రెబెల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న సైన్స్ ఫిక్షన్ చిత్రం ప్రాజెక్ట్ కె. ఇండియన్ సినిమాలోనే అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కుతోన్న చిత్రమిది. నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తుండగా వైజయంతి మూవీస్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమా అప్డేట్స్ విషయంలో ఫ్యాన్స్ కొంత కోపంతో కూడా ఉన్నారు.
ప్రాజెక్ట్ కె అప్డేట్ ఎప్పుడని ఒక ఫ్యాన్ ప్రశ్నించగా రాధే శ్యామ్ విడుదల తర్వాత మాట్లాడుకుందామని చెప్పాడు నాగ్ అశ్విన్. మళ్ళీ ఈ ఫ్యాన్ రాధే శ్యామ్ విడుదలై చాలా రోజులైంది, మమ్మల్ని మర్చిపోయారా అని అడిగితె, దానికి నాగ్ అశ్విన్, “గుర్తున్నారు. ఇప్పుడే ఒక షెడ్యూల్ అయింది. ప్రభాస్ గారి ఇంట్రో బిట్ తో పాటుగా. ఆయన చాలా కూల్ గా కనిపించారు. జూన్ ఎండ్ నుండి మళ్ళీ మొదలవుతుంది. రిలీజ్ ఆర్డర్ లో మనం లాస్ట్ కదా, ఇంకా ఫ్రీక్వెంట్ అప్డేట్స్ ఇవ్వడానికి టైమ్ ఉంది. కానీ ధైర్యంగా ఉండండి, అందరూ ప్రాణం పెట్టి పనిచేస్తున్నారు” అని రిప్లై ఇచ్చాడు.