ఇటివల 30 రోజులపాటు సినిమాల చిత్రీకరణ ఆపేసి చిన్న నిర్మాతలకు మీరు చేసిన న్యాయం ఏంటని.. నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ నట్టి కుమార్ తెలుగు ఫిలిం చాంబర్ అధ్యక్షుడు, కార్యదర్శికి లేఖ రాశారు. చిన్న నిర్మాతల సమస్యలు తీరేదెప్పుడు..? ఫెడరేషన్ లోని చిన్న సినిమాల చిత్రీకరణకు 25 శాతం ధరలు తగ్గిస్తామని 10 ఏళ్లుగా మోసం చేస్తున్నారని లేఖలో ప్రశ్నించారు.
పీవీఆర్లో క్యూబ్, మల్టీప్లెక్స్ ల్లో ఒక్క షో వేసినా.. ఏడు షోలు వేసినా 9800, సినీ పోలిస్ లో 7080 చెల్లించాలని ఇది చిన్న నిర్మాతలకు భారం కాదా అని ప్రశ్నించారు. మల్టీప్లెక్సుల్లో కనీసం 35 మంది లేకపోతే షో వేయరు.. సమాచారం లేకుండానే సినిమా తీసేస్తారు. ప్రస్తుత పరిస్థితుల్లో చిన్న నిర్మాతలకు 15 శాతం రేట్లు పెంచడమేంటని అన్నారు.
సినిమాపై ప్యాషన్ ఉన్న నిర్మాతలు సినిమాలు విడుదల చేస్తుంటే.. సినిమానే ప్రాణంగా ప్రేమించే నిర్మాతలు తమ సినిమాలు రిలీజ్ చేసే పరిస్థితుల్లో లేరని అన్నారు. చాంబర్ పెద్దలు వీటన్నింటికీ సమాధానం చెప్తారని ఆశిస్తున్నట్టు లేఖలో పేర్కొన్నారు.