Switch to English

చట్ట సభలకి ఎవర్ని పంపిస్తున్నాం.? సిగ్గపడాలి ఇకనైనా.!

అసలు రాజకీయంలో ఏముంది.? రాజకీయ నాయకులనిపించుకోవడానికి ‘కొందరు’ ఎందుకు ప్రత్యేకంగా ప్రయత్నిస్తుంటారు.? కోట్లు ఖర్చు చేస్తుంటారు.? రాజకీయమంటే ఒకప్పుడు ప్రజా సేవ. కానీ, ఇప్పుడు రాజకీయమంటే వ్యక్తి పూజ.. ఆపై, ప్రజల్ని దోచుకోవడం. ఇదే నేటి రాజకీయం.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్షం, అధికార పక్షం మధ్య దూషణలు కొత్తేమీ కాదు. ఏ చట్ట సభ తీసుకున్నా.. కాస్త తక్కువో, కాస్త ఎక్కువో.. దూషణలైతే కామన్. ప్రజా సమస్యల గురించిన చర్చ తక్కువ.. వ్యక్తిగత రాజకీయ విమర్శల దాడి ఎక్కువ. అసలు చట్ట సభలకు వెళ్ళేదే ప్రత్యర్థుల్ని తిట్టడానికన్న బలమైన అభిప్రాయం రాజకీయ వ్యవస్థలో నాటుకుపోయింది.

ప్రభుత్వం ఏం చేస్తోంది.? ఏం చెయ్యాలి.? అన్న అంశాల గురించే చట్ట సభల్లో చర్చ జరగాలి. కానీ, అది జరగదు. ‘అప్పుడు నువ్వేం చేశావ్.?’ అన్న దగ్గర్నుంచి, ‘నీ పెళ్ళాం ఎవడి దగ్గర పడుకుంది.?’ అన్నదాకా అర్థం పర్థం లేని బూతుల పంచాంగం చట్ట సభల్లో నడుస్తోంది.

నిజానికి, ఇది నాయకుల తప్పు కానే కాదు. వాళ్ళకెలాగూ సిగ్గూ ఎగ్గూ వుండదు. ఆలోచించాల్సింది ఓటర్లు మాత్రమే. చట్ట సభలకు ఎలాంటి నాయకుల్ని పంపిస్తున్నాం.? అన్నది ప్రజలు ఆలోచించుకోవాలి. అసలు ఎన్నికలు ఎందుకొస్తున్నాయ్.? ఓట్లు ఎందుకు వేస్తున్నాం.? అన్న ఆత్మవిమర్శ ఓటర్లు చేసుకోకపోతే భవిష్యత్ అత్యంత భయానకం.

న్యూస్ ఛానళ్ళలో చట్ట సభల కార్యకలాపాల గురించి తిలకిస్తోంటే, మ్యూట్ చేసుకోవాల్సి వస్తోంది. పిల్లలు వినలేని బూతులు ఆ చట్ట సభల్లో నాయకుల నోళ్ళ నుంచి జాలువారుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఈ రోజు జరిగిన ఘటన ప్రజాస్వామ్యానికే మాయని మచ్చ. ‘అబ్బే, ఏమీ జరగలేదు’ అని ఎవరైనా అంటే, అంతకన్నా ఆత్మవంచన ఇంకేమీ వుండదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘త్వరలో ఆమోదయోగ్యమైన నిర్ణయం..’ సీఎం జగన్ తో భేటీపై చిరంజీవి

ఏపీలో సినిమా టెకెట్ల అంశం జటిలమవుతున్న తరుణంలో సీఎం వైఎస్ జగన్ తో మెగాస్టార్ చిరంజీవి భేటీ ఆసక్తికరంగా మారింది. సమావేశం అనంతరం చిరంజీవి మీడియాతో...

బలిసి కొట్టుకునేది మీరు.. మేము కాదు

ఒక వైపు టాలీవుడ్ సినీ ప్రముఖులు ఏపీ లో ఉన్న టికెట్ల రేట్లను పెంచి తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్న నేపథ్యంలో మరో వైపు వైకాపాకు...

ఏపీలో టికెట్ల రేట్ల వివాదంపై బాలయ్య కామెంట్స్

ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ల వ్యవహారం రోజు రోజు పెరుగుతూ ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఇటీవల రాంగోపాల్ వర్మ అమరావతి వెళ్లి మంత్రి పేర్ని నాని తో...

లతాజీ హెల్త్‌ బులిటెన్‌.. 12 రోజులు తప్పదు

ప్రముఖ గాయని లతా మంగేష్కర్ ఇటీవల కరోనా బారిన పడ్డ విషయం తెలిసిందే. ఆమె వయస్సు 92 సంవత్సరాలు అవ్వడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి....

సినిమా టికెట్ల ఇష్యూ వదిలేయండి అంటూ మంత్రి సలహా

ఏపీలో ఉన్న టికెట్ల రేట్ల విషయంలో మీడియా వ్యవహరిస్తున్న తీరుపై మంత్రి పేర్ని నాని అసంతృప్తి వ్యక్తం చేశాడు. రాష్ట్రంలో మరే సమస్య లేనట్లుగా మొత్తం...

