Switch to English

పుష్ప ది రైజ్ మూవీ రివ్యూ : పర్వాలేదనిపించే యాక్షన్ థ్రిల్లర్

Critic Rating
( 2.50 )
User Rating
( 2.40 )

No votes so far! Be the first to rate this post.

Movie పుష్ప : ది రైజ్ – పార్ట్‌ 1
Star Cast అల్లు అర్జున్ , రష్మికా మందన్న, ఫహాద్‌ ఫాజిల్
Director సుకుమార్
Producer నవీన్ యెర్నేని, వై. రవి శంకర్
Music దేవి శ్రీ ప్రసాద్
Run Time 2 hr 59 Mins
Release 17 డిసెంబరు 2021

అల్లు అర్జున్, సుకుమార్ ల కాంబినేషన్ లో వచ్చిన పుష్ప ది రైజ్ బోలెడన్ని అంచనాలను క్రియేట్ చేయగలిగింది. ఫారెస్ట్ నేపథ్యంలో ఎర్ర చందనం స్మగ్గ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఈ సినిమా ఎలా ఉందో చూద్దామా?

కథ:

పుష్ప రాజ్ (అల్లు అర్జున్) ఎర్ర చందనం స్మగుల్ చేసే లారీ డ్రైవర్. ఈ బిజినెస్ లో టాప్ ప్లేస్ కు చేరాలన్నది పుష్ప రాజ్ కల. తన కల నెరవేర్చుకోవడానికి పుష్ప ఏం చేసాడు? తనకన్నా పైన ఉన్న వాళ్ళను ఎలా ఢీ కొట్టాడు? పోలీసులకు ఎందుకు తిరిగాడు అన్నది మిగతా కథ. ఈ ప్రాసెస్ లో పుష్ప విజయం సాధించాడా లేదా? ఈ మొత్తం వ్యవహారంలో శ్రీవల్లి (రష్మిక మందన్న) పోషించే పాత్ర ఏంటి?

నటీనటులు:

స్మగ్లర్ గా అల్లు అర్జున్ అద్భుతమైన పెర్ఫార్మన్స్ ను కనబర్చాడు ఈ సినిమా ద్వారా. తన బాడీ లాంగ్వేజ్ కానీ, డైలాగ్ డెలివరీ కానీ టాప్ నాచ్ పెర్ఫార్మన్స్ కు సాక్ష్యాలు. ఈ సినిమాను భుజాలపై మోశాడు బన్నీ. తన ఇమేజ్ మేకోవర్ కు హ్యాట్సాఫ్ చెప్పకుండా ఉండలేం. నటుడిగా తనను తాను తరచి చూసుకునే క్రమంలో ఇది ఆరంభం మాత్రమే అని బన్నీ ఎందుకన్నాడో ఈ చిత్రం చూస్తే అర్ధమవుతుంది.

పూర్తిగా డీగ్లామ్ పాత్రలో రష్మిక మెప్పించింది. తన నుండి ఆశించే పెర్ఫార్మన్స్ అందించింది. సునీల్, అనసూయ, ఇతరులు తమ తమ పాత్రల్లో మెప్పిస్తారు. ఫహద్ ఫాజిల్ అందరూ ఊహించినట్లు గానే సెకండ్ హాఫ్ చివర్లో వచ్చినా బలమైన ఇంపాక్ట్ క్రియేట్ చేయగలిగాడు.

సాంకేతిక నిపుణులు:

సుకుమార్ గత చిత్రం రంగస్థలాన్ని ఒక రస్టిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తీర్చిదిద్దాడు. పుష్ప విషయంలో కూడా దాన్నే ఫాలో అయినట్లుగా అనిపిస్తుంది. ఈసారి సెటప్, యాక్షన్ పార్ట్ అన్నీ కూడా భారీ ప్లాట్ ఫామ్ పై పరిచాడు. అయితే ఎంగేజింగ్ విషయంలో రంగస్థలంకి సగం వద్దే ఆగిపోతుంది పుష్ప. రంగస్థలంలో ఉన్న డ్రామా ఇందులో మిస్ అయింది.

స్మగ్లింగ్ రంగంలో టాప్ చేరడానికి ఏం చేయడానికైనా వెనుకాడని పుష్ప రాజ్ కథను చెప్పాలనుకున్నాడు సుకుమార్. రెండు భాగాలుగా ఈ చిత్రాన్ని మలిచే క్రమంలో కథను బాగా సాగదీసినట్లు అనిపిస్తుంది. అందువల్లనే పుష్ప ది రైజ్ మొదటి హాఫ్ లో పెద్దగా ఏం జరగదు. కథ నత్తనడకన సాగుతుంది. మొదటి హాఫ్ లో అయితే ఇంటర్వెల్ బ్లాక్ తప్ప పెద్దగా హై పాయింట్స్ అన్నవే ఉండవు. సెకండ్ హాఫ్ లోనే మెజారిటీ యాక్షన్ అన్నది ఉంటుంది. సెకండ్ పార్ట్ కు కావాల్సిన స్టేజ్ సెట్ అయింది. సెకండ్ పార్ట్ నుండి ఏం ఆశించవచ్చో చిన్న టీజర్ లా క్లైమాక్స్ లో చూపించారు. ఇక ఫస్ట్ హాఫ్ లో వచ్చే లవ్ ట్రాక్ కొంచెం బెటర్ గా ఉంది. విఎఫ్ఎక్స్ కూడా యావరేజ్ గా అనిపిస్తుంది. లవ్ ట్రాక్ లో వచ్చే కామెడీ నవ్విస్తుంది.

దేవి శ్రీ ప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అంత ఎఫెక్టివ్ గా అనిపించదు. అలాగని ఆడియో ఆల్బమ్ కూడా మిగతా సినిమాల రేంజ్ లో చార్ట్ బస్టర్ అవ్వలేదు. సినిమాటోగ్రఫీ అద్భుతంగా అనిపిస్తుంది. ప్రొడక్షన్ డిజైనింగ్ కూడా అంతే. విఎఫ్ఎక్స్ ను పక్కన పెడితే నిర్మాణ విలువలు చాలా రిచ్ గా ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్:

  1. అల్లు అర్జున్ నటన, బాడీ లాంగ్వేజ్, యాస
  2. ఫస్ట్ హాఫ్ లో వచ్చే లవ్ ట్రాక్
  3. ఇంటర్వెల్ సీన్
  4. ఇంటర్వెల్ తర్వాత వచ్చే మొదటి ఫైట్
  5. ఫహద్ ఎంట్రీ తర్వాత ఆఖరి 30 నిముషాలు

మైనస్ పాయింట్స్:

  1. స్లో నరేషన్
  2. విఎఫ్ఎక్స్
  3. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
  4. భారీ రన్ టైం
  5. సమంత ఐటమ్ సాంగ్ తప్పితే గ్లామర్ లేదు.

చివరిగా:

పుష్ప ది రైజ్ పర్వాలేదనిపించే యాక్షన్ ఎంటర్టైనర్. స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో మంచి కథనే ఎంచుకున్నాడు సుకుమార్. సెకండ్ పార్ట్ కు కూడా పెర్ఫెక్ట్ బేస్ ను ఆఖరి 30 నిమిషాల ద్వారా సిద్ధం చేసుకున్నాడు. అయితే అంతకు ముందు ఉన్న స్లో నరేషన్ కంప్లైంట్ ను మాత్రం అది ఓవర్ కమ్ చేయలేకపోయింది. అల్లు అర్జున్ తన వంతుగా విశ్వప్రయత్నమే చేసాడు. సినిమా ఎండింగ్ ప్రకారం చూస్తే అసలు విషయం అంతా సెకండ్ పార్ట్ లో ఉన్నట్లు అనిపిస్తుంది. మొత్తంగా, పుష్ప ది రైజ్: పర్వాలేదనిపించే యాక్షన్ ఎంటర్టైనర్.

తెలుగు బులెటిన్ రేటింగ్: 2.5/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ లా మీరూ వాయిదా వేసుకోండి: పేర్ని నాని

కరోనా కేసుల నేపథ్యంలో ధియేటర్లలో 50 శాతం ఆక్యుపెన్సీ నిర్ణయం తీసుకున్నట్టు రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. రామ్ గోపాల్ వర్మతో...

హిందీలో అస్సలు ‘తగ్గేదే లే’ పుష్ప

ఐకాన్ స్టార్ గా టైటిల్ మార్చుకున్న అల్లు అర్జున్ నిజంగా తాను ఆ టైటిల్ కు సరిపోతానని పుష్ప ది రైజ్ తో నిరూపించుకున్నాడు. ఈ...

ప్రభాస్ ప్రాజెక్ట్ కె రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేసిన దత్

రెబెల్ స్టార్ ప్రభాస్ మల్టిపుల్ ప్రాజెక్ట్స్ తో ఫుల్ బిజీగా ఉన్న విషయం తెల్సిందే. దాదాపుగా 2000 కోట్లకు పైన బిజినెస్ చేయగల చిత్రాలు ప్రభాస్...

శ్యామ్ సింగ రాయ్ డైరెక్టర్ పై చరణ్ ఆసక్తి

ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆర్ ఆర్ ఆర్, ఆచార్య చిత్రాల రిలీజ్ ల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. ప్రస్తుతం రామ్ చరణ్...

సంక్రాంతి సినిమాల లిస్ట్ ఫైనల్ అయిందిగా

ఎప్పుడైతే ఆర్ ఆర్ ఆర్, రాధే శ్యామ్ లు సంక్రాంతి రేసు నుండి పక్కకు తప్పుకున్నాయో ఇక అదే అదునుగా చాలా చిన్న చిత్రాలు సంక్రాంతి...

రాజకీయం

ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ లా మీరూ వాయిదా వేసుకోండి: పేర్ని నాని

కరోనా కేసుల నేపథ్యంలో ధియేటర్లలో 50 శాతం ఆక్యుపెన్సీ నిర్ణయం తీసుకున్నట్టు రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. రామ్ గోపాల్ వర్మతో భేటీ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు....

’13న నర్సాపురం వస్తున్నా.. ఫిబ్రవరి 5లోపు అనర్హత వేయించండి..’ రఘురామ సవాల్

ఏపీ సచివాలయ ఉద్యోగులకు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు మద్దతు తెలిపారు. ‘ఏపీ సచివాలయ ఉద్యోగుల డిమాండ్లలో న్యాయముంది. సచివాలయ ఉద్యోగులకు నా మద్దతు తెలుపుతున్నాను. విజయసాయిరెడ్డి అండమాన్ దీవుల్లో తిరగడం మానేసి...

కరోనా తీవ్రమవుతోంది.. అప్రమత్తంగా ఉండండి: పవన్ కల్యాణ్..

దేశంలో రోజురోజుకీ తీవ్రమవుతున్న కరోనా పరిస్థితులపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందిస్తూ.. ఈమేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ‘దేశంలో కరోనా వ్యాప్తి తీవ్రమవుతున్న తరుణంలో యావత్ ప్రజానీకం అప్రమత్తమవ్వాల్సిన అవసరం...

ఫలిస్తున్న జగన్ ఢిల్లీ టూర్: ప్రత్యేక హోదా వచ్చేస్తోందా.?

కలిసొచ్చే అంశమేదన్నా వుందంటే, దానికి తమ ‘పేరు’ తగిలించేసుకోవడం అధికారంలో వున్నవారికి సర్వసాధారణమే. ఏదన్నా తేడా కొడితే మాత్రం, ‘మా ప్రయత్నం మేం చేశాం..’ అంటూ సన్నాయి నొక్కులు నొక్కడం కూడా మామూలే. ముఖ్యమంత్రి...

అన్నీ ఒమిక్రాన్ కేసులే.. కానీ, లెక్క నాలుగు వేలే.!

దేశంలో కోవిడ్ 19 యాక్టివ్ కేసుల సంఖ్య ఏడు లక్షలకు పైగానేనని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. రోజువారీ కొత్త కోవిడ్ 19 పాజిటివ్ కేసుల సంఖ్య నిన్న లక్షా ఎనభై వేలు. చిత్రమేంటంటే,...

ఎక్కువ చదివినవి

దేశంలో కరోనా ఉధృతి..! రెండో రోజూ రికార్డు స్థాయిలో కేసులు

దేశంలో కరోనా ఉధృతి పెరిగిపోయింది. వరుసగా రెండో రోజు కూడా లక్షకు పైగా కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది. పైగా.. ముందురోజు కంటే 21 శాతం పెరుగుదల నమోదైంది. ఈమేరకు కేంద్ర...

త్వరలో.. ఏపీలో జగనన్న స్మార్ట్ టౌన్స్..!

ఇప్పటికే జగనన్న కాలనీలు నిర్మిస్తున్న వైసీపీ ప్రభుత్వం.. త్వరలో మధ్య ఆదాయ వర్గాల వారి కోసం జగనన్న స్మార్ట్ టౌన్స్ నిర్మించనుంది. గుంటూరు జిల్లా మంగళగిరి ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ సమీపంలో జగనన్న...

ఏవండోయ్ నానిగారూ.! ‘ప్రైవేటు’ దోపిడీపై ఉక్కుపాదం మోపరేం.?

మంత్రి పేర్ని నాని సినిమా టిక్కెట్ల వ్యవహారంపై చాలా నీతి వాక్యాలు చెప్పారు, చెబుతూనే వున్నారు. సినిమా అనేది వినోదమనీ, ఆ వినోదాన్ని సామాన్యుడికి తక్కువ ధరకు అందించడమే తమ ప్రభుత్వమనీ లెక్చర్లు...

త్వరలో ఎంపీ పదవికి రాజీనామా చేస్తా: రఘురామకృష్ణ రాజు

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణ రాజు.. త్వరలో తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. అయితే.. తనపై అనర్హత వేటు వేయించాలని చూస్తున్నారని.. వారికి తాను వారం సమయం ఇస్తున్నానని.. వారి...

రాశి ఫలాలు: శుక్రవారం 07 జనవరి 2022

పంచాంగం శ్రీ ప్లవనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసం శుక్లపక్షం సూర్యోదయం: ఉ 6:36 సూర్యాస్తమయం : సా‌.5:36 తిథి: పుష్య శుద్ధ పంచమి సా.4:12 నిమిషాల వరకు తదుపరి పుష్య శుద్ధ షష్ఠి సంస్కృతవారం: భృగువాసరః (శుక్రవారం) నక్షత్రము...