Leo: విజయ్ (Vijay) -త్రిష (Trisha) జంటగా తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ ‘లియో (Leo)’. ఈనెల 19న విడుదలై పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకుంది. మంచి వసూళ్ల దిశగా దూసుకుపోతోంది. దీనిపై చిత్ర నిర్మాత లలిత్ కుమార్ స్పందించారు. ‘లియో అద్భుత విజయం సాధించింది. ప్రేక్షకుల రెస్పాన్స్ తో సంతోషంగా ఉన్నాం. తమిళనాడులో బెనిఫిట్ షోల కోసం ప్రయత్నించాం.. కోర్టుకు కూడా వెళ్లాం. దీనిపై విజయ్ జోక్యం చేసుకోలేదు. కోర్టుకెందుకు వెళ్లారని ప్రశ్నించారు. సినిమా ప్రశాంతంగా విడుదలవ్వాలని మాత్రమే కోరుకున్నారు’.
‘దాదాపు 2లక్షలమంది పక్క రాష్ట్రాలకు వెళ్లి సినిమా చూశారు. రజినీకాంత్ (Rajinikanth) సినిమా చూసి అభినందించారు. హిందీ మార్కెట్ ను బట్టి లియోకు 1000 కోట్లు వసూళ్లు కష్టమే. సినిమాకు విజయ్ అందించిన సహకారం మర్చిపోలేనిది. మాస్టర్ సమయంలోనే గిఫ్ట్ ఇస్తానంటే రెమ్యునరేషన్ ఇస్తున్నారుగా చాలన్నారు’. కలెక్షన్లపరంగా లియో మొదటిరోజునే దేశవ్యాప్తంగా 148కోట్లు వసూళ్లు సాధించినట్టు చిత్ర యూనిట్ తెలిపింది. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో లోకేశ్ సినిమాటిక్ యూనివర్శ్ భాగంగా లియో తెరకెక్కింది.