Switch to English

బడ్జెట్‌ పరిమితులతో స్టార్‌ హీరోలకు సగం కుదింపు

ఏమో అనుకున్నాం కాని కరోనా ప్రభావం సినిమా ఇండస్ట్రీపై పెను ప్రభావం చూపించింది.. ఇంకా చూపించబోతుంది. కరోనా ప్రభావం కనీసం సంవత్సరం పాటైన ఉంటుందనిపిస్తుంది. కరోనా కారణంగా థియేటర్లకు వెళ్లాలంటే కనీసం ఆరు నెలల వరకు ప్రేక్షకులు వెనుకంజ వేసే అవకాశం ఉంది. ఆ తర్వాత కూడా పూర్తి స్వేచ్చగా వెళ్తారా అంటే అనుమానమే. కనీసం సంవత్సరం అయితే తప్ప ఈ ఉపద్రవంను మర్చి పోరు. ముందు ముందు జరిగే నష్టం ఎక్కువ ఉంటే సంవత్సరం కంటే ఎక్కువగానే జనాలు భయాందోళనతో ఉండే అవకాశం ఉంది.

ప్రేక్షకులు థియేటర్లకు రాకుంటే సినిమా వసూళ్ల పరిస్థితి దారుణంగా ఉంటుంది. భారీ బడ్జెట్‌ సినిమాల పరిస్థితి దారుణంగా ఉండే అవకాశం ఉంది అంటున్నారు. ఇక నాన్‌ థియేట్రికల్‌ రైట్స్‌ విషయంలో కూడా ఆందోళన మొదలవుతోంది. శాటిలైట్‌ రైట్స్‌ ఇంకా ఓటీటీ రైట్స్‌ రేట్లు కూడా చాలా వరకు తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే మార్కెట్‌ దారుణంగా పతనం అయ్యింది. కంపెనీలు ప్రచారంపై పెట్టుబడి తగ్గించుకునే అవకాశం ఉంటుంది. తద్వారా యాడ్స్‌ ఎక్కువగా వచ్చే అవకాశం ఉండదు.

ఇలా సినిమా పరిశ్రమ మీద కరోనా ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. కొందరు నిర్మాతలు సినిమా నిర్మాణమే వదిలేసే అవకాశం ఉందనిపిస్తుంది. ఇక కొందరు నిర్మాతలు సినిమాలు తీయాలని ముందుకు వచ్చినా కూడా స్టార్‌ హీరోల పారితోషికాలు భయపడి ఆ ఆలోచన మానుకుంటారేమో.

అందుకే ఈ సమయంలో హీరోలు తమ పారితోషికాన్ని సగం వరకు కూడా తగ్గించుకోవాల్సి రావచ్చు అంటున్నారు. పెద్ద హీరోల సినిమాల బడ్జెట్‌ లో సింహ భాగం హీరో పారితోషికమే ఉంటుంది. కనుక పారితోషికం కుదింపు తప్పదని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక దర్శకులు.. టెక్నీషియన్స్‌ కు కూడా ఈ ప్రభావం పడటం కన్ఫర్మ్‌ అంటున్నారు.

సినిమా

నా భర్తతో ఉండలేక పోతున్నా అంటూ ట్వీట్‌.. సోనూ సూద్‌ సమాధానం...

గత నెల రోజులుగా సోషల్‌ మీడియాలో సోనూ సూద్‌ పేరు ఒక రేంజ్‌ లో మారు మ్రోగి పోతుంది. వలస కార్మికుల పాలిట దేవుడు అంటూ...

తమిళ, మలయాళ స్టార్స్‌తో తెలుగు మల్టీస్టారర్‌

ఈమద్య కాలంలో మల్టీస్టారర్‌ చిత్రాలు వరుసగా వస్తున్నాయి. మల్టీస్టారర్‌ చిత్రాలకు ఉన్న క్రేజ్‌ను క్యాష్‌ చేసుకునేందుకు మేకర్స్‌ ఎక్కువగా మల్టీస్టారర్‌ చిత్రాలను చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు....

ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ.. మల్టీస్టారర్ పై బాలయ్య స్పందన..

నందమూరి నట సింహం బాలకృష్ణ సినిమా గురించి మాట్లాడినా.. రాజకీయం గురించి మాట్లాడినా స్పష్టత ఉంటుంది. నిజాన్ని నిర్భయంగా చెప్పే ఆయన ఓ యూట్యూబ్ చానెల్...

క్షమాపణ చెప్పాలన్న నాగబాబు కామెంట్స్ పై బాలకృష్ణ రియాక్షన్.!

గత కొద్దిరోజులుగా తెలుగు సినీ పరిశ్రమలో కొన్ని వివాదాలు జరుగుతున్నాయి. ఈ వివాదం నందమూరి బాలకృష్ణ 'సినీ వర్గ మీటింగ్స్ కి నన్ను పిలవలేదు' అంటూ...

అనసూయకు పొలిటికల్‌ ఆఫర్స్‌ కూడా వస్తున్నాయా?

జబర్దస్త్‌ హాట్‌ యాంకర్‌ అనసూయ ప్రస్తుతం బుల్లి తెర మరియు వెండి తెరపై చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. సోషల్‌ మీడియాలో కూడా ఈమెకు...

