Switch to English

సీఆర్డీయే రద్దు ఫలితం: 40 ఎకరాలు, 210 కోట్లు.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,513FansLike
57,764FollowersFollow

ప్రముఖ సినీ నిర్మాత అశ్వనీదత్‌, గన్నవరం విమానాశ్రయ విస్తరణ నిమిత్తం తనకు చెందిన 40 ఎకరాల భూమిని, చంద్రబాబు హయాంలో భూ సమీకరణ ప్రక్రియలో భాగంగా ప్రభుత్వానికి అప్పగించారు. ఈ నేపథ్యంలో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం, అశ్వనీదత్‌కి సీఆర్డీయే పరిధిలో భూమిని కేటాయించింది.

అయితే, ప్రస్తుత వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం, సీఆర్డీయేని రద్దు చేసి, ఆ స్థానంలో అమరావతి మెట్రో రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీని తీసుకురావడంతోపాటు, రాజధాని పరిధిని తగ్గించడం, అలాగే రాజధాని అమరావతి నుంచి శాసన మండలి మినహా ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ అలాగే, జ్యుడీషియల్‌ క్యాపిటల్‌ని విశాఖ, కర్నూలుకి తరలించనుండడం తెలిసిన విషయమే.

ప్రభుత్వం తనతో చేసుకున్న ఒప్పందానికి విలువ ఇవ్వలేదని ఆరోపిస్తూ, అశ్వనీదత్‌ హైకోర్టును ఆశ్రయించారు. తన భూమిని తనకు ఇచ్చేయాలని ఈ క్రమంలో గన్నవరం విమానాశ్రయ విస్తరణ ఆపేయాలని అశ్వనీదత్‌ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు. భూమి ఒకవేళ ఇవ్వలేని పక్షంలో, నష్టపరిహారంగా 210 కోట్లు ఇవ్వాలన్నది అశ్వనీదత్‌ డిమాండ్‌గా కనిపిస్తోంది. 40 ఎకరాలకు 210 కోట్లు అంటే.. 400 ఎకరాలకు 2100 కోట్లు.. 4000 ఎకరాలకు 21,000 కోట్లు.. 40,000 ఎకరాలకు 2,10,000 కోట్లు.!

మొత్తం రాజధాని అమరావతి కోసం 38 వేల ఎకరాల్ని రైతులు ఇచ్చిన దరిమిలా, వారంతా న్యాయస్థానాల్ని ఇలాంటి డిమాండ్లతోనే ఆశ్రయిస్తే పరిస్థితి ఏంటట.? రాజధాని నిర్మించడానికి లక్ష కోట్లు ఖర్చవుతుందన్న వైసీపీ, టీడీపీ వాదనల్లో నిజమెంతోగానీ, నష్టపరిహారానికే 2 లక్షల కోట్లు చెల్లించాల్సి వస్తే.. అంతకన్నా దారుణం ఇంకోటుండదు. ప్రభుత్వాలు ఇచ్చిన హామీల్ని తప్పితే.. ప్రజల నుంచి లాంటి ప్రతిఘటనలే ఎదురవుతాయి మరి.!

ఆ సంగతి పక్కన పెడితే, ఇప్పుడిక వైసీపీ నేతలు ఎలాగూ ‘కులం’ ప్రస్తావన తీసుకొచ్చి నిస్సిగ్గు రాజకీయం షురూ చేస్తారనుకోండి అశ్వనీదత్‌ మీద.. అది వేరే సంగతి. అన్నట్టు, బీజేపీ నేత, మాజీ కేంద్రమంత్రి, సినీ నటుడు కృష్ణంరాజు కూడా ఇదే విషయమై కోర్టును ఆశ్రయించారు. గన్నవరం విమానాశ్రయ విస్తరణ కోసం తాను ఇచ్చిన భూమికి నష్టపరిహారాన్ని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు కృష్ణంరాజు.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘టిల్లు స్క్వేర్‌’ లో కొత్త అందాలు చూడబోతున్నామా..!

సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొంది మంచి విజయాన్ని సొంతం చేసుకున్న డీజే టిల్లుకు సీక్వెల్‌ గా రూపొంది మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న...

బ్రేకింగ్ : యూఎస్ లో తెలుగు హీరోకి యాక్సిడెంట్‌

జాతిరత్నాలు సినిమాతో స్టార్‌ హీరోగా యూత్‌ లో మంచి క్రేజ్ ను దక్కించుకున్న నవీన్ పొలిశెట్టి ఆ మధ్య మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో...

Kalki 2898AD : ప్రభాస్ కి ఉన్నది ఒకే ఒక్క ఆప్షన్..!

Kalki 2898AD : యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ హీరోగా మహానటి దర్శకుడు నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న కల్కి 2898 ఏడీ సినిమా విడుదల...

Manchu Manoj: ‘చిరంజీవి-మోహన్ బాబు’ పై మంచు మనోజ్ సరదా కామెంట్స్

Manchu Manoj: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) జన్మదిన వేడుకల సందర్భంగా హైదరాబాద్ శిల్పకళావేదికలో జరిగిన కార్యక్రమంలో హీరో మంచు మనోజ్ (Manchu...