రాజకీయం

‘త్వరలో ఆమోదయోగ్యమైన నిర్ణయం..’ సీఎం జగన్ తో భేటీపై చిరంజీవి

ఏపీలో సినిమా టెకెట్ల అంశం జటిలమవుతున్న తరుణంలో సీఎం వైఎస్ జగన్ తో మెగాస్టార్ చిరంజీవి భేటీ ఆసక్తికరంగా మారింది. సమావేశం అనంతరం చిరంజీవి మీడియాతో మాట్లాడుతూ.. ‘సినీ పెద్దగా కాదు.. బిడ్డగానే...

మాజీ మంత్రి శంకర్రావును దోషిగా తేల్చిన కోర్టు

మాజీ మంత్రి శంకరరావుపై నమోదైన మూడు కేసుల్లో రెండు కేసుల్లో దోషిగా తేలుస్తూ ప్రజాప్రతినిధుల కోర్టు తీర్పు వెలువరించింది. కోర్టు శంకర్రావును దోషిగా ప్రకటించడంతో ఆయన కోర్టు హాల్లోనే పడిపోయారు. దీంతో వెంటనే...

జగనన్న స్మార్ట్ టౌన్ షిప్స్.. ఇదోరకం యాపారం.!

ప్రైవేటు రియల్ ఎస్టేట్ వ్యాపారుల వద్ద భూములు (నివాస స్థలాలు) కొనుగోలు చేస్తే అనేక సమస్యలొస్తాయ్.. అదే ప్రభుత్వం దగ్గర వాటిని కొంటే, వివాదాలకు ఆస్కారం వుండదు. నిజానికి, మంచి ఆలోచనే ఇది....

చంద్రబాబు ప్రేమబాణాన్ని జనసేనాని తిరస్కరించినట్లేనా.?

ఇది మామూలు కరువు కాదు.. బీభత్సమైన కరువు.. తెలుగుదేశం పార్టీకి సంబంధించి. అందుకే, పొత్తుల కోసం చంద్రబాబు ఆరాటం అప్పుడే షురూ అయ్యింది. ప్రేమ బాణాల్ని సంధిస్తున్నాం, అటు వైపు నుంచి సరైన...

స్టూడెంట్ లీడర్ గానే రాజకీయాల్లో ఎదిగాను: చంద్రబాబు

  ‘నాకు ఎటువంటి రాజకీయ నేపథ్యం లేదు.. యూనివర్సిటీ నుంచే స్టూడెంట్ లీడర్ గా ఎదిగాను. యువత, నిపుణులు రాజకీయాల వైపు రావాలి’ అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. స్వామి వివేకానంద...

ఎక్కువ చదివినవి

రండి.. కోవిడ్ వైరస్ అంటించుకోండి.! ఇదెక్కడి బాధ్యతారాహిత్యం.?

కోవిడ్ 19 కేసులు పెరుగుతున్నాయ్.. ఐదు వేలకు దిగువకు దేశంలో రోజువారీ కేసులు దిగివస్తున్న వేళ, అనూహ్యంగా కేసుల తీవ్రత పెరిగిపోయి.. లక్షన్నరకి చేరుకుంది. నాలుగైదు లక్షలకు రోజువారీ కేసులు చేరడానికి జస్ట్...

వనమా రాఘవ అరెస్టు..! రామకృష్ణను బెదిరించిన మాట వాస్తవమే: ఏఎస్పీ

సంచలనం సృష్టించిన కుటుంబం ఆత్మహత్య ఘటనలో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వనమా రాఘవేంద్రరావును పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. 5రోజులుగా హైదరాబాద్, తొర్రూర్, విశాఖపట్నం, రాజమండ్రి ప్రాంతాల్లో వేర్వేరు సిమ్ కార్డులు...

విషాదం: మునేరు వాగులో గల్లంతైన చిన్నారులు మృత్యువాత

సరదాగా గడపాల్సిన సంక్రాంతి పండుగ సెలవులు ఆ చిన్నారులను మృత్యు తీరాలకు చేర్చాయి. కృష్ణా జిల్లాలోని చందర్లపాడు మండలం ఏటూరులోని మునేరు వాగులో విద్యార్ధుల గల్లంతు ఘటన విషాదమైంది. ఈత కొట్టేందుకు వెళ్లిన...

దేశంలో కరోనా ఉధృతి..! రెండో రోజూ రికార్డు స్థాయిలో కేసులు

దేశంలో కరోనా ఉధృతి పెరిగిపోయింది. వరుసగా రెండో రోజు కూడా లక్షకు పైగా కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది. పైగా.. ముందురోజు కంటే 21 శాతం పెరుగుదల నమోదైంది. ఈమేరకు కేంద్ర...

కొడాలి నాని, వంగవీటి రాధాలక కరోనా పాజిటివ్

దేశంలో ప్రస్తుతం కరోనా పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. రోజురోజుకీ కరోనా, ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. ఏపీలో కూడా కేసులు పెరుగుతున్నాయి. ఈక్రమంలో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని కరోనా బారిన...