పుష్పరాజ్ ఆగమనానికి సమయం దగ్గరపడుతోంది. కానీ ఇంకా షూటింగ్ బాకీ ఉంది. అటు సుకుమార్, బన్నీ రాత్రి, పగలు తేడా లేకుండా కష్టపడుతూనే ఉన్నారు. సినిమా రిలీజ్ కు వారం ముందు దాకా షూటింగ్ జరుగుతుందని ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. మూవీని మరింత పదునుగా తెరకెక్కించడం కోసమే ఇలా షూట్ చేస్తున్నామని మూవీ టీమ్ చెబుతోంది. అయితే ఇప్పుడు మూవీ షూటింగ్ లో ఓ చిక్కు వచ్చి పడిందంట. ప్రస్తుతం రెండు పాటలు మాత్రమే షూట్ చేయాల్సి ఉందని తెలుస్తోంది. అందులో ఒకటి ఐటెం సాంగ్, మరొకటి వేరే సాంగ్.
పుష్ప-2లో ఐటెం సాంగ్ చాలా స్పెషల్ గా ఉండబోతోంది. అల్లు అర్జున్-శ్రీలీల మీద ఈ పాటను షూట్ చేస్తున్నారంట. అయితే ఇంకొక పాటను షూట్ చేయాలా వద్దా అనే ఆలోచనలో పడ్డారు సుకుమార్. ఎందుకంటే అది సినిమా కథాగమనంలో ఉన్నది కాదు. అది సినిమాకు అడిషనల్ అవుతోంది. పైగా దాన్ని షూట్ చేస్తే సినిమా లెంగ్త్ కూడా పెరుగుతుంది. అంతే తప్ప దానితో సినిమాకు ఉన్న లింక్ ఏ మాత్రం లేదంట. దాన్ని షూట్ చేయాలంటే మరింత సమయం కావాలి.. రిలీజ్ డేట్ దగ్గర పడుతోంది కాబట్టి దాని షూటింగ్ చేయకున్నా వచ్చే నష్టం లేదని భావిస్తున్నారంట.
మొన్న దేవర మూవీలో కూడా దావూదీ పాటను కూడా షూట్ చేశారు. కానీ చివరకు దాన్ని సినిమాలో ఉంచలేదు. సినిమాను నడిపించేందుకు ఆ పాట యూస్ లేదు అనుకున్నప్పుడు తీసేసినా నష్టం లేదు. అందుకే ఇప్పుడు పుష్ప-2లో కూడా ఓ పాటను కట్ చేయబోతున్నారంట సుకుమార్.