Switch to English

‘రాధేశ్యామ్‌’ రివ్యూ: కెమిస్ట్రీ మిస్ అయిన లవ్ స్టోరీ

Critic Rating
( 2.50 )
User Rating
( 2.50 )

No votes so far! Be the first to rate this post.

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,513FansLike
57,764FollowersFollow
Movie రాధే శ్యామ్
Star Cast ప్రభాస్, పూజా హెగ్డే, సత్యరాజ్
Director రాధా కృష్ణ
Producer యువి క్రియేషన్స్
Music జస్టిన్ ప్రభాకరన్
Run Time 2 గం 18 నిమిషాలు
Release 11 మార్చి 2022

బాహుబలి మరియు సాహో ల తర్వాత ప్రభాస్ నటించిన సినిమా అవ్వడంతో సహజంగానే రాధేశ్యామ్‌ పై అంచనాలు భారీగా ఉన్నాయి. పైగా ఈ సినిమా మూడు వందల కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందిన విజువల్ వండర్ మూవీ అంటూ ప్రచారం ఊదరగొట్టారు. ఒక అద్బుతమైన పెయింటింగ్‌ మాదిరిగా ఈ సినిమా ఉంటుంది అంటూ చిత్ర యూనిట్ సభ్యులు పదే పదే ప్రకటించడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. మరి ఆ స్థాయిలో ఈ సినిమా ఉందా అనేది ఈ రివ్యూలో చూద్దాం.

కథ:

ఈ చిత్ర కథ 1976 సంవత్సరంలో సాగుతుంది. విక్రమాదిత్య (ప్రభాస్‌) ఇండియా లోనే అత్యంత ప్రముఖ హస్తసాముద్రికుడు. అతను ఇటలీ కి వెళ్ళిన సమయంలో ప్రేరణను చూస్తాడు. ఆమెతో పరిచయం అవుతుంది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారుతుంది. ఇద్దరి మధ్య ప్రేమకు కొన్ని అవాంతరాలు ఎదురవుతాయి. ఆ అవాంతరాలు ఏంటి? వాటిని ఎలా ఎదిరించి ఇద్దరూ ఏకం అయ్యారు అనేది కథ.

నటీనటులు:

ప్రభాస్ చాలా సంవత్సరాల తర్వాత లవర్ బాయ్ గా కనిపించి మెప్పించాడు. విక్రమాదిత్య లుక్ లో అతడు చాలా స్టైలిష్ గా కనిపించి ఆకట్టుకున్నాడు. ప్రభాస్ నటన విషయంలో ఏమాత్రం తగ్గకుండా తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. అయితే కథానుసారం విక్రమాదిత్య పాత్ర లో ప్రభాస్‌ కి ఎక్కువ సన్నివేశాల్లో నటించే స్కోప్ దక్కలేదు. ఇక ప్రేరణ పాత్రలో నటించిన పూజ హెగ్డే కూడా తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది అనడంలో సందేహం లేదు. ఆమె లుక్స్ పరంగా మంచి మార్కులు సొంతం చేసుకుంది. ప్రభాస్ కి తరహాలోనే ఆమెకు కూడా ఎక్కువ సన్నివేశాలలో తన నటన ప్రతిభను కనబరిచే అవకాశం దక్కలేదు. ఇద్దరి మద్య కెమిస్ట్రీ పీక్స్ లో ఉన్న సన్నివేశాలు లేనే లేవు. కనుక వారికి ఆ ట్యాలెంట్‌ చూసించే అవకాశం రాలేదు. సినిమాల్లో ఇతర నటీనటులు వారి వారి పాత్రలకు తగ్గట్టుగా పర్వాలేదనిపించారు. సినిమాలో చాలా తక్కువ పాత్రలను దర్శకుడు చూపించాడు. కనుక ఎక్కువ వారి నటన గురించి చర్చించడానికి లేదు.

సాంకేతిక నిపుణులు:

