Switch to English

పులిచింతల గేటు పెట్టలేరు.! పోలవరం ప్రాజెక్టు ఎలా కడతారు.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,466FansLike
57,764FollowersFollow

వరదలొచ్చాయ్.. ప్రాజెక్టు గేటు కొట్టుకుపోయింది. నవ్విపోదురుగాక మనకేటి సిగ్గు.? అన్నట్టు రాజకీయం పకపకా నవ్వింది. పులిచింతల తమ ఘనతేనని చెప్పుకున్న తెలుగుదేశం పార్టీతోపాటు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా తలకాయ ఎక్కడ పెట్టుకుంటాయ్.? అని అప్పట్లోనే సాధారణ ప్రజానీకం నుంచి ప్రశ్నలు దూసుకొచ్చాయి.

ఔను, పులిచింతల తమ ఘనతేనని చంద్రబాబు చెప్పుకున్నారు. కాదు కాదు, వైఎస్సార్ డ్రీమ్.. అని వైసీపీ చెప్పుకుంది. ఇవేవీ కాదు, ఆ ప్రాజెక్టు తామే పూర్తి చేశామని కాంగ్రెస్ పార్టీ కూడా ప్రకటించుకుంది. అంటే, ఇక్కడ మూడు పార్టీల ఘన చరిత్ర దాగి వుందన్నమాట.

ఏం లాభం.? మూడు పార్టీల ఘనత ఎంత గొప్పదంటే, ఓ మోస్తరు వరదకే పులిచింతల ప్రాజెక్టు గేటు కొట్టుకుపోయేంతలా.! సరే, ప్రాజెక్టులకు సంబంధించి ఇలాంటి పొరపాటు జరగడం చాలా అరుదైన విషయమే అయినా, కొన్నిసార్లు అలా జరిగిపోతుందంతే. పెను ప్రమాదం తప్పింది గనుక.. ఇకపై అలాంటి ఘటనలు జరగకుండా చూసుకోవాలి.

ఇంతకీ, తొమ్మిది నెలలవుతున్నా ఆ ప్రాజెక్టు గేటు ఎందుకు పెట్టలేదట.? తాత్కాలికంగా స్టాప్ గేట్ ఏర్పాటు చేశారుగానీ, రెగ్యులర్ గేటు అయితే ఏర్పాటు కాలేదు. మరీ, అంత కష్టమైన వ్యవహారమేమీ కాదు.. ఖరీదైన వ్యవహారం అసలే కాదు.. వైసీపీ ప్రభుత్వం చేసుకుంటోన్న పబ్లిసిటీ ఖర్చుతో పోల్చి చూస్తే. కానీ, గేటు మాత్రం పెట్టలేకపోయారు.

వైఎస్ జగన్ సర్కారుకి ఇదొక మచ్చ.. అని నిస్సందేహంగా చెప్పొచ్చు. వేసవి ముగిసి, వర్షాకాలం షురూ అవబోతోంది. మళ్ళీ వరదలొస్తే.. ఆ తర్వాత ఏమవుతుందో ఏమో.! దిగువ ప్రాంతాల ప్రజలకు దేవుడు ఆయుష్షునిస్తే సరే సరి.. లేదంటే, ఈసారి మాత్రం జరగకూడనిది జరిగితే చాలా ప్రాణాలు గాల్లో కలిసిపోతాయ్.!

పులిచింతల కు ఊడిపోయిన గేటు పెట్టలేరుగానీ, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేస్తారట.! వినేవాడు వెర్రి వెంగళప్ప అయితే, చెప్పేటోడు ఘనాపాటి.. అనేది ఇందుకే మరి.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Nani: ‘జెర్సీ’ @5..! ధియేటర్లో సినిమా చూసిన నాని.. ఎమోషనల్ పోస్ట్

Nani: నాని (Nani) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ (Jersey) విడుదలై నిన్నటికి 5ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమాను...

Upasana: ఆవకాయ పట్టిన అత్తమ్మ.. ఆటపట్టించిన ఉపాసన.. వీడియో వైరల్  

Upasana: టాలీవుడ్ (Tollywood) లో మెగా ఫ్యామిలీ (Mega Family) అంటే ఒక సందడి. ఒక బ్రాండ్. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi). ఆయనొక ఇన్ స్పిరేషన్...

