వికటకవి వెబ్ సిరీస్ చాలా అద్భుతంగా ఉందని ప్రముఖ నిర్మాత రామ్ తాళ్లారి అన్నారు. నరేష్ అగస్త్య, మేఘా ఆకాష్ జంటగా ప్రదీప్ మద్దాలి దర్శకత్వంలో వికటకవి వెబ్ సిరీస్ వస్తోంది. దీన్ని ఎస్.ఆర్.టి.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ప్రొడ్యూసర్ రామ్ తాళ్లూరి నిర్మించారు. ఈ నెల 28 నుంచి ZEE5 లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్ లో మూవీ టీమ్ మాట్లాడింది. నిర్మాత రామ్ తాళ్లూరి మాట్లాడుతూ ఈ కథ చాలా కొత్తగా ఉంటుంది. దీన్ని సినిమాగా తీయాలని అనుకున్నాం. కానీ జీ5 వల్ల వెబ్ సిరీస్ గా తీశాం.
చాలా కొత్తగా ఉంటుంది. ఈ సిరీస్ తో డైరెక్టర్ కు నటులకు మంచి గుర్తింపు వస్తుందని తెలిపారు. నరేష్ అగస్త్య మాట్లాడుతూ.. జీ5తో నాకు మంచి అనుబంధం ఉంది. ఈ సిరీస్ తో ప్రేక్షకులు కొత్త అనుభూతిని పొందుతారు. రామ్ తాళ్లూరి, ప్రదీప్ వాళ్లతో పనిచేయడం సంతోషంగా ఉందన్నారు. మేఘా ఆకాష్ మాట్లాడుతూ.. ఇందులో నా పాత్ర చాలా కొత్తగా ఉంటుంది. కాబట్టి ఈ సిరీస్ ను అందరూ ఆదరించాలని కోరింది. దర్శకుడు ప్రదీప్ మద్దాలి మాట్లాడుతూ ఇందులో నటీనటులు అద్భుతంగా నటించారు. రామ్ తాళ్లూరి వల్ల మా వెబ్ సిరీస్ కు మంచి క్రేజ్ వచ్చింది.
సిరీస్ అందరికీ నచ్చేలా తెరకెక్కించినట్టు తెలిపారు. దర్శక, రచయిత బీవీఎస్ రవి మాట్లాడుతూ.. ఈ సిరీస్ చాలా కొత్త కాన్సెప్టుతో వస్తోంది. పాత్రల మధ్య సన్నివేశాలు కొత్తగా ఉంటాయన్నారు. జీ5 కంటెంట్ హెడ్ సాయి తేజ్ మాట్లాడుతూ.. నటీనటుల పనితీరు చాలా అద్భుతంగా ఉంది. బీజీఎం కొత్తగా ఉంటుందని చెప్పారు. మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ అరసాడ మాట్లాడుతూ ఇందులో బీజీఎం చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ప్రేక్షకులు సిరీస్ చూస్తే కొత్త ఎక్స్ పీరియన్స్ పొందుతారని వెల్లడించాడు.