రాజకీయం

అన్నదాతలకు శుభవార్త చెప్పిన కేంద్ర కేబినెట్

అన్నదాతలకు శుభవార్త: వివిధ పంటలకు మద్ధతు ధరలు పెంచిన కేంద్ర కేబినెట్( ఖరీఫ్ సీజన్ కోసం). ప్రతి క్వింటాల్ కు..... 1 . వరి - నూతన ధర రూ. 1,868/-( పెంచిన ధర రూ.53) 2....

నిమ్మగడ్డ ఇష్యూలో సుప్రీంను ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం

ఏపీ ఎన్నికల కమీషనర్‌గా విధులు నిర్వహిస్తున్న నిమ్మగడ్డ రమేష్‌ను ప్రభుత్వం అర్థాంతరంగా తొలగిస్తూ ఉతర్వులు తీసుకు వచ్చింది. ఆ ఉతర్వులను నిమ్మగడ్డ రమేష్‌ హైకోర్టులో సవాల్‌ చేశారు. ఏపీ హైకోర్టులో నిమ్మగడ్డ రమేష్‌కు...

జన్మంతా జగన్‌తోనేనంటున్న విజయసాయిరెడ్డి.. నమ్మొచ్చంటారా.?

‘వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డితో నాకున్న అనుబంధం చాలా విలువైనది. ఇప్పుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డితోనూ అదే అనుబంధం కొనసాగుతోంది. ఇకపైనా, అదే కొనసాగుతుంది. జన్మంతా జగన్‌ వెంటే నా ప్రయాణం. ఇందులో ఇంకో మాటకు...

కరోనా వారియర్లే రక్షకులు.. వారిపై దాడులు సహించం: ప్రధాని మోదీ

దేశంలో కరోనా విపత్కర పరిస్థితుల్లో అత్యుత్తమ సేవలు అందిస్తున్న వైద్యులు, హెల్త్ వర్కర్లపై దాడులు చేస్తే సహించేది లేదని ప్రధాని మోదీ తెలిపారు. కర్ణాటకలోని రాజీవ్ గాంధీ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్.....

బెజవాడలో గ్యాంగ్‌ వార్‌: హత్యా ‘రాజకీయం’లో కొత్త కోణం.!

రాష్ట్ర రాజధాని అమరావతి పరిధిలోని బెజవాడ ఒక్కసారిగా ‘గ్యాంగ్‌ వార్‌’తో ఉలిక్కిపడింది. రెండు గ్యాంగ్‌ల మధ్య గొడవలో ఓ గ్యాంగ్‌ లీడర్‌ హతమయ్యాడు. ఓ అపార్ట్‌మెంట్‌కి సంబంధించిన గొడవలో ఇద్దరు వ్యక్తులు ‘సెటిల్‌మెంట్‌’కి...

ఎక్కువ చదివినవి

ప్రభాస్ పెళ్లిపై ఫుల్ క్లారిటీ వచ్చేసినట్టేనా.. ఆమె ఇంటర్వ్యూలో..

టాలీవుడ్ లో రెగ్యులర్ హాట్ టాపిక్ ప్రభాస్ పెళ్లి. అభిమానులు కూడా ప్రభాస్ పెళ్లెప్పుడా అని ఆస‌క్తిగా వేచి చూస్తున్నారు. అయినా.. ప్రభాస్ ఇంతవరకూ ఏమీ తేల్చడం లేదు. ప్రభాస్ పెద్దమ్మ ఈ...

పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్న చిరంజీవి ఫ్యామిలీ

మెగాస్టార్ చిరంజీవి తేనెటీగల దాడి నుంచి తృటిలో తప్పించుకున్నారు. తెలంగాణలోని కామారెడ్డి జిల్లా దోమకొండలో ఈ ఘటన జరిగింది. ఇటివల రామ్ చరణ్ భార్య ఉపాసన తాతయ్య, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కామినేని...

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా ల‌క్ష‌లాది మంది సినీ-టీవీ కార్మికులు రోడ్డున...

ఫ్లాష్ న్యూస్: మానవత్వానికే మచ్చ.. కరోనా భయంతో నర్సును అలా వదిలేశారు

కరోనా బారిన పడిన వారిని కంటికి రెప్పలా కాపాడుతున్నారు వైద్యులు. వారితోపాటు నర్సులు, పారా మెడికల్ సిబ్బంది కూడా తమ విధులను సక్రమంగా నిర్వర్తిస్తున్నారు. ప్రజల మన్ననలు పొందుతున్నారు. కానీ.. అదే పారా...

టీటీడీ భూముల అమ్మకంపై వైసీపీ ‘రివర్స్‌ గేర్‌’ వెనుక.!

‘అవి నిరర్ధక ఆస్తులు.. చిన్న చిన్న భూములు కావడంతో అన్యాక్రాంతమవుతున్నాయి.. కబ్జాలనుంచి వాటిని రక్షించడం వీలు కావడంలేదు. ఈ క్రమంలో వాటిని అమ్మి సొమ్ము చేసుకుంటే తప్పేంటి.?’ ఓ మంత్రిగారు చెప్పిన మాట...