Switch to English

ప్రభుత్వాలు ఎన్ని చెప్పినా ప్రజలు మారరా.. ఇదెక్కడి ఖర్మ.!!

దేశంలో రోజు రోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. నిన్న ఒక్కరోజే దేశంలో 70 కొత్త కేసులు నమోదుకాగా, 7 మరణాలు సంభవించాయి. ఇండియాలో మొత్తం 727 పాజిటివ్ కేసులు నమోదు కావడం కంగారు పెడుతున్నది. లాక్ డౌన్ చేయడం, సోషల్ డిస్టెన్సింగ్ ను పాటించడం ఒక్కటే మార్గం అని ప్రభుత్వాలు చెప్తున్నాయి. ఖచ్చితంగా 21 రోజులపాటు లాక్ డౌన్ పాటించాలసిందే అని, లేదంటే పరిస్థితి చేయి దాటిపోతుందని, ఒక్కసారి చేయిదాటిపోతే దానిని అదుపులోకి తీసుకురావడం ఎవరితరం కాదని అంటున్నారు.

ప్రభుత్వం అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తూ ఉన్న చోటే ఉండండి, ఎవరికీ ఎటువంటి ఇబ్బందులు తలెత్తవు అని చెప్తున్నా ప్రజలు వినడం లేదు. వినకపోగా, మొండికేస్తున్నారు. ఏదైతే ఏంటి అని చెప్పి రోడ్డుపైకి వస్తున్నారు. ఇలా రావడం వలన జరిగే పరిణామాలు ఎలా ఉంటాయో ఇటలీ, స్పెయిన్, అమెరికాలను చూస్టునే అర్ధం అవుతుంది. అక్కడ రోజు రోజుకు పాజిటివ్ కేసులు వేల సంఖ్యలో పెరుగుతున్నాయి. మరణాలు కూడా భారీగా సంభవిస్తున్నాయి. చైనా ఈ వైరస్ ను కట్టడి చేసింది. ఎలా కట్టడి చేయగలిగిందో మనం చూశాం. లాక్ డౌన్ ను ఎంత కఠినంగా అమలు చేసిందో తెలిసిందే. అక్కడి ప్రజలు రెండు నెలల పాటు బయటి ప్రపంచాన్ని చూడలేకపోయారు అంటే అర్ధం చేసుకోవచ్చు. కరోనాపై చైనా ఎంతటి యుద్ధం చేసిందో.

ఇటలీ ఆలస్యంగా మేలుకొని ఇబ్బందులుపడింది. లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేయడంతో ఇప్పుడిప్పుడే అక్కడ కంట్రోల్ అవుతున్నది. కొత్త కేసులు తక్కువగా నమోదవుతున్నాయి. స్పెయిన్ లో మాత్రం పాజిటివ్ కేసులు, మరణాలు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. ఇక అమెరికా విషయానికి వస్తే, అమెరికాలో 85,594 పాజిటివ్ కేసులు నమోద కాగా, 1300 మరణాలు సంభవించాయి. ఈ సంఖ్య అమెరికాను భయపెడుతున్నది. ప్రజలు సహకరించకుంటే మనం కూడా ఈ దేశాల జాబితాలోనే చేరిపోతాం. జాగ్రత్తగా ఉండండి. కరోనాను తరిమికొట్టండి

సినిమా

దేవరకొండ తర్వాత దగ్గుబాటితో ఖరారు?

ఇస్మార్ట్‌ శంకర్‌ చిత్రంతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన దర్శకుడు పూరి జగన్నాద్‌ ప్రస్తుతం విజయ్‌ దేవరకొండతో భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ను తెరకెక్కిస్తున్నాడు. పాన్‌ ఇండియా మూవీగా...

పుకార్లన్నింటికి చెక్‌ పెట్టేందుకు పెళ్లి

బాలీవుడ్‌ హీరోయిన్స్‌ ఇద్దరు ముగ్గురిని ప్రేమించడం ఆ తర్వాత బ్రేకప్‌ అవ్వడం చాలా కామన్‌ విషయాలు. అయితే సౌత్‌ లో మాత్రం హీరోయిన్స్‌ ఎక్కువ లవ్‌...

ఎట్టకేలకు తిరుమలేషుడి దర్శన భాగ్యం

కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్‌ డౌన్‌ కారణంగా దేశ వ్యాప్తంగా అన్ని దేవాలయాల్లోకి భక్తులను అనుమతించని విషయం తెల్సిందే....

ప్రభాస్‌20 ఫస్ట్‌లుక్‌కు అంతా రెడీ

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ సాహో చిత్రం విడుదలకు ముందు ప్రారంభం అయిన రాధాకృష్ణ మూవీ ఇంకా విడుదల కాలేదు. విడుదల సంగతి అలా ఉంచి...

కోటీశ్వరులు అయిన ఈ స్టార్స్‌ ఫస్ట్‌ రెమ్యూనరేషన్‌ ఎంతో తెలుసా?

ప్రస్తుతం సినిమాల్లో నటిస్తూ కోట్లు సంపాదిస్తున్న స్టార్స్‌ ఒకప్పుడు కనీసం తిండికి కూడా ఇబ్బందులు పడ్డ సందర్బాలు చాలానే ఉన్నాయి. వాటిని ఆయా స్టార్స్‌ చెబుతున్న...

