Switch to English

లాక్‌ డౌన్‌ని లెక్క చేయట్లేదు: వీళ్ళసలు మనుషులేనా.?

‘లాక్‌ డౌన్‌’ కారణంగా ప్రభుత్వానికి ఆదాయం తగ్గిపోయింది.. తగ్గిపోవడమేంటి, అసలు రావడమే లేదిప్పుడు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందంటూ, దేశంలోనే ధనిక రాష్ట్రాల్లో ముందు వరుసలో వున్న తెలంగాణ గురించి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ చెప్పుకొచ్చారు. ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదనీ, బాధ్యతగా వుండాలనీ కేసీఆర్‌ భరోసా ఇస్తున్నారు.

అయితే, నిన్నటిదాకా ఓ పరిస్థితి.. ఇప్పుడు ఇంకో పరిస్థితి నెలకొంది. కరోనా భయం నుంచి జనం క్రమక్రమంగా ‘బయటపడుతున్నారు’. అవును, భయంతో ఇళ్ళకే పరిమితమైన జనం, ఇప్పుడు కరోనా భయం తగ్గడంతో విచ్చలవిడిగా రోడ్ల మీదకు వచ్చేస్తున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరు మాత్రం నిర్లక్ష్య ధోరణితో రోడ్ల మీదకు వస్తుండడంతో మిగతావారిలో ఆందోళన నెలకొంటోంది. పాత మందుల చీటీలు చూపించి పోలీసులకు ‘మస్కా’ కొడుతున్నారంటే పరిస్థితి ఎలా వుందో అర్థం చేసుకోవచ్చు.

‘ఏప్రిల్‌ 7 నాటికి తెలంగాణ నుంంచి కరోనాని పూర్తిగా తరమికొట్టే అవకాశాలున్నాయి..’ అని ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రజలకు ధైర్యాన్ని ఇచ్చే ఉద్దేశ్యంతో చేసిన వ్యాఖ్యలతో, జనం భయాన్ని మర్చిపోయి.. ఒక్కసారిగా నిర్లక్ష్యాన్ని ఒంటికి పులిమేసుకున్నట్లు కన్పిస్తోంది. రోడ్ల మీద ఒక్కసారిగా జనం తాకిడి పెరగడంతో పోలీసులు సైతం షాక్‌కి గురవుతున్నారు. అలా రోడ్ల మీదకు వస్తున్నవారిని పోలీసులు ఆపుతున్నా, ‘కుంటి సాకులతో’ జనం తప్పించుకునేందుకు ప్రయత్నిస్తుండడం గమనార్హం.

నిజానికి, ఇప్పుడే అత్యంత జాగ్రత్తగా వుండాలి. లేకపోతే, ప్రమాద తీవ్రత ఒక్కసారిగా మళ్ళీ పెరిగిపోయే అవకాశాలు లేకపోలేదు. తెలంగాణలో కరోనా కేసుల నమోదు కొనసాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇతరుల గురించి ఆలోచించకుండా రోడ్ల మీదకు వస్తున్న ఆకతాయిలపై కరిన చర్యలు తీసుకోవాల్సిందే. అయినా, ముఖ్యమంత్రి ఇచ్చిన భరోసాని వెటకారం చేసేలా రోడ్ల మీదకు రావడమంటే, వీళ్ళసలు మనుషులేనా.?

సినిమా

టీటీడీని ప్రశ్నించిన ఏకైక హీరో

టీటీడీకి చెందిన ఆస్తులను వేలం వేసేందుకు అధికారులు సిద్దం అయిన విషయం తెల్సిందే. ఇందుకోసం ఇప్పటికే ఉతర్వులు కూడా సిద్దం అయ్యాయి. దేశ వ్యాప్తంగా ఉన్న...

కమల్‌తో వ్యవహారంపై క్లారిటీ ఇచ్చింది

యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ సుదీర్ఘ కాలం పాటు నటి గౌతమితో సహజీవనం సాగించిన విషయం తెల్సిందే. ఆమెతో కొన్ని కారణాల వల్ల విడిపోయిన కమల్‌...

ముందు ఎఫ్ 3.. ఆ తర్వాతే ఏదైనా

దర్శకుడు అనిల్ రావిపూడి ఇప్పుడు టాప్ లీగ్ లోకి చేరిపోయాడు. చేసినవి 5 సినిమాలు అయితే ఐదు కూడా సూపర్ డూపర్ హిట్లు అయ్యాయి. ఒకదాన్ని...

ఈ హీరోయిన్ కు కూడా లైంగిక వేధింపులు తప్పలేదట

లైంగిక వేధింపులు అనేది అన్ని చోట్లా ఉంది. కాకపోతే సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్య ఈ విషయం ఎక్కువగా చర్చకు వస్తోంది. ఇదివరకు ఈ విషయంపై...

సాయి తేజ్ ‘నో పెళ్లి’ కాన్సెప్ట్ కి రానా, వరుణ్ తేజ్...