Game Changer: ‘గేమ్ చేంజర్’ స్పెషల్ అప్డేట్.. పూనకాలు తెప్పించిన దిల్...

Game Changer: దిగ్గజ దర్శకుడు శంకర్ (Shankar) దర్శకత్వంలో రామ్ చరణ్ (Ram Charan) నటిస్తున్న సినిమా గేమ్ చేంజర్ (Game Changer). నేడు రామ్...

రాజకీయం

టీడీపీ వెకిలి వేషాలకు బాధ్యత ఎవరిది.?

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని అనపర్తి నియోజకవర్గాన్ని బీజేపీకి కేటాయించడాన్ని తెలుగు దేశం పార్టీ మద్దతుదారులు జీర్ణించుకోలేకపోతున్నారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు స్వయంగా, ఈ పంపకాలను డిజైన్ చేసి, ఆమోద ముద్ర...

అన్న జగన్‌కి పక్కలో బల్లెంలా తయారైన చెల్లెలు సునీత.!

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య వ్యవహారానికి సంబంధించి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు, స్వయానా ఆ వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి కౌంటర్ ఎటాక్...

Tillu Square : ఫీల్ అయిన అనుపమ.. టిల్లు రిక్వెస్ట్

Tillu Square : డీజే టిల్లు కు సీక్వెల్ గా రూపొందిన టిల్లు స్క్వేర్ సినిమా రేపు విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. సినిమా విడుదల నేపథ్యంలో నిన్న రిలీజ్ ట్రైలర్ ను...

వైఎస్ జగన్ ‘మేం సిద్ధం’ యాత్ర.! తొలి రోజు అట్టర్ ఫ్లాప్ షో.!

ఏమయ్యింది.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి.? ‘సిద్ధం’ సభల కోసం 18 లక్షల మంది జనాన్ని రప్పించగలిగామని గొప్పలు చెప్పుకున్న వైసీపీ, అట్టహాసంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘మేం సిద్ధం’ బస్సు యాత్ర...

వైసీపీ ఎంపీ వంగా గీతకి ఎందుకింత ప్రజా తిరస్కారం.?

వంగా గీత.. వైసీపీ ఎంపీ.! ఆమె అనూహ్యంగా ఇప్పుడు అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. అదీ పిఠాపురం నియోజకవర్గం నుంచి. కాకినాడ ఎంపీగా పని చేస్తున్న వంగా గీత, అదే పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని...

ఎక్కువ చదివినవి

BJP: ‘ఆ హీరోకి ఫాలోయింగ్ ఎక్కువ.. సినిమాలు ఆపండి’ ఈసీకి బీజేపీ లేఖ

BJP: కర్ణాటక (Karnataka) లో రాజకీయం రసవత్తరంగా మారింది. 2019లో రాష్ట్రంలోని 28 పార్లమెంట్ స్థానాలకు 25 స్థానాలు గెలుచుకున్న బీజేపీ (BJP) మళ్లీ తన మ్యాజిక్ చూపాలని ప్రయత్నిస్తోంది. అయితే.. అధికారంలో...

పులివెందులలో వైసీపీకి ఎదురుగాలి.? నిజమేనా.!?

వై నాట్ కుప్పం.. అన్నారు కదా.? పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఒక్కడ్ని ఓడించేందుకు గుంపులు గుంపులుగా వైసీపీ ముఖ్య నేతలంతా ఎందుకు మోహరించినట్టు.? ఇంతకీ, పులివెందుల పరిస్థితేంటి.? వాస్తవానికి పులివెందులలో వైఎస్ కుటుంబానికి ఎదురే...

Siddharth: వివాహ బంధంలోకి సిద్ధార్ధ్-అదితిరావు హైదరీ

Siddarth: హీరో సిద్ధార్ధ్ (Siddarth), హీరోయిన్ అదితి రావు హైదరీ (Aditi Rao Hydari) వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వనపర్తి జిల్లాలోని శ్రీ రంగాపూర్ రంగనాధస్వామి ఆలయంలో వీరి వివాహం బుధవారం జరిగింది....

Raadhika : నటి రాధిక ఆస్తుల విలువ ఎంతో తెలుసా..?

Raadhika : సీనియర్ నటి రాధిక పార్లమెంట్‌ సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయబోతున్న విషయం తెల్సిందే. తమిళనాడులోని విరుదునగర్ పార్లమెంట్‌ స్థానంను బీజేపీ నటి రాధిక కు ఇవ్వడం జరిగింది. గత కొంత...

Ram Charan Birthday special: మెగా కోటపై సగర్వంగా ఎగురుతున్న జెండా.. రామ్ చరణ్

Ram Charan: కుటుంబం పేరు నిలబెట్టాలంటే వారి గౌరవం కాపాడటమే కాదు.. తనకు తాను ఎదగాలి.. ఉన్నత స్థానం పొందాలి.. పేరు గడించాలి. ఫలానా వారి అబ్బాయి అనేకంటే.. ఈ అబ్బాయి తండ్రి...