Switch to English

వినోదంతో కూడిన విభిన్న చిత్రం స్వాతిముత్యం: నిర్మాత సూర్యదేవర నాగవంశీ

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,466FansLike
57,764FollowersFollow

ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ నుంచి వస్తోన్న తాజా చిత్రం ‘స్వాతిముత్యం’. యువ ప్రతిభను పరిచయం చేస్తూ సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ వినోదభరితమైన కుటుంబకథా చిత్రంలో గణేష్, వర్ష బొల్లమ్మ జంటగా నటించారు. లక్ష్మణ్ కె. కృష్ణ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. విజయదశమి కానుకగా అక్టోబర్ 5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో నిర్మాత నాగవంశీ తాజాగా విలేకర్లతో ముచ్చటించి చిత్ర విశేషాలను పంచుకున్నారు.

స్వాతిముత్యం ఎలా ఉండబోతోంది?

ఫన్ ఫిల్డ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్. థియేటర్ నుంచి నిస్సందేహంగా నవ్వుకుంటూ బయటకు వస్తారు.

కొత్త డైరెక్టర్ కి మీరేమైనా సూచనలు చేశారా?

ఇప్పుడొస్తున్న కొత్త డైరెక్టర్లు చాలా కాన్ఫిడెంట్ గా ఉంటున్నారు. లక్ష్మణ్ కూడా చాలా కాన్ఫిడెంట్ గా తాను అనుకున్నది తీశాడు. మేం చిన్న చిన్న సలహాలు మాత్రమే ఇచ్చాం.

గాడ్ ఫాదర్, ఘోస్ట్ సినిమాలతో పాటు విడుదల చేస్తున్నారు. కాన్ఫిడెన్సా? ఓవర్ కాన్ఫిడెన్సా?

కాన్ఫిడెన్స్, ఓవర్ కాన్ఫిడెన్స్ అలాంటిదేం లేదండి. నేను మొన్న కూడా చెప్పాను. కోవిడ్ తర్వాత ప్రతివారం కనీసం రెండు మూడు సినిమాలు వస్తున్నాయి. పైగా దసరా సీజన్ కాబట్టి రెండు సినిమాలున్నా రిస్క్ తీసుకుంటున్నాం.

చిరంజీవి గారు మీ సినిమా గురించి కూడా ప్రస్తావిస్తూ అభినందనలు తెలిపారు కదా.. మీరెలా ఫీల్ అయ్యారు?

అందుకే ఆయన చిరంజీవి అయ్యారు. చిన్న సినిమాలను ఆదరించమని కోరతారు. చిన్న సినిమాలను అభినందిస్తారు. అందుకే ఆయన ఇండస్ట్రీ పెద్ద అయ్యారు.

ఈ టైటిల్ పెట్టడానికి కారణమేంటి? టైటిల్ పెట్టేముందు బాగా ఆలోచించారా?

హీరో క్యారెక్టర్ అమాయకంగా ఉంటుంది కాబట్టి స్వాతిముత్యం టైటిల్ సరిగ్గా సరిపోతుందని పెట్టాం. పైగా చిన్న సినిమాకి క్లాసిక్ ఫిల్మ్ టైటిల్ పెడితే మా సినిమా ప్రేక్షకులలోకి త్వరగా వెళ్తుందన్న ఉద్దేశంతో పెట్టాం.

స్వాతిముత్యం అంటే అమాయకుడా? పిచ్చోడా?

పిచ్చోడు కాదు అమాయకుడు. ఈ జనరేషన్ లో ఉండాల్సిన వాడు కాదు. చాలా మంచోడు.

కొంతకాలంగా ప్రేక్షకులు వైవిధ్యమైన చిత్రాలనే ఆదరిస్తున్నారు? మీ చిత్రం ఆదరణ పొందుతుంది అనుకుంటున్నారా?

బింబిసార, సీతారామం, కార్తికేయ -2 వేటికవే విభిన్న చిత్రాలు. అన్నీ ఆదరణ పొందాయి. కేవలం ఎంటర్టైనర్ మాత్రమే కాదు ఇందులో కొత్త కాన్సెప్ట్ కూడా ఉంటుంది.

వర్ష బొల్లమ్మ హీరోయిన్ గా ఎంపిక చేయడానికి కారణం?

మిడిల్ క్లాస్ మెలోడీస్ లో ఆమె నటన చూసి ఎంపిక చేశాం. దీనిలో కూడా ఒక స్మాల్ టౌన్ అమ్మాయి క్యారెక్టర్. ఆ పాత్రకి ఆమె సరిగ్గా సరిపోతుంది అని ఎంపిక చేయడం జరిగింది.

ఈ ఫిల్మ్ గణేష్ కి మంచి లాంచ్ అవుతుంది అనుకుంటున్నారా?

బెల్లంకొండ సురేష్ గారు పెద్దబ్బాయిని సమంతను హీరోయిన్ గా పెట్టి గ్రాండ్ గా లాంచ్ చేశారు. ఇది అలా కాదు. ఈ సినిమాతో మంచి కాన్సెప్ట్ తో వచ్చాడన్న పేరు వస్తుంది.

స్వాతిముత్యం నుంచి ఇక సితారలో ప్రయోగాత్మక చిత్రాలు ఆశించవచ్చా?

డీజే టిల్లు నుంచే చేశాం కదా. అన్ని రకాలు చిత్రాలు చేస్తాం. టిల్లు, వరుడు కావలెను, స్వాతిముత్యం ఇలా చిన్న చిత్రాలతో ప్రయోగాలు చేస్తున్నాం. అలాగే నెక్స్ట్ బాలకృష్ణ గారు, రవితేజ గారు, వైష్ణవ్ తేజ్, నవీన్ పోలిశెట్టి వంటి హీరోలతో పక్కా కమర్షియల్ సినిమాలు చేస్తున్నాం. అలాగే ఓ కాలేజ్ బ్యాక్ డ్రాప్ మూవీతో తారక్ గారు బావమరిదిని లాంచ్ చేస్తున్నాం.

చిరంజీవి గారితో ఎప్పుడు ఉండొచ్చు ప్రాజెక్ట్?

నేను కూడా చాలా ఎదురు చూస్తున్నాను ఆయనతో త్వరగా సినిమా చేయాలని.

మహేష్ బాబు గారి సినిమా గురించి చెప్తారా?

త్రివిక్రమ్, మహేష్ గారి కాంబినేషన్ లో వచ్చిన అతడు, ఖలేజా సినిమాలకు థియేటర్స్ లో రావాల్సినంత ఆదరణ రాలేదు. కానీ టీవీల్లో పిచ్చి పిచ్చిగా చూసి ఆ కాంబినేషన్ పై విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఏ స్థాయిలో అంచనాలు పెట్టుకొని థియేటర్ కి వచ్చినా అంతకుమించి మెప్పించేలా ఈ సినిమా ఉంటుంది.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్...

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)...

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు...

Nani: ‘జెర్సీ’ @5..! ధియేటర్లో సినిమా చూసిన నాని.. ఎమోషనల్ పోస్ట్

Nani: నాని (Nani) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ (Jersey) విడుదలై నిన్నటికి 5ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమాను...

Upasana: ఆవకాయ పట్టిన అత్తమ్మ.. ఆటపట్టించిన ఉపాసన.. వీడియో వైరల్  

Upasana: టాలీవుడ్ (Tollywood) లో మెగా ఫ్యామిలీ (Mega Family) అంటే ఒక సందడి. ఒక బ్రాండ్. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi). ఆయనొక ఇన్ స్పిరేషన్...

Puri Jagannadh: ఎవరు కొడితే బొమ్మ బ్లాక్ బస్టరవుద్దో.. అతనే ‘పూరి...

Puri Jagannadh: సినిమాకి హీరోకి ఉండే క్రేజే వేరు. సరైన సినిమాపడి స్టార్ స్టేటస్ వస్తే ఫ్యాన్స్ పెరుగుతారు.. డెమీ గాడ్ కూడా అయిపోతాడు. హీరో...

రాజకీయం

పో..‘సాని’తనం.! ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం.!

‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్లాం’ అంటారు.! ‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం అంటారు’.! రెండు మాటలకీ పెద్దగా తేడా ఏం లేదు కదా.? లేకపోవడమేంటి.? చాలా పెద్ద తేడా వుంది.! ఈ పెళ్ళాం గోలేంటి.? మనుషులమే కదా.?...

గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్‌కి సానుకూలమేనా.?

‘ఓడిపోయాడు, నియోజకవర్గం మార్చేస్తాడు..’ అంటూ నారా లోకేష్ గురించి నానా రకాల ప్రచారమూ జరిగింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ రిస్క్ తీసుకుని మరీ, మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని టీడీపీ చెబుతుంటుంది. అందులో...

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

ఎక్కువ చదివినవి

ఎన్డిఏ కూటమి అభ్యర్థులను గెలిపించండి.. అభిమానులకు మెగాస్టార్ పిలుపు

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు సీఎం రమేష్, పంచకర్ల రమేష్ బాబును గెలిపించాలంటూ మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi) తన అభిమానులకు పిలుపునిచ్చారు. ఏపీలో చంద్రబాబు నాయుడు,...

పో..‘సాని’తనం.! ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం.!

‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్లాం’ అంటారు.! ‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం అంటారు’.! రెండు మాటలకీ పెద్దగా తేడా ఏం లేదు కదా.? లేకపోవడమేంటి.? చాలా పెద్ద తేడా వుంది.! ఈ పెళ్ళాం గోలేంటి.? మనుషులమే కదా.?...

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్ డార్లింగ్స్.. ఎలా ఉన్నారు..!’ అంటూ ప్రభాస్...

మళ్ళీ అదే పెళ్ళిళ్ళ గోల.! గులక రాయి గట్టిగానే తగిలిందా.?

మళ్ళీ అదే పాత స్క్రిప్ట్.! ఇందులో తేడా ఏమీ వుండదు.! ఐదేళ్ళ పాలనలో రాష్ట్ర ప్రజలకు ఏం చేశారో చెప్పుకోవాలి.! మళ్ళీ అధికారంలోకి వస్తే ఏం చేస్తారో చెప్పుకోవాలి.! మద్య నిషేధంపై మాట...

గ్రౌండ్ రిపోర్ట్: నిడదవోలులో జనసేన పరిస్థితేంటి.?

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని నిడదవోలు నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు ఎలా వున్నాయ్.? 2024 ఎన్నికల్లో ఏ పార్టీ ఈ నియోజకవర్గం నుంచి గెలవబోతోంది.? నాటకీయ పరిణామాల మధ్య జనసేన పార్టీకి ‘కూటమి’ కోటాలో...