Pushpa 2: పుష్ప2 సినిమాకు తెలంగాణ ప్రభుత్వం బెనిఫిట్ షో ధర వెయ్యికి పైగా నిర్ణయించడంపై మిశ్రమ స్పందన వస్తోంది. అయితే.. దీనికి భిన్నంగా ఓ ధియేటర్లో పుష్ప2 టికెట్ ధర ఏకంగా 3వేలు ఉండటంపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.
ముంబైలోని జియో వరల్డ్ డ్రైవ్లో పీవీఆర్ మైసన్ లో పుష్ప2 టికెట్ ధర 3వేలు చూపిస్తోంది. ఇంత ధరపై సినీ ప్రియులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు ధియేటర్లో ప్రేక్షకులకు వీఐపీ సౌకర్యాలు ఉండటమే కారణం. 34సీట్లు ఉండే మైసన్లోని ఓ స్క్రీన్లో ఉదయం షోలకు 900 ఉండగా సాయంత్రం 7.35షోకి 3వేలు.. జియో వరల్డ్ డ్రైవ్ స్క్రీన్లలో 2000-2200 చూపిస్తోంది.
అడ్జస్టబుల్ ఓపస్ గ్లైడ్ రెక్లయినింగ్ సీట్లు అక్కడి ప్రత్యేకత. మైసన్లో సౌకర్యవంతమైన వెరోనా జీరో వాల్ సీట్లు, బటన్ నొక్కితే కావాల్సిన ఫుడ్, స్క్రీన్ కు తగ్గట్టు సీట్లు అడ్జస్ట్ చేసుకునే వెసులుబాటు, రెండు సీట్ల మధ్య ఫోకస్డ్ లైట్స్, 7.1 డాల్బీ సరౌండ్ సౌండ్ తదితర సౌకర్యాలు అక్కడ ఉన్నాయి.
#Pushpa2 priced at Rs.3000 at PVR’s most luxurious Maison Jio World Drive. pic.twitter.com/JOm2hsMulu
— LetsCinema (@letscinema) December 1, 2024