దర్శకుడు రాధాకృష్ణ తాను అనుకున్న ప్రేమకథను ఎక్కడ కూడా డీవియేట్‌ కాకుండా చూపించడంలో సఫలమయ్యాడు అనే చెప్పాలి. ప్రతి సన్నివేశంలో కూడా లవ్‌ స్టోరీ ని చూపించే ప్రయత్నం చేశాడు. కానీ లీడ్ పెయిర్‌ మధ్య రొమాంటిక్ సన్నివేశాలు.. లవ్‌ కెమిస్ట్రీ సన్నివేశాలు ఉండి ఉంటే బాగుండేది. ప్రభాస్ ను హస్తసాముద్రికుడు గా చూపించి ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేసి ఆయన సఫలమయ్యాడు అని చెప్పాలి. హీరో హీరోయిన్ మధ్య సన్నివేశాల విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకోవాల్సి ఉంది. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది, అద్భుతమైన విజువల్స్‌ ను సినిమాటోగ్రఫీ అందించడంలో సఫలమైంది. ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త మెరుగ్గా వ్యవహరించాల్సి ఉంది. నిర్మాణాత్మక విలువల గురించి ప్రత్యేకంగా మాట్లాడాల్సిన పనిలేదు.. ఎందుకంటే మూడు వందల కోట్ల బడ్జెట్ సినిమా కనుక ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక సంగీతం విషయానికొస్తే పాటలు బాగున్నాయి. థమన్‌ అందించిన నేపధ్య సంగీతం పర్వాలేదనిపించింది. కొన్ని సన్నివేశాల్లో నేపథ్య సంగీతం హైలైట్గా నిలిచింది. స్క్రీన్ ప్లే విషయంలో అది కూడా సెకండాఫ్ లో ఇంకాస్త జాగ్రత్తగా ఉండాల్సింది.

పాజిటివ్ పాయింట్స్:

  • నిర్మాణాత్మక విలువలు,
  • సంగీతం

నెగటివ్ పాయింట్స్:

  • కథ ప్రభాస్ మాస్ ఇమేజ్ కు సెట్‌ అయ్యేలా లేదు
  • కామెడీ ఆకట్టుకోలేదు
  • హీరో హీరోయిన్‌ మద్య కెమిస్ట్రీ లేకపోవడం

చివరిగా:

ప్రేక్షకులు ప్రభాస్ నుండి ఒక భారీ కమర్షియల్ సినిమాను ఆశిస్తున్నారు. బాహుబలి మరియు సాహో రేంజ్ లో కాకుండా కచ్చితంగా రాధేశ్యామ్‌ ఒక మంచి సినిమాగా నిలుస్తుంది అంటూ ప్రతి ఒక్కరు మొదట్నుంచి నమ్మకంగా ఉన్నారు. చిత్ర యూనిట్‌ వారు చేసిన ప్రచారం మేరకు అంచనాలు పెట్టుకొని ఎదురు చూశారు. కానీ ఆ అంచనాలను అందుకోవడంలో దర్శకుడు రాధాకృష్ణ విఫలం అయ్యాడు అని చెప్పక తప్పదు. కథ మరియు కథనం విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకోవాల్సి ఉంది. ప్రతి ఒక్క సన్నివేశం కూడా విజువల్ గా అద్భుతంగా చూపించారు అని భావించారు. కానీ హీరో హీరోయిన్ మధ్య రొమాంటిక్ సన్నివేశాలు.. లవ్‌ సన్నివేశాలు ఉండాలనే విషయాన్ని పట్టించుకోలేదు అనిపిస్తుంది. ప్రభాస్ మాస్ ఇమేజ్ కి ఇలాంటి క్లాస్ కథలు సెట్‌ కావేమో అనిపిస్తుంది. ఓవరాల్ గా గత మూడు నాలుగు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న ప్రభాస్ అభిమానులకు విజువల్ ట్రీట్ అయితే ఖాయం కాని పూర్తి స్థాయి కమర్షియల్‌ ఎంటర్టైన్మెంట్ ను మాత్రం ఇవ్వలేకపోయింది.

తెలుగు బులెటిన్ రేటింగ్: 2.5/5.0

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘టిల్లు స్క్వేర్‌’ లో కొత్త అందాలు చూడబోతున్నామా..!

సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొంది మంచి విజయాన్ని సొంతం చేసుకున్న డీజే టిల్లుకు సీక్వెల్‌ గా రూపొంది మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న...

బ్రేకింగ్ : యూఎస్ లో తెలుగు హీరోకి యాక్సిడెంట్‌

జాతిరత్నాలు సినిమాతో స్టార్‌ హీరోగా యూత్‌ లో మంచి క్రేజ్ ను దక్కించుకున్న నవీన్ పొలిశెట్టి ఆ మధ్య మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో...

Kalki 2898AD : ప్రభాస్ కి ఉన్నది ఒకే ఒక్క ఆప్షన్..!

Kalki 2898AD : యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ హీరోగా మహానటి దర్శకుడు నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న కల్కి 2898 ఏడీ సినిమా విడుదల...