Puri Jagannadh: ఎవరు కొడితే బొమ్మ బ్లాక్ బస్టరవుద్దో.. అతనే ‘పూరి...

Puri Jagannadh: సినిమాకి హీరోకి ఉండే క్రేజే వేరు. సరైన సినిమాపడి స్టార్ స్టేటస్ వస్తే ఫ్యాన్స్ పెరుగుతారు.. డెమీ గాడ్ కూడా అయిపోతాడు. హీరో...

Harish Shankar: చోటా కె.నాయుడుపై హరీశ్ శంకర్ ఆగ్రహం.. బహిరంగ లేఖ

Harish Shankar: టాలీవుడ్ (Tollywood) సీనియర్ స్టార్ సినిమాటోగ్రాఫర్ చోటా కె.నాయుడు (Chota K Naidu) పై బ్లాక్ బస్టర్ దర్శకుడు హరీశ్ శంకర్ (Harish...

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

రాజకీయం

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

కులాంతరంలో కూడా రాజకీయ క్రీడ.!

ప్రజల నుంచి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోవాలి అంటే.. ప్రజలందరికి మంచి చెయ్యటం వ్యక్తులకి సాధ్యం కాదు. అందుకని మనుషులని ఎదో ఒకరకంగా కూడగట్టాలి. ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు,...

ఎన్డిఏ కూటమి అభ్యర్థులను గెలిపించండి.. అభిమానులకు మెగాస్టార్ పిలుపు

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు సీఎం రమేష్, పంచకర్ల రమేష్ బాబును గెలిపించాలంటూ మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi) తన అభిమానులకు పిలుపునిచ్చారు. ఏపీలో చంద్రబాబు నాయుడు,...

ఎక్కువ చదివినవి

అవినాష్ వర్సెస్ సునీత.! కడపలో వైసీపీ ఖేల్ ఖతం.!

సీబీఐ ఛార్జిషీట్‌లో పేర్కొన్న అంశాల్నే ప్రస్తావిస్తున్నారు మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి.! 2019 ఎన్నికల సమయంలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగితే, సీబీఐ విచారణ కోసం...

స్క్రిప్ట్ చేతిలో వైఎస్ జగన్ ఎందుకు బందీ అయ్యారు.!?

అసలేమయ్యింది వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి.? సుదీర్ఘ పాదయాత్ర చేసిన సమయంలో ఎవరి స్క్రిప్ట్ అవసరం లేకుండానే ప్రసంగాలు చేశారు కదా.? కానీ, ఇప్పుడేమయ్యింది.? స్క్రిప్టు చేతిలో వుంటే తప్ప మాట్లాడలేకపోతున్నారు.. ఆ...

‘గులక రాయి’ ఘటనలో సమాచారమిస్తే రెండు లక్షల బహుమతి.!

ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖ, రెండు లక్షల రూపాయల నజరానా ప్రకటించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరంలో జరిగిన దాడికి సంబంధించి సరైన సమాచారం ఇచ్చినవారికి ఈ...

Janasena: ‘జనసేన’కు గుడ్ న్యూస్.. గాజు గ్లాసు గుర్తుపై హైకోర్టు కీలక తీర్పు

Janasena: జనసేన (Janasena ) కు గ్లాసు గుర్తు కేటాయింపుపై హైకోర్టులో భారీ ఊరట లభించింది. జనసేనకు గాజు గ్లాసు గుర్తు రద్దు చేయాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ వేసిన పిటిషన్...

Chiranjeevi: CCTలో 100వసారి రక్తదానం చేసిన మహర్షి రాఘవ.. అభినందించిన చిరంజీవి

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి 26ఏళ్ల క్రితం (1998 అక్టోబర్ 2) ప్రారంభించిన చిరంజీవి చారిటబుల్ ట్రస్టులో నేడు అద్భుతమే జరిగింది. ‘రక్తదానం చేయండి.. ప్రజల ప్రాణాలు నిలపండి..’ అని నాడు చిరంజీవి ఇచ్చిన...