థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ ఖడ్గం సినిమాతో టాలీవుడ్ లో క్రేజ్ తెచ్చుకున్న నటుడు పృథ్వీ. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను .. మరో వైపు కమెడియన్ గాను సత్తా చాటుతున్నాడు. ఇప్పటికే నటుడిగా మంచి ఇమేజ్ తెచ్చుకున్న ఆయన కామెడీ టైమింగ్ తో అందరిని నవ్విస్తున్నాడు.
అయితే నటుడు పృథ్వీని తాజాగా త్రివిక్రమ్ – అల్లు అర్జున్ సినిమా నుండి తప్పించారంటూ వార్తలు వస్తున్నాయి. గతంలో పృథ్వీ మెగా ఫ్యామిలీ పై చేసిన వాఖ్యల నేపథ్యంలో ఆయనను ఆ హీరోలు దూరం పెట్టినట్టు ఆ వార్తల సారాంశం. అయితే పృథ్వీని కావాలనే అల్లు అర్జున్ సినిమా నుండి తప్పించారంటూ వార్తలు ఓ రేంజ్ లో ట్రోల్స్ అవుతున్నాయి.
తాజాగా ఈ విషయంపై నటుడు పృథ్వీ స్పందించాడు. మెగా ఫ్యామిలీ నన్ను దూరం పెట్టిందని, అల్లు అర్జున్ – త్రివిక్రమ్ సినిమా నుండి నన్ను తప్పించారంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని అయన అన్నారు. త్రివిక్రమ్ తో అత్తారింటికి దారేది తరువాత మళ్ళీ కలిసిందే లేదని చెప్పారు. ఇలాంటి నిరాదరణ వార్తలను ఎవరో కావాలని పుట్టించారని అన్నారు. మొత్తానికి అప్పుడప్పుడు కాంట్రవర్సీ కామెంట్స్ తో సంచలనం రేపే పృథ్వీ ఆ మధ్య మెగా ఫ్యామిలీ విషయంలో రాజకీయాల గురించి కాస్త నెగిటివ్ గా మాట్లాడారు.