పంజాబ్లో రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద సంచలనమే జరిగింది. రాష్ట్ర కాంగ్రెస్ నేత, ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామాను రాష్ట్ర గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్ ను కలిసి అందజేశారు. పీసీసీ అధ్యక్షుడు, మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూతో ఉన్న ఆధిపత్య పోరే అమరీందర్ సింగ్ రాజీనామాకు కారణమని తెలుస్తోంది. ఈరోజు సాయంత్రం సిద్ధూ నేతృత్వంలో కాంగ్రెస్ శాసనసభా పక్షం సమావేశం జరుగనున్న నేపథ్యంలో అమరీందర్ రాజీనామా సంచలనం రేపుతోంది.
ఈమేరు అమరీందర్ సింగ్ మాట్లాడుతూ. రాష్ట్రంలో ప్రస్తుత పరిణామాలతో విసిగిపోయానని.. అవమానాల మధ్య పదవిలో కొనసాగలేనని సోనియాకు రాసిన లేఖలో కెప్టెన్ స్పష్టం చేశారు. పార్టీలో తనకు జరగుతున్న అవమానాలు ఇక తట్టుకునే ఓపిక తనకు లేవని రాసినట్టు కూడా సమాచారం. సోనియా మాట ప్రకారం ఇన్నాళ్లూ అనేక మార్పులకు అంగీకరించానని.. ఇకపై పార్టీలో కూడా కొనసాగలేనని స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు కొత్త నాయకత్వం కోసం అధిష్టానం ప్రయత్నాలు ప్రారంభించింది.