Switch to English

ప్రభుత్వాలు ఎన్ని చెప్పినా ప్రజలు మారరా.. ఇదెక్కడి ఖర్మ.!!

దేశంలో రోజు రోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. నిన్న ఒక్కరోజే దేశంలో 70 కొత్త కేసులు నమోదుకాగా, 7 మరణాలు సంభవించాయి. ఇండియాలో మొత్తం 727 పాజిటివ్ కేసులు నమోదు కావడం కంగారు పెడుతున్నది. లాక్ డౌన్ చేయడం, సోషల్ డిస్టెన్సింగ్ ను పాటించడం ఒక్కటే మార్గం అని ప్రభుత్వాలు చెప్తున్నాయి. ఖచ్చితంగా 21 రోజులపాటు లాక్ డౌన్ పాటించాలసిందే అని, లేదంటే పరిస్థితి చేయి దాటిపోతుందని, ఒక్కసారి చేయిదాటిపోతే దానిని అదుపులోకి తీసుకురావడం ఎవరితరం కాదని అంటున్నారు.

ప్రభుత్వం అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తూ ఉన్న చోటే ఉండండి, ఎవరికీ ఎటువంటి ఇబ్బందులు తలెత్తవు అని చెప్తున్నా ప్రజలు వినడం లేదు. వినకపోగా, మొండికేస్తున్నారు. ఏదైతే ఏంటి అని చెప్పి రోడ్డుపైకి వస్తున్నారు. ఇలా రావడం వలన జరిగే పరిణామాలు ఎలా ఉంటాయో ఇటలీ, స్పెయిన్, అమెరికాలను చూస్టునే అర్ధం అవుతుంది. అక్కడ రోజు రోజుకు పాజిటివ్ కేసులు వేల సంఖ్యలో పెరుగుతున్నాయి. మరణాలు కూడా భారీగా సంభవిస్తున్నాయి. చైనా ఈ వైరస్ ను కట్టడి చేసింది. ఎలా కట్టడి చేయగలిగిందో మనం చూశాం. లాక్ డౌన్ ను ఎంత కఠినంగా అమలు చేసిందో తెలిసిందే. అక్కడి ప్రజలు రెండు నెలల పాటు బయటి ప్రపంచాన్ని చూడలేకపోయారు అంటే అర్ధం చేసుకోవచ్చు. కరోనాపై చైనా ఎంతటి యుద్ధం చేసిందో.

ఇటలీ ఆలస్యంగా మేలుకొని ఇబ్బందులుపడింది. లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేయడంతో ఇప్పుడిప్పుడే అక్కడ కంట్రోల్ అవుతున్నది. కొత్త కేసులు తక్కువగా నమోదవుతున్నాయి. స్పెయిన్ లో మాత్రం పాజిటివ్ కేసులు, మరణాలు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. ఇక అమెరికా విషయానికి వస్తే, అమెరికాలో 85,594 పాజిటివ్ కేసులు నమోద కాగా, 1300 మరణాలు సంభవించాయి. ఈ సంఖ్య అమెరికాను భయపెడుతున్నది. ప్రజలు సహకరించకుంటే మనం కూడా ఈ దేశాల జాబితాలోనే చేరిపోతాం. జాగ్రత్తగా ఉండండి. కరోనాను తరిమికొట్టండి

సినిమా

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీంకు 5 కోట్ల ఫైన్‌ వేసిన ఆలియా?

 టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి ప్లాన్‌ వేస్తే దాన్ని అచ్చు గుద్దినట్లుగా పొల్లు పోకుంటా మొదటి నుండి చివరి వరకు ఎగ్జిక్యూట్‌ చేస్తాడనే విషయం అందరికి తెల్సిందే....

ఫ్యాన్స్‌లో గందరగోళం క్రియేట్‌ చేస్తున్న చరణ్‌

మెగా హీరో రామ్‌ చరణ్‌ ప్రస్తుతం ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే. ఇదే సమయంలో చిరంజీవి ఆచార్య చిత్రంలోనూ ఒక కీలకమైన గెస్ట్‌ పాత్రలో...

‘ఒరేయ్‌ బుజ్జిగా’ ఓటీటీ ప్రచారంపై నిర్మాత స్పందన

రాజ్‌ తరుణ్‌ హీరోగా మాళవిక నాయర్‌ హీరోయిన్‌గా విజయ్‌ కుమార్‌ కొండ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఒరేయ్‌ బుజ్జిగా’. ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి అయ్యి...

నానిని కలవలేదన్న మారుతి

నాని హీరోగా మారుతి దర్శకత్వంలో భలే భలే మగాడివోయ్‌ చిత్రం వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. ఆ సినిమాతో దర్శకుడు మారుతి...

త్రిష వాకౌట్ కు రీజనింగ్ ఇచ్చిన చిరు

మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా ఆచార్య. ఈ సినిమాలో మొదట త్రిషను హీరోయిన్ గా ఎంపిక చేసిన విషయం తెల్సిందే. అయితే...

