Pune Car crash: పూణె పోర్షే కారు (Pune Car crash) ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపిన సంగతి తెలిసిందే. మితిమీరిన వేగంతో 17ఏళ్ల బాలుడు ఇద్దరు టెకీలను ఢీకొనడం వారిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి విచారిస్తున్నారు. దర్యాప్తులో భాగంగా..
ఘటన సమయంలో జరిగిందేదీ గుర్తు తెచ్చుకోలేకపోతున్నట్టు పోలీసులు అంటున్నారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. దర్యాప్తులో భాగంగా నిందితుడు ఆరోజు రెండు బార్లకు వెళ్లాడు. రెండుచోట్లా మద్యం తాగాడు. మొదటి బార్లో 90నిముషాలు గడిపి 48వేలు బిల్ చెల్లించినట్టు వెల్లడయింది. రెండో బార్లో మద్యం తాగిన తర్వాత విపరీతమైన మత్తులో కారు నడిపినట్టు గుర్తించారు.
కేసును అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు పోలీసులు. ఈక్రమంలో 100మంది సిబ్బందితో కూడిన పోలీసు బృందాలు దర్యాప్తులో భాగమయ్యాయి. ప్రమాద తీవ్రతను గుర్తించి అతడిని మేజర్ గా పరిగణించి దర్యాప్తుకు అనుమతి ఇవ్వాలని ఇప్పటికే పోలీసులు కోర్టుకు కోరారు. కేసును తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించి అతడి తండ్రి, తల్లి, తాతను ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారు.