చిన్నప్పుడే అమ్మను కోల్పోయిన వ్యక్తి దర్శకుడైతే తను కోల్పోయింది అమ్మనే కాదు జీవితంలో వెలకట్టలేని అమ్మ ప్రేమను అని తెలుసుకొని అమ్మ ప్రేమను, అమ్మాయి ప్రేమకు ముడి పెడుతూ చిత్రీకరించిన చిత్రమే “రాజ్ కహానీ”. రాజ్ కార్తికేన్, చంద్రికా అవస్తి కీలక పాత్రల్లో నటించారు. రాజ్ కార్తికేన్ టైటిల్ రోల్ లో నటిస్తూ స్వీయ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని భాస్కర రాజు, ధార్మికన్ రాజు లు సంయుక్తంగా నిర్మించారు. హనుమాన్ జయంతి సందర్భంగా ఈ చిత్ర యూనిట్ “రాజ్ కహానీ” టీజర్ మరియు ఫస్ట్ లుక్ ను విడుదల చేయడం జరిగింది.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ.. చిన్నప్పుడే అమ్మను కోల్పోయిన వ్యక్తి దర్శకుడై ప్రేమలోని వివిధ కోణాలను మంచి చెడులను అమ్మ ప్రేమను అమ్మాయి ప్రేమకు ముడి పెడుతూ పక్కా కమర్షియల్ హంగులతో తెరకెక్కించిన చిత్రమే ‘రాజ్ కహానీ’. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరవేగంగా జరుపుకుంటుంది. త్వరలో అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి సన్నాహాలు చేస్తున్నామని అన్నారు.