రాజకీయం

ఫ్లాష్ న్యూస్: శ్రీశైలం మల్లన్న అక్రమార్కులను పట్టేసిన పోలీసులు

ఏపీలోని ప్రముఖ శైవ క్షేత్రం అయిన శ్రీశైలం మల్లన్న ఆలయంలో అధికారులు మరియు ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు కుమ్మక్కు అయ్యి స్వామి వారి ఆదాయంను భారీగా దోచుకున్నారు అంటూ కొన్ని రోజుల క్రితం...

మద్యం అక్రమ రవాణాతో వారికి సైడ్ బిజినెస్

ఏపీలో దొరికే మద్యం బ్రాండ్లలో ఎక్కువగా పేరున్నవి లేకపోవడంతో తెలంగాణలో దొరికే మద్యానికి ఫుల్ డిమాండ్ ఏర్పడింది. దీంతో అక్రమ మద్యం తరలింపు ఎక్కువవుతోంది. తెలంగాణ నుంచి తెచ్చే ఒక్కో ఫుల్‌ బాటిల్‌ను...

రామాయణాన్ని వక్రీకరించారంటూ టీటీడీపై విమర్శలు

హిందువుల మనోభావాలకు టీటీడీ లాంటి ధార్మిక సంస్థ చాలా జాగ్రత్రగా ఉండాలి. టీటీడీ నుంచి వచ్చే సప్తగిరి మాసపత్రికలో జరిగిన పొరపాటు ఇప్పుడు టీటీడీని వివాదాల్లోకి నెడుతోంది. టీటీడీ నుంచి ప్రతి నెలా...

మీడియాకి అలర్ట్: మీడియాపై కేసులు పెట్టే టీంని రంగంలోకి దింపిన వైసీపీ వైసీపీ

ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరాధారమైన, వాస్తవ విరుద్ధమైన, తప్పుడు కథనాలు ప్రచురించినా.. ప్రసారం చేసినా సదరు మీడియా సంస్థలపై కేసులు పెట్టే అధికారాన్ని ఆయా శాఖల అధిపతులకు కట్టబెడుతూ జగన్ సర్కారు జీవో నెం.2430...

ఏపీలో తెరపైకి కొత్త ఎస్ఈసీ?

ఏపీలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామక వ్యవహారం కొత్త మలుపులు తిరుగుతోంది. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎస్ఈసీగా నియమించకూడదనే రీతిలో రాష్ట్ర ప్రభుత్వం సాగుతోంది. హైకోర్టు తీర్పును సవాల్...

ఎక్కువ చదివినవి

ఇండియాలో మొదటగా అక్కడ గుడి గంట మ్రోగబోతుంది

కరోనా విపత్తు నేపథ్యంలో ఇండియాలో గత రెండు నెలలుగా ప్రార్థన మందిరాలు పూర్తిగా మూత పడి ఉన్నాయి. కరోనా భయంతో చర్చ్‌లు, మసీద్‌లతో పాటు దేవాలయాలు పూర్తిగా క్లోజ్‌ చేశారు. సామాజిక దూరం...

వలస కూలీల కోసం ఏకంగా విమానం బుక్‌ చేసిన రియల్‌ హీరో

కొన్ని వందల కిలోమీటర్లు, వేల కిలో మీటర్ల దూరంను వలస కార్మికులు కేవలం కాలినడకన చేరుకున్న విషయం తెల్సిందే. లాక్‌ డౌన్‌ కారణంగా పనులు లేక పోవడంతో చాలా మంది తమ ప్రాంతాలకు...

నాగబాబుపై పోలీసు కేసు నమోదు

ఈమద్య కాలంలో నాగబాబు మీడియాలో ప్రముఖంగా కనిపిస్తున్నాడు. ఆయన సోషల్‌ మీడియాలో చేస్తున్న కామెంట్స్‌ కారణంగా ఆయన రెగ్యులర్‌గా వార్తల్లో ఉంటున్నాడు. కొన్ని రోజుల క్రితం గాడ్సే గొప్ప దేశ భక్తుడు అంటూ...

బన్నీ ఈ లాక్‌డౌన్‌ను పాన్‌ ఇండియా మూవీ కోసం వాడేసుకుంటున్నాడుగా..!

అల్లు అర్జున్‌ ప్రస్తుతం పుష్ప చిత్రంలో నటించేందుకు రెడీ అవుతున్నాడు. సుకుమార్‌ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌ తో మైత్రి మూవీస్‌ వారు నిర్మిస్తున్న ఈ చిత్రంను ఇప్పటికే ప్రారంభించాల్సి ఉన్నా కూడా కరోనా...

పిక్ ఆఫ్ ది డే: అన్నగారు – మెగాస్టార్ @ ఓ మధుర జ్ఞాపకం.!

నేడు స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి జయంతి. ఈ సందర్భంగా తెలుగు వారందరూ ఆయనకి సోషల్ మీడియా ద్వారా జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం తెలుగు సినిమా పెద్దగా అన్నీ తానై, అందరి...