ఓ ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్‌ని కరోనా గట్టిగానే ‘కాటు’ వేసేసిందంటూ మీడియా వర్గాల్లో విస్తృత ప్రచారం జరుగుతోంది. కరోనా దెబ్బకి అన్ని రంగాలూ విలవిల్లాడుతున్నట్లే మీడియా రంగం కూడా కొంత ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్న మాట వాస్తవం. ప్రకటనల తాలూకు రెడెన్యూ రాకపోవడం తదితర సమస్యలతో మీడియా రంగం సతమతమవుతోంది. ఈ నేపథ్యంలోనే కొన్ని పత్రికలు తమ పేజీల్ని తగ్గించుకున్నాయి.. టాబ్లాయిడ్లను ఎత్తేశాయి కూడా.
నిజానికి, ఇదంతా కేవలం కరోనా దెబ్బ కారణంగానే కాదు.. ఇంకా చాలా అంశాలే వున్నాయి తెరవెనుకాల. ఆర్థిక మాంద్యం, రాజకీయ సమస్యలు.. వెరసి, మీడియా రంగంలో గత కొద్ది నెలలుగా కొంత స్తబ్దత నెలకొన్న మాట వాస్తవం. ఆ సమస్యలన్నిటికీ కరోనా సమస్య అదనంగా వచ్చి చేరిందంతే. ఇప్పటికే ఓ ప్రముఖ న్యూస్ ఛానల్, టీడీపీ ‘ప్రో’ నుంచి టీడీపీ ‘యాంటీ’గా మారిపోయిన విషయం విదితమే. ఈ క్రమంలో తెరవెనుకాల పెద్ద కథే నడిచింది.
తాజాగా మరో ప్రముఖ ఛానల్ కూడా ఇదే బాటలో నడవబోతోందట. టాప్ 5లో వున్న ఆ ఛానల్‌కