సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం చాలా మార్పులు వచ్చాయి. రన్ టైమ్ కూడా సినిమాకు చాలా ముఖ్యం. ఎందుకంటే కథను సాగదీసినట్టు ఎక్కువ టైమ్ పెట్టినా ఎవరూ చూడరు. అలా అని కథను ఇరికించి తక్కువ చెప్పినా వర్కౌట్ కాదు. అందుకే రన్ టైమ్ కూడా కథకు అంతే ముఖ్యం. ఇక తాజాగా పుష్ప-2 రన్ టైమ్ ఎక్కువ ఉండటంతో చాలా మంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కానీ పుష్ప-2 రన్ టైమ్ గురించి చాలా కథనాలు తెరమీదకు వస్తున్నాయి. టాలీవుడ్ లో గతంలో సీనియర్ ఎన్టీఆర్ నటించిన దానవీరశూరకర్ణ సినిమా అందరికీ తెలిసిందే కదా.
దాని రన్ టైమ్ 3 గంటల 44 నిముషాలు. ఆ మూవీ ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసింది. ఎన్టీఆర్ నటనకు జనం నీరాజనాలు పట్టారు. అది ఇప్పటికీ ఓ సెన్సేషన్. దాని తర్వాత లవకుశ సినిమా కూడా సీనియర్ ఎన్టీఆర్ దే. ఆ మూవీ కూడా 3 గంటల 28 నిముషాలు ఉంటుంది. అది కూడా భారీ హిట్ అయింది. టాలీవుడ్ ను మరో లెవల్ కు తీసుకెళ్లింది. కలెక్షన్ల వర్షం కురిపించింది. ఆ రెండింటి తర్వాత ఎక్కువ రన్ టైమ్ ఉన్నది ఇప్పుడు పుష్ప-2నే. ఈ సినిమాకు 3గంటల 21 నిముషాలు ఉంటుంది. రన్ టైమ్ విషయంలో మూడో సినిమా ఇదే.
కాబట్టి ఆ రెండు సినిమాల మాదిరిగానే పుష్ప-2 కూడా సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని.. సీనియర్ ఎన్టీఆర్ లాగానే బన్నీ నటనకు కూడా ప్రశంసలు దక్కుతాయని జోస్యం చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.