పుష్ప-2 అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. సాధారణంగా ఒక సినిమాపై ఎన్ని అంచనాలు పెరిగితే ఆ మూవీ టీమ్ మీద అంత ప్రెషర్ ఉంటుంది. అంచనాలకు తగ్గట్టు మార్కెట్ పెరిగితే అది మరింత ప్రాబ్లమ్ అవుతుంది. అప్పుడు ఆ బిజినెస్ ను మించి లాభాలు తీసుకురావడానికి కష్టపడాలి. పుష్ప2 బిజినెస్ ఇప్పటికే వెయ్యి కోట్లు దాటిపోయిందని అంటున్నారు. త్రిబుల్ ఆర్ లాంటి సినిమాకు కూడా ఇంత భారీ బిజినెస్ జరగలేదని లెక్కలు చెబుతున్నారు. కానీ బడ్జెట్ పరంగా త్రిబుల్ ఆర్ కు సమానంగానే ఉంది పుష్ప-2. కానీ ఇక్కడే ఓ తేడా కూడా ఉంది.
అదేంటంటే అంత భారీగా ధర పెట్టి కొనులోగు చేసిన బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు దానికి మించి వస్తేనే లాభం అందుకుంటారు. అప్పుడే ఆ మూవీ పెద్ద హిట్ అయింది అని చెప్పుకోవాలి. కానీ పుష్ప-2 బిజినెస్సే వెయ్యి కోట్లు అంటే.. రూ.1500 కోట్లు వస్తేనే అది బ్లాక్ బస్టర్ హిట్ టాక్ లోకి వెళ్తుంది. ఒకవేళ మూవీ అంతగా ఆడకపోతే మాత్రం అప్పుడు బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్ల నుంచి ఒత్తిడి మొదలవుతుంది. పైగా మూవీ కూడా హిట్ ట్రాక్ లోకి వెళ్లదు. ఇదే ఇప్పుడు సుకుమార్ టీమ్ ను భయపెడుతోందంట. ఎందుకంటే ఒక మూవీని తక్కువకు అమ్మి ఎక్కువ లాభాలు తెచ్చుకుంటే.. అది భారీ హిట్ అవుతుంది.
అప్పుడు బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్ల నుంచి కూడా ఎలాంటి ఒత్తిడి ఉండదు. కానీ పుష్ప-2 బిజినెస్ వసూళ్ల స్థాయిలోనే ఉన్నాయని ట్రేడ్ పండితులు అంటున్నారు. ఆ లెక్కన పుష్ప-2 వెయ్యి కోట్లు వసూలు చేసినా సరే అది హిట్ అని చెప్పడానికి వీలుండదు.