బన్నీ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న పుష్ప-2 గురించి కీలక అప్ డేట్ ఒకటి చెక్కర్లు కొడుతోంది. అదే ట్రైలర్. ఈ మూవీ ఎప్పుడెప్పుడు వస్తుందా అని పుష్ప ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. మొదటి పార్టు భారీ హిట్ కావడంతో రెండో పార్టుపై ఆటోమేటిక్ గానే అంచనాలు పెరిగాయి. పైగా పుష్ప-2కు సంబంధించిన పోస్టర్లు, టీజర్ భారీ అంచనాలు పెంచేశాయి. అందుకే ఇప్పుడు ట్రైలర్ ను కూడా రెడీ చేస్తున్నారంట. ఈ ట్రైలర్ ను ఇప్పటికే రఫ్ గా కట్ చేశారని తెలుస్తోంది. ఇప్పటి వరకు వచ్చిన టీజర్, పోస్టర్లను దృష్టిలో పెట్టుకుని ట్రైలర్ ను రెడీ చేస్తున్నారంట.
ఇందులో మెయిన్ గా బన్నీ యాక్షన్ సీన్లే ఉంచినట్టు తెలుస్తోంది. పుష్ప సినిమాకు అత్యంత బలం యాక్షన్ సీన్లే. కాబట్టి వాటిని ట్రైలర్ లో అస్సలు మిస్ కానివ్వకుండా ప్లాన్ చేసుకుంటున్నారంట. మూడు నిముషాలకు పైగా వచ్చిన ఈ రఫ్ ట్రైలర్ ను ట్రిమ్ చేసే పనిలో పడ్డారంట సుకుమార్. మొత్తంగా రెండు నిముషాల 30 సెకన్లు లేదా 45 సెకన్ల వరకు వచ్చేలా చూస్తున్నారంట. ఈ ట్రైలర్ లో జాతర యాక్షన్ సీన్ ప్రధానంగా ఉండబోతున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే టీజర్, పోస్టర్ లో అవే బాగా పేలాయి. అందుకే వాటిని ఇందులో కంటిన్యూ చేస్తున్నారంట.
ఇందులో మరికొన్ని పాత్రలను కూడా పరిచయం చేయబోతున్నారంట. పుష్పరాజ్ రెండో పార్టులో ఏం చేస్తాడు.. అతను ఇంకెంత వరకు ఎదుగుతాడు అనేది హింట్ ఇవ్వబోతున్నారంట. ప్రేక్షకుల్లో ఓ ట్విస్ట్ ద్వారా ఆసక్తిని పెంచేందుకు ప్లాన్ చేస్తున్నారంట. ఇంకా అధికారికంగా రిలీజ్ చేయడమే మిగిలింది.