దాదాపు రెండున్నర నెల తర్వాత టాలీవుడ్ లో మళ్ళీ ప్రమోషన్స్ హడావిడి స్లోగా మొదలవుతోంది. సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న 'సోలో...

రాజకీయం

సగటు భక్తుడి ఆవేదన: వెంకన్న జోలికి వెళ్ళొద్దు ప్లీజ్‌.!

ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా టీటీడీ పాలక మండలి అనగానే రాజకీయ నిరుద్యోగులకు పునరావాస కేంద్రంగా మారిపోయిందన్నది ఓపెన్‌ సీక్రెట్‌. ఇదే విమర్శ గతంలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో విన్నాం.. ఆ తర్వాత...

టీటీడీ వివాదంపై జగన్ కి విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద సూచనలు.!

టీటీడీ భక్తులు ఇచ్చిన భూములు విక్రయించాలి అని నోటీసులు జారీ చేసినప్పటి నుంచీ ఆ విషయంపై నానా రచ్చ నడుస్తోంది. టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ వ్యతిరేకిస్తున్నారు. కానీ టీటీడీ...

జనసేనానీ.. ఈ డోస్‌ సరిపోదు సుమీ.!

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఈ మధ్య సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా వుంటున్నారు. అయితే, ఎక్కువగా రీ-ట్వీట్లు చేస్తున్నారనే విమర్శలూ పవన్‌ కళ్యాణ్‌ మీద లేకపోలేదనుకోండి.. అది వేరే విషయం. బీజేపీ...

శ్రీశైలంలో కోట్లు స్వాహా చేసిన అక్రమార్కులు

అవినీతి అనేది అక్కడ ఇక్కడ అని లేకుండా ఎక్కడ పడితే అక్కడే జరుగుతుంది అనేందుకు మరో ప్రత్యేక్ష ఉదాహరణగా శ్రీశైలం నిలిచింది. ఏపీలోని ప్రముఖ శైవ క్షేత్రం అయిన అక్కడ కోట్లాది రూపాయల...

జగన్ కీలక నిర్ణయం.. సజ్జలకు పార్టీ బాధ్యతలు?

పార్టీ బాధ్యతల విషయంలో వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారా? అటు సీఎంగా పాలనా వ్యవహారాలు, ఇటు అధినేతగా పార్టీ కార్యకలాపాలు ఒకేసారి చూడటం కాస్త...

ఎక్కువ చదివినవి

కమల్‌తో వ్యవహారంపై క్లారిటీ ఇచ్చింది

యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ సుదీర్ఘ కాలం పాటు నటి గౌతమితో సహజీవనం సాగించిన విషయం తెల్సిందే. ఆమెతో కొన్ని కారణాల వల్ల విడిపోయిన కమల్‌ ప్రస్తుతం హీరోయిన్‌ పూజా కుమార్‌ తో...

క్రైమ్ న్యూస్: అంకుల్‌తో కలిసి అమ్మే నాన్నను చంపేసిందని చెప్పిన 12 ఏళ్ల బాలుడు

అక్రమ సంబంధాలు ఎంతటి దారుణంకు ఒడిగట్టేందుకు అయినా ఉసిగొల్పుతాయని మరోసారి నిరూపితం అయ్యింది. హైదరాబాద్‌ లాలా పేటకు చెందిన నాగభూషణం ఇటీవల మృతి చెందాడు. ఆయన గుండె పోటుతో మృతి చెందినట్లుగా భావించి...

శ్రీదేవి ఇంట కరోనా పాజిటివ్ నమోదు

హాలీవుడ్ వారితో పోల్చితే ఇండియన్ సినీ ప్రముఖులు కరోనా బారిన పడటం తక్కువే. ఎంతో మంది హాలీవుడ్ స్టార్స్ కరోనా బారిన పడి ఇబ్బందుకు ఎదుర్కొన్నారు. అయితే ఇప్పుడు బాలీవుడ్ కు కూడా...

సగటు భక్తుడి ఆవేదన: వెంకన్న జోలికి వెళ్ళొద్దు ప్లీజ్‌.!

ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా టీటీడీ పాలక మండలి అనగానే రాజకీయ నిరుద్యోగులకు పునరావాస కేంద్రంగా మారిపోయిందన్నది ఓపెన్‌ సీక్రెట్‌. ఇదే విమర్శ గతంలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో విన్నాం.. ఆ తర్వాత...

ఎన్టీఆర్ పై అభిమానం.. వివాదానికి దారి తీసింది

ఇటీవలే ఎన్టీఆర్ తన పుట్టినరోజును జరుపుకున్న విషయం తెలిసిందే. అయితే సినిమా షూటింగ్స్ లేకపోవడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు స్పెషల్ ట్రీట్ లాంటిదేం లభించలేదు. కాకపోతే యువ నటుడు విశ్వక్ సేన్ ఎన్టీఆర్...