమ్మెత్తి పోస్తూనే వుంటారు. ఈ గోల భరించలేక, ఆయన మీద అడ్డోగులగా కేసులు బనాయించి, లోపలేసి.. కుమ్మేశారు కూడా (అలాగని బాధితుడు రఘురామ ఆరోపిస్తున్నారు). అయినాగానీ, రఘురామ ‘పోటు’ నుంచి తప్పించుకోలేకపోతోంది అధికార వైసీపీ. ఈ నస ఎందుకు.? రఘురామ మీద అనర్హత వేటు వేయించెయ్యొచ్చు కదా.? అంటే, ప్రత్యేక విమానాలేసుకుని ఢిల్లీకి వెళ్ళి బొక్కబోర్లా పడ్డా, వైసీపీకి అది సాధ్యం కాలేదు.

ఎందుకీ తలనొప్పి, వైసీపీ నుంచి ఆయన్ని బహిష్కరించేయొచ్చు కదా.? అంటే, ఆ ధైర్యమూ వైసీపీ అధినాయకత్వానికి లేదాయె. ఇంతకీ, రఘురామకృష్ణరాజుకి ఇంత ధైర్యం ఎక్కడిది.? ఆయన మొండతనానికి అసలు కారణమేంటి.? ఇంత మొండిగా ఆయనెందుకు వైసీపీని ఢీకొడుతున్నారు.? వైసీపీలో వుంటే, ఆయనకు కొన్ని పనులు అవుతాయ్.. మరెందుకు వైసీపీతో పంచాయితీ పెట్టుకుంటున్నారు.?

కారణం ఏదైతేనేం.. రఘురామకృష్ణరాజు మాత్రం వైసీపీకి పక్కలో బల్లెంలా తయారయ్యారు.. అదే పద్ధతి కొనసాగిస్తున్నారు. ‘ఇక ఇలా కాదు, వారం రోజులు సమయం ఇస్తున్నా.. నా మీద అనర్హత వేటు వేయించండి.. అందుకు సిద్ధమా.? అలాగైతే, ఎనిమిదవ రోజున నేను రాజీనామా చేస్తాను.. వారం రోజుల సమయం సరిపోదా.? రెండు వారాలు తీసుకోండి.. పదిహేనో రోజున రాజీనామా చేస్తా..’ అంటూ రఘురామ తాజాగా సవాల్ విసిరారు.

ఎలాగూ రాజీనామా చేస్తానంటున్నారు గనుక, రాజీనామా చెసెయ్యక.. ఈ కండిషన్లు ఎందుకు పెడుతున్నట్టు.? వైసీపీ అసమర్థతను చాటేందుకోసమే సుమీ.! నిజానికి, వైసీపీకి ఇది బంపర్ ఆఫర్. రఘురామపై అనర్హత వేటు పడితే, ఉప ఎన్నిక వస్తుంది.. నర్సాపురంలో బంపర్ విక్టరీ కొట్టేందుకు వైసీపీకి అవకాశం దొరుకుతుంది. కానీ, రఘురామపై అనర్హత వేటు వేయించేంత సీన్ వైసీపీకి లేదాయె.

వైసీపీకి అంత సత్తా లేదని తెలిసే, రఘురామ.. కయ్యానికి కాలుదువ్వుతున్నారు.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Ram Charan Birthday Special: కథల ఎంపికలో రామ్ చరణ్ స్పెషాలిటీ...

Ram Charan: మెగా ఫ్యామిలీ హీరోలకు మాస్ ఇమేజ్ ఓ వరం. దశాబ్దాలుగా మెగాస్టార్ చిరంజీవి సాధించిన క్రేజ్ అది. తనదైన శైలి నటన, డైలాగులు,...

Kamal Haasan: ‘కల్కి’లో తన పాత్ర రివీల్ చేసిన కమల్ హాసన్

Kamal Haasan: అగ్ర కథానాయకుడు కమల్ హాసన్ (Kamal Haasan) ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. మరోవైపు లోక్ సభ ఎన్నికల సమయం కావడంతో...

Ram Charan: ‘సుజిత్ పెళ్లికి ఎందుకు పిలవలేదు..’ ఆనంద్ మహీంద్రాకు రామ్...

Ram Charan: సుజిత్ పెళ్లికి నన్నెందుకు ఆహ్వానించలేదని రామ్ చరణ్ (Ram Charan) ప్రశ్నించడంతో పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) సమాధానమిచ్చారు. ఇంతకీ...

Ram Charan Birthday special: విమర్శలకు చెక్.. విమర్శకులకు సమాధానం.. రామ్...

Ram Charan: సినిమా బాషలో ఓ మాట ఉంది. ‘విమర్శకుల మెప్పు పొందిన సినిమా.. హీరో’ అని. సినిమాలో లోపాలు, హీరో నటనపై, దర్శకుడి ప్రతిభపై...

Chiranjeevi: హీరో శ్రీకాంత్ కి మెగా సర్ ప్రైజ్..

Chiranjeevi: శంకర్ దాదా ఎంబీబీఎస్ లో.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తిని శంకర్ (చిరంజీవి) కౌగిలించుకోవాలని భావిస్తే అతను తటపటాయిస్తాడు. ‘అరె వెళ్లరా భాయ్.. ఈ...

రాజకీయం

ఎన్నికల బరిలో కంగనా రనౌత్.. పోటీ అక్కడ నుంచే

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్( Kangana Ranaut) భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేయనున్నారు. ఆ పార్టీ ఈరోజు అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఇందులో...

Chandrababu Naidu: పిఠాపురం కోసం చంద్రబాబు మాస్టర్ ప్లాన్.!

కుప్పం నియోజకవర్గాన్ని గెలవడం ఎంత ముఖ్యమో, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలవడం కూడా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడికి అంతే ముఖ్యం.! ‘వెన్నుపోటు రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్’ అనే...

పులివెందులలో వైసీపీకి ఎదురుగాలి.? నిజమేనా.!?

వై నాట్ కుప్పం.. అన్నారు కదా.? పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఒక్కడ్ని ఓడించేందుకు గుంపులు గుంపులుగా వైసీపీ ముఖ్య నేతలంతా ఎందుకు మోహరించినట్టు.? ఇంతకీ, పులివెందుల పరిస్థితేంటి.? వాస్తవానికి పులివెందులలో వైఎస్ కుటుంబానికి ఎదురే...

కర్మ ఈజ్ బ్యాక్: గులాబీ పార్టీ గల్లంతే.!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాస్త గట్టిగా తలచుకుంటే, తెలంగాణ నుంచి భారత్ రాష్ట్ర సమితి పూర్తిగా ఔట్ అయిపోతుంది. గులాబీ పార్టీలో కేసీయార్, ఆయన తనయుడు కేటీయార్, కుమార్తె కేటీయార్ మాత్రమే...

డ్రగ్స్, గంజాయి, ఎర్ర చందనం.! మూడు రాజధానులంటే ఇవా.?

ఒకాయన వైసీపీ అంతర్జాతీయ అధికార ప్రతినిథినంటూ సోషల్ మీడియా వేదికగా సందడి చేస్తున్నాడు. యూ ట్యూబ్ ఛానల్ ద్వారా, భలే నవ్వులు పూయిస్తున్నాడు.! జస్ట్ నవ్వులే అనుకునేరు.. అందులో చాలా చాలా విషయం...

ఎక్కువ చదివినవి

Ram Charan Birthday special: మిస్టర్ కూల్.. ‘రామ్ చరణ్’

Ram Charan: రంగం ఏదైనా రాణించేందుకు ప్రతిభతోపాటు నడవడిక, క్రమశిక్షణ, నిబద్దత మరీ ముఖ్యం. ఇవే ఒక వ్యక్తిని కొలిచే కొలమానాలు. ప్రతిభతో రాణించొచ్చు కానీ గౌరవం దక్కించుకోలేం. ఇవన్నీ ఉంటే అతడు...

డ్రగ్స్ దొంగలెవరు.? రాష్ట్రం ఏమైపోతోంది.?

అబ్బే, రాష్ట్రం ఏమైపోతోందన్న బెంగ ఎవరికీ లేదు. ఎందుకంటే, రాష్ట్రం ప్రధాన రాజకీయ పార్టీలకి ప్రధాన ఆదాయ వనరుగా మారింది తప్ప, రాష్ట్ర శ్రేయస్సు గురించి ఎవరికీ ఎలాంటి చింతా లేదన్నది నిర్వివాదాంశం. విపక్షాల...

వైయస్ షర్మిల వియ్యంకుల వ్యాపారాలపై ఐటి దాడులు

హైదరాబాద్ లోని ప్రముఖ అల్పాహార హోటల్ సంస్థ 'చట్నీస్' పై ఇన్కమ్ టాక్స్ అధికారులు దాడులు చేశారు. భాగ్యనగరం వ్యాప్తంగా 'చట్నీస్' హోటల్ కి ఎన్నో బ్రాంచీలు ఉన్నాయి. ఈ సంస్థ అధినేత...

Kamal Haasan: ‘కల్కి’లో తన పాత్ర రివీల్ చేసిన కమల్ హాసన్

Kamal Haasan: అగ్ర కథానాయకుడు కమల్ హాసన్ (Kamal Haasan) ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. మరోవైపు లోక్ సభ ఎన్నికల సమయం కావడంతో రాజకీయాల్లోనూ నిమగ్నమై ఉన్నారు. ఈ సందర్భంగా...

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో డబుల్ ఇంజిన్ సర్కార్ సాధ్యమేనా.?

ఆంధ్ర ప్రదేశ్‌లో టీడీపీ - జనసేన - బీజేపీ కూటమి ఉమ్మడిగా ఏర్పాటు చేసిన ప్రజా గళం బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొని, ఎన్నికల ప్రచారాన్ని తనదైన స్టయిల్లో ప్రారంభించిన...