రాజకీయం

జనసేనాని హుందాతనం.. వైఎస్సార్సీపీ వెకిలితనం.!

కరోనా వైరస్‌ నేపథ్యంలో దేశవ్యాప్త లాక్‌డౌన్‌ అమల్లో వుంది. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోల్చితే, ఆంధ్రప్రదేశ్‌లో చిత్ర విచిత్రమైన రాజకీయాలు నడుస్తున్నాయి. అధికారపక్షం, ప్రధాన ప్రతిపక్షం మధ్య మాటల యుద్ధం నడుస్తోంది నిస్సిగ్గుగా....

కరోనాని చంపే జెల్ ని కనుగొన్న బాంబే ఐఐటి.!

కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి ప్రపంచ దేశాలన్నీ తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నాయి. కొంతమంది వాక్సిన్లు తయారీలో నిమగ్నమై ఉండగా.. మరికొంత మంది దీనిని నిరోధించే ఔషధం కనుగొనే ప్రయత్నంలో తలమునకలై ఉన్నారు. వాక్సిన్...

కరోనా ఎఫెక్ట్‌: ప్రపంచం చాలా చాలా మారిపోవాల్సిందే.!

‘ఇకపై ఏదీ ఇంతకు ముందులా వుండదు..’ ఇదీ నిపుణులు చెబుతున్న మాట కరోనా వైరస్‌ గురించి. ప్రపంచం చాలా మారాలి. చాలా చాలా మార్పులు చోటు చేసుకోవాలి. అయితే, అవన్నీ మనుషుల అలవాట్ల...

శానిటైజర్‌ డబ్బా మీదకెక్కిన పబ్లిసిటీ పైత్యం.!

ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీ పైత్యం రోజు రోజుకీ పెరిగిపోతోంది. కాదేదీ పబ్లిసిటీకి అనర్హం అన్నట్లు.. స్మశానాలకీ, మరుగుదొడ్లకీ అధికార పార్టీ రంగులు పూసిన వైనం గురించి కొత్తగా చెప్పేదేముంది.? ఇప్పుడు కరోనా వైరస్‌ని...

సోనియా ఐడియా.. మీడియాకు సంకటమే

కరోనా మహమ్మారి కారణంగా తీవ్రంగా ప్రభావితమైన ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దడానికి, కరోనాపై పోరుకు అవసరమైన నిధులు ఎలా తీసుకురావాలి అనే అంశంపై కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ చేసిన సూచనలు మీడియాకు సంకటంగా మారాయి....

ఎక్కువ చదివినవి

మహేష్ కు విలన్ కూడా సెట్ అయిపోయాడా?

సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు వంటి సూపర్ హిట్ తర్వాత చేయబోయే సినిమా విషయంలో ఇంకా పూర్తి క్లారిటీ రాలేదు. వంశీ పైడిపల్లి అన్నారు కానీ తర్వాత పరశురామ్ లైన్లోకి...

ఆచార్య డేట్‌ను కబ్జా చేయబోతున్న వకీల్‌ సాబ్‌

మెగాస్టార్‌ చిరంజీవి 152వ చిత్రం ఆచార్య చిత్రాన్ని ఆలస్యం చేయకుండా ఆగస్టులో ఎట్టి పరిస్థితుల్లో విడుదల చేసి తీరుతాం అంటూ షూటింగ్‌ ప్రారంభం సమయంలో దర్శకుడు కొరటాల శివ చెప్పాడు. చిరంజీవి కూడా...

వరుణ్‌ మూవీపై కూడ పడ్డ కరోనా ప్రభావం

కరోనా ఎఫెక్ట్‌ మొత్తం టాలీవుడ్‌పై ఏ స్థాయిలో పడినదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. షూటింగ్స్‌ ఆగిపోవడంతో ఏప్రిల్‌ మే నెలల్లో విడుదల అవ్వాల్సిన సినిమాలు విడుదల ఆగిపోతాయని అనుకున్నారు. కాని విడుదలకు సమయం ఉన్న...

నాని, విజయ్ దేవరకొండలను ఫిక్స్ చేసుకున్న యంగ్ డైరెక్టర్.!

ఓ యంగ్ డైరెక్టర్ నాచురల్ స్టార్ నాని - రౌడీ బాయ్ విజయ్ దేవరకొండలని ఫిక్స్ చేసుకున్నాడు అంటే గట్టిగా ఓ మల్టీ స్టారర్ ప్లాం చేసుకున్నాడని అనుకోకండి.. అక్కడే ఓ చిన్న...

కరోనా ‘లాక్‌’ డౌన్‌: రాష్ట్రాలు ఏమంటున్నాయంటే.!

ఏ రాష్ట్రమైనా, ఏ దేశమైనా తమ ప్రజల గురించే ఆలోచించాల్సి వుంటుంది.. అలాగే ఆలోచించాలి కూడా.! అదే పాలకుల ధర్మం. మన దేశం విషయానికొస్తే.. ‘బతికుంటే బలుసాకు తినొచ్చు..’ అని పెద్దలు ఎప్పుడో...