అల్లు అర్జున్.. సుకుమార్ ల కాంబోలో గత ఏడాది చివర్లో వచ్చిన పుష్ప సినిమా సెన్షేషనల్ విజయాన్ని సొంతం చేసుకుంది. అంతటి ఘన విజయాన్ని సొంతం చేసుకోకుంటే ఖచ్చితంగా ఇప్పటికే పుష్ప 2 సినిమా షూటింగ్ ప్రారంభం అవ్వడం.. ముగియడం కూడా అయ్యేదేమో. ఈ ఏడాది డిసెంబర్ లోనే పుష్ప 2 సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేలా స్క్రిప్ట్ వర్క్ ను దర్శకుడు గత సంవత్సరంలోనే ప్లాన్ చేశాడు.
కాని పుష్ప 2 రేంజ్ పెరిగింది. దాంతో పాన్ ఇండియా స్టార్ కాస్ట్ తో సినిమా చేయాలనుకున్నాడు. అందుకోసం స్క్రిప్ట్ 2 రెడీ చేస్తున్నాడు. గత ఆరు నెలలుగా సుక్కు అదే పనిలో ఉన్నాడు. ఇటీవల కాస్టింగ్ కాల్ ఇవ్వడంతో స్క్రిప్ట్ వర్క్ అయ్యిందని అంతా భావిస్తున్నారు. కాని ఇప్పటి వరకు పుష్ప 2 ఫైనల్ వర్షన్ రెడీ కాలేదని యూనిట్ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ఈ ఏడాది చివరి వరకు సినిమా పట్టాలెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.