Switch to English

రగులుతోన్న కోనసీమ: జిల్లా పేరు మార్పుపై అమలాపురంలో తీవ్ర ఉద్రిక్తత

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,466FansLike
57,764FollowersFollow

ప్రశాంతతకు మారు పేరులా నిలిచే కోనసీమ ప్రాంతం రావణకాష్టంలా రగులుతోంది. కొత్త జిల్లాల్లో భాగంగా కోనసీమ జిల్లా ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే.. జిల్లాకు బీఆర్ అంబేడ్కర్ పేరు పెట్టాలనే డిమాండ్ నేపథ్యంలో ఇటివలే ‘డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ’ జిల్లాగా మార్చారు. ఏమైనా అభ్యంతరాలుంటే 30 రోజుల్లోగా కలెక్టర్ కు తెలియజేయాలని ప్రభుత్వం సూచించింది. అయితే.. పరిస్థితులు చేతులు దాటిపోయేంతగా అల్లర్లకు దారి తీసింది.

జిల్లా పేరు మార్పుపై అమలాపురంలో తీవ్ర ఉద్రిక్తత

ఇదే ఇప్పుడు ఆ ప్రాంతంలో నిరసనలు, ఆగ్రహావేశాలకు కారణమవుతోంది. ఏకంగా మంత్రి ఇంటికి నిప్పు పెట్టడం, ఎమ్మెల్యే ఇంటిపై దాడి, జిల్లా ఎస్పీపై దాడి జరగడం కోనసీమ ప్రాంతంలోనే జరిగాయంటే ఆశ్చర్యపోవాల్సిందే. కోనసీమ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో వందలాది యువకులు అమలాపురం పట్టణం గడియార స్తంభం సెంటర్లో ఆందోళన చేపట్టారు. ‘కోనసీమ జిల్లా ముద్దు.. వేరే పేరు వద్దు’ అంటూ నినాదాలతో హోరెత్తుతోంది.

జిల్లా పేరు మార్పుపై అమలాపురంలో తీవ్ర ఉద్రిక్తత

పోలీసులు అక్కడికి చేరుకుని కొందరిని అదుపులోకి తీసుకున్నా.. మరికొందరు తప్పించుకోవడం.. పోలీసులు వెంటబడటం జరిగింది. స్వయంగా జిల్లా ఎస్పీ సుబ్బారెడ్డి అక్కడకు చేరుకుని పరిస్థితి సమీక్షించారు. ఈక్రమంలో లాఠీచార్జి, రాళ్లదాడి జరిగింది. రాళ్లదాడిలో ఎస్పీతోపాటు మరికొందరు పోలీసులకు, యువకులకు గాయాలయ్యాయి. ఆందోళనకారులను తరలిస్తున్న బస్సు అద్దాలను ధ్వంసం చేశారు. ఇదే క్రమంలో కలెక్టరేట్ వద్ద ఓ బస్సును ఏకంగా తగలబెట్టేశారు.

జిల్లా పేరు మార్పుపై అమలాపురంలో తీవ్ర ఉద్రిక్తత

ఆందోళనకారులు మరింతగా చెలరేగి ఏకంగా మంత్రి విశ్వరూప్ ఇంటికి నిప్పు పెట్టారు. ఆయన కార్యాలయంలోని ఫర్నీచర్, అద్దాలను ధ్వంసం చేశారు. వెంటనే పోలీసలు చాకచక్యంగా వ్యవహరించి వారి కుటుంబసభ్యులను అక్కడి నుంచి తరలించారు. ఘటనపై హోంమంత్రి తానేటి వనిత స్పందించారు. జిల్లా ప్రజల విజ్ఞప్తి మేరకే అంబేడ్కర్ పేరు పెట్టామని.. ఇప్పుడు వ్యతిరేకించడం బాధాకరమని అన్నారు. సంఘవిద్రోహ శక్తులు కొందరు ఆందోళనకారులను నడిపిస్తున్నాయని.. విచారణ జరిపి నిందితులపై చర్యలు తీసుకుంటామని అన్నారు.

జిల్లా పేరు మార్పుపై అమలాపురంలో తీవ్ర ఉద్రిక్తత

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి...

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో...

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా...

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు...

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ...

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్...

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)...

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు...

రాజకీయం

పో..‘సాని’తనం.! ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం.!

‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్లాం’ అంటారు.! ‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం అంటారు’.! రెండు మాటలకీ పెద్దగా తేడా ఏం లేదు కదా.? లేకపోవడమేంటి.? చాలా పెద్ద తేడా వుంది.! ఈ పెళ్ళాం గోలేంటి.? మనుషులమే కదా.?...

గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్‌కి సానుకూలమేనా.?

‘ఓడిపోయాడు, నియోజకవర్గం మార్చేస్తాడు..’ అంటూ నారా లోకేష్ గురించి నానా రకాల ప్రచారమూ జరిగింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ రిస్క్ తీసుకుని మరీ, మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని టీడీపీ చెబుతుంటుంది. అందులో...

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

ఎక్కువ చదివినవి

CM Jagan: సీఎం జగన్ ఎదుటే పవన్ కల్యాణ్ నినాదం.. జేజేలు

CM Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (CM Jagan) కి జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అభిమానుల నుంచి నిరసన ఎదురైంది. సీఎం ఎదుటే...

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

Jithender Reddy: ‘జితేందర్ రెడ్డి’ నుంచి మంగ్లీ పాట.. “లచ్చిమక్క” విడుదల

Jithender Reddy: బాహుబలి, మిర్చి సినిమాలతో నటుడిగా పేరు తెచ్చుకున్న రాకేష్ వర్రె హీరోగా నటించిన సినిమా ‘జితేందర్ రెడ్డి’ (Jithender Reddy). విరించి వర్మ దర్శకత్వంలో ముదుగంటి క్రియేషన్స్ పై ముదుగంటి...

Puri Jagannadh: ఎవరు కొడితే బొమ్మ బ్లాక్ బస్టరవుద్దో.. అతనే ‘పూరి జగన్నాధ్’

Puri Jagannadh: సినిమాకి హీరోకి ఉండే క్రేజే వేరు. సరైన సినిమాపడి స్టార్ స్టేటస్ వస్తే ఫ్యాన్స్ పెరుగుతారు.. డెమీ గాడ్ కూడా అయిపోతాడు. హీరో స్టయిల్స్, మేనరిజమ్స్ ఫాలో అవుతారు ఫ్యాన్స్....

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి..

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ ప్రాణకోటిలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఉన్నారు....