Pushpa 2: అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 డిసెంబర్ 5న విడుదలవుతోంది. 4న ప్రీమియర్స్ వేస్తున్నారు. మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా 12వేల స్క్రీన్లలో వివిధ ఫార్మాట్లలో సినిమాను విడుదల చేయనున్నారు. అభిమానులు, ప్రేక్షకులు సినిమా కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మొదటి పార్ట్ సక్సెస్ కావడం ఇందుకు మరో కారణం.
ఇప్పుడీ సినిమా విడుదలకు ముందు షాక్ ఇచ్చింది. సినిమాను ప్రపంచ ప్రేక్షకులకు చేరువ చేసేందుకు వివిధ ఫార్మాట్లలో తెరకెక్కించారు. ఇందులో 3D వెర్షన్ ఒకటి. అయితే.. నిర్మాణాంతర పనులు పూర్తికాకపోవడంతో 3D వెర్షన్ విడుదల చేయట్లేదని సినీ విశ్లేషకుడు తరుణ్ ఆదర్శ్ సోషల్ మీడియాలో తెలిపారు. దీంతో 3D కోసం టికెట్స్ బుక్ చేసుకున్నవారికి నిరాశ ఎదురవుతోంది.
3D షోలకు ఎంపిక చేసిన ధియేటర్లలో షోలు క్యాన్సిల్ చేస్తారని.. లేదా 2Dలో ప్రదర్శించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్టు సమాచారం. మొత్తంగా 3D వెర్షన్ రావడానికి సమయం పడుతుందని తెలుస్తోంది. పుష్ప-2ను ఏడు ఫార్మాట్ల (2D, 3D, ఐస్, DBOX, 4DX, డాల్బీ, ఐమాక్స్)లో తెరకెక్కించారు.