Manchu Manoj: ‘చిరంజీవి-మోహన్ బాబు’ పై మంచు మనోజ్ సరదా కామెంట్స్

Manchu Manoj: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) జన్మదిన వేడుకల సందర్భంగా హైదరాబాద్ శిల్పకళావేదికలో జరిగిన కార్యక్రమంలో హీరో మంచు మనోజ్ (Manchu...

Game Changer: ‘గేమ్ చేంజర్’ స్పెషల్ అప్డేట్.. పూనకాలు తెప్పించిన దిల్...

Game Changer: దిగ్గజ దర్శకుడు శంకర్ (Shankar) దర్శకత్వంలో రామ్ చరణ్ (Ram Charan) నటిస్తున్న సినిమా గేమ్ చేంజర్ (Game Changer). నేడు రామ్...

రాజకీయం

టీడీపీ వెకిలి వేషాలకు బాధ్యత ఎవరిది.?

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని అనపర్తి నియోజకవర్గాన్ని బీజేపీకి కేటాయించడాన్ని తెలుగు దేశం పార్టీ మద్దతుదారులు జీర్ణించుకోలేకపోతున్నారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు స్వయంగా, ఈ పంపకాలను డిజైన్ చేసి, ఆమోద ముద్ర...

అన్న జగన్‌కి పక్కలో బల్లెంలా తయారైన చెల్లెలు సునీత.!

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య వ్యవహారానికి సంబంధించి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు, స్వయానా ఆ వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి కౌంటర్ ఎటాక్...

Tillu Square : ఫీల్ అయిన అనుపమ.. టిల్లు రిక్వెస్ట్

Tillu Square : డీజే టిల్లు కు సీక్వెల్ గా రూపొందిన టిల్లు స్క్వేర్ సినిమా రేపు విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. సినిమా విడుదల నేపథ్యంలో నిన్న రిలీజ్ ట్రైలర్ ను...

వైఎస్ జగన్ ‘మేం సిద్ధం’ యాత్ర.! తొలి రోజు అట్టర్ ఫ్లాప్ షో.!

ఏమయ్యింది.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి.? ‘సిద్ధం’ సభల కోసం 18 లక్షల మంది జనాన్ని రప్పించగలిగామని గొప్పలు చెప్పుకున్న వైసీపీ, అట్టహాసంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘మేం సిద్ధం’ బస్సు యాత్ర...

వైసీపీ ఎంపీ వంగా గీతకి ఎందుకింత ప్రజా తిరస్కారం.?

వంగా గీత.. వైసీపీ ఎంపీ.! ఆమె అనూహ్యంగా ఇప్పుడు అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. అదీ పిఠాపురం నియోజకవర్గం నుంచి. కాకినాడ ఎంపీగా పని చేస్తున్న వంగా గీత, అదే పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని...

ఎక్కువ చదివినవి

Kalki 2898AD : ప్రభాస్ కి ఉన్నది ఒకే ఒక్క ఆప్షన్..!

Kalki 2898AD : యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ హీరోగా మహానటి దర్శకుడు నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న కల్కి 2898 ఏడీ సినిమా విడుదల విషయంలో సస్పెన్స్ నెలకొంది. మే 9న...

Manchu Manoj: ‘చిరంజీవి-మోహన్ బాబు’ పై మంచు మనోజ్ సరదా కామెంట్స్

Manchu Manoj: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) జన్మదిన వేడుకల సందర్భంగా హైదరాబాద్ శిల్పకళావేదికలో జరిగిన కార్యక్రమంలో హీరో మంచు మనోజ్ (Manchu Manoj) ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ‘చరణ్, నేనూ...

ఎన్నికల బరిలో కంగనా రనౌత్.. పోటీ అక్కడ నుంచే

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్( Kangana Ranaut) భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేయనున్నారు. ఆ పార్టీ ఈరోజు అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఇందులో...

కవిత, కేజ్రీవాల్.. తర్వాత అరెస్టయ్యేదెవరు.?

దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో తెలంగాణకు చెందిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టు.. ఇంకో సంచలనం. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీయార్ కుమార్తె కవిత...

రాముడి విగ్రహం తల నరికినోళ్ళకి.. అర్చకులు ఓ లెక్కా.?

అంతర్వేది రథం తగలబడితే.. దోషులెవరో దొరకలేదు. వైసీపీ పాలనలో వ్యవస్థలు ఎలా తగలడ్డాయో చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేముంటుంది.? తేనెపట్టుని తీసే ప్రయత్నంలో ఆకతాయిలెవరో మంట పెడితే, అంతర్వేది రథం తగలబెట్టారంటూ వైసీపీ...