ప్రజా ప్రతినిథి అంటే ఎలా వుండాలి.? మంత్రి అంటే ఎలా వ్యవహరించాలి.? మీడియా మైకులు వినలేని స్థాయిలో బూతులు మాట్లాడాలి.! అధికారిక బహిరంగ సభల్లో పసి పిల్లల ముందు, రాజకీయ ప్రత్యర్థుల పెళ్ళాల గురించి మాట్లాడుతూ, వాళ్ళని కార్లతో పోల్చాలి.!
వీలైతే, ‘బోసిడీకే’ అనే పదానికి అర్థం ఇదీ.. అని, ‘లం..’ భాష వాడాలి.! ఇవేవీ లేకుండా, ‘మీకు స్కూల్లో ఎలాంటి సౌకర్యాలు కావాలి.?’ అని పసి పిల్లల్ని అడగడమేంటి.? వికలాంగులకు ట్రై సైకిళ్ళు, కృత్రిమ అవయవాలు అందించే కార్యక్రమంలో నేల మీద కూర్చుని, వారితో ఆప్యాయంగా మాట్లాడటమేంటి.?
క్లాస్ రూమ్‌కి వెళ్ళి, బాధ్యతగా విద్యార్థులకు మంచి మాటలు మాత్రమే చెబితే దీన్ని రాజకీయమని ఎలా అంటారు పవన్ కళ్యాణ్ గారూ.?
గడచిన ఐదేళ్ళ వైసీపీ పాలననీ, ప్రస్తతం ఉప ముఖ్యమంత్రిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్న తీరునీ పోల్చి చూసి, సోషల్ మీడియా వేదికగా నెటిజనం, అది కూడా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సాధారణ పౌరులు చేస్తున్న వ్యాఖ్యలివి.
కూటమి హయాంలో మంత్రుల ప్రెస్ మీట్లు కేవలం ప్రజల కోసమే.. అవుతున్నాయ్. అభివృద్ధి, సంక్షేమ పథకాలకు సంబంధించిన అంశాల మీదనే మంత్రులు మాట్లాడుతున్నారు. గతంలో అయితే పరిస్థితి ఇది కాదు. ముఖ్యమంత్రి అసలు ప్రెస్ మీట్లు పెట్టిందే చాలా అరుదు. మంత్రుల సంగతి సరే సరి.
బూతులు.. బూతులు.. బూతులు.. అసెంబ్లీ సమావేశాలైనా, ప్రెస్ మీట్లు అయినా, బహిరంగ సభలు అయినా.. వైసీపీ అంటేనే, ఓ బూతు పాలన.. అన్నట్లుగా గడచిన ఐదేళ్ళు నడిచాయ్. కానీ, ఇప్పుడు అంతా ప్రశాంతంగా వుంది. ఇంటిల్లిపాదీ, న్యూస్ ఛానళ్ళను ఒకింత ధైర్యంగా చూడగలుగుతున్నారు. దటీజ్ పవన్ కళ్యాణ్.! రాజకీయాల్లో ఈ మార్పులకు కారణం పవన్ కళ్యాణ్ మాత్రమే.