Pushpa Actor Arrest: పుష్ప (Pushpa) లో అల్లు అర్జున్ (Allu Arjun) కి స్నేహితుడిగా నటించి మంచి పేరు తెచ్చుకున్న నటుడు జగదీశ్ (కేశవ). ప్రస్తుతం ఆయనపై పంజాగుట్ట పోలిస్ స్టేషన్లో కేసు నమోదవడం సంచలనం రేపుతోంది. మహిళ బెదిరించడం.. ఆమె ఆత్మహత్యకు కారణమయ్యడనే ఆరోపణతో జగదీశ్ ను అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
‘సినీ రంగంలో పరిచయం ఉన్న ఓ మహిళతో జగదీశ్ కు పరిచయం. ఆమె నవంబర్ 27న మరో వ్యక్తితో ఉన్నప్పుడు జగదీశ్ ఫొటోలు తీశాడు. వాటిని చూపి ఆమెను బెదిరించాడు. జగదీశ్ వేధింపులతో పంజాగుట్టలో నివాసముంటున్న ఆ మహిళ మనస్తాపానికి గురైంది. దీంతో ఆమె నవంబర్ 29న ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు’.
‘మహిళ ఆత్మహత్య కారణాలను తెలుసుకున్నారు. ఘటన అనంతరం జగదీశ్ పరారీలో ఉన్నాడు. ఈరోజు బండారు జగదీశ్ ను అరెస్టు చేసి పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. అనంతరం రిమాండ్ కు తరలించార’ని పోలీసులు వివరించారు.