మోస్ట్ వెయిటెడ్ మూవీ పుష్ప-2 జోరు నడుస్తోంది. ఇప్పటికే వరుసగా ఈవెంట్లతో హోరెత్తిస్తున్నారు. మొదటగా పాట్నాలో భారీ ఈవెంట్ నిర్వహించారు. ఆ ఈవెంట్ తోనే సునామీ మొదలైంది. దాని తర్వాత చెన్నైలో సాంగ్ లాంచ్ ఈవెంట్ చేశారు. నిన్న కేరళలో ఓ భారీ ఈవెంట్ చేశారు. తర్వాత కూడా వరుసగా ఈవెంట్ల ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే పుష్ప-2 నుంచి వరుసగా అప్ డేట్లు అయితే ఇస్తున్నారు. ఇక తాజాగా పుష్ప-2 సెన్సార్ కూడా పూర్తి అయింది. ఈ సినిమాకు సెన్సార్ టీమ్ యూ/ఏ సర్టిఫికెట్ ను జారీ చేసింది.
ఈ మూవీ రన్ టైమ్ కూడా 3 గంటల 18 నిముషాలు ఉంది. ఇంత భారీగా ఉండటంపై చర్చ జరుగుతోంది. అయితే పార్టు-1 కూడా 3గంటలకు పైగానే ఉంది. ఇప్పుడు అంతకంటే ఎక్కువ పార్టు-2కు ఉంది. సినిమా బాగుంటే రన్ టైమ్ గురించి మాట్లాడుకోరని పుష్ప నిర్మాతలు చెబుతున్నారు. గతంలో తమకు ఎక్కువ రన్ టైమ్ కలిసి వచ్చింది కాబట్టి.. ఇప్పుడు కూడా అదే కలిసి వస్తుందంటున్నారు. పుష్ప-2 నుంచి నిన్ననే ఓ సాంగ్ కూడా లాంచ్ చేశారు. పాటలు బాగానే పేలుతున్నాయి. ఇక ఐటెం సాంగ్ కూడా వచ్చేసింది.
దానికి కూడా వ్యూస్ బాగానే వస్తున్నాయి. ట్రైలర్ కు ఏకంగా 140 మిలియన్ వ్యూస్ కంటే ఎక్కువ వచ్చాయి. దాంతో అన్ని విధాలుగా పుష్ప-2 రికార్డులు కొల్లగొడుతూనే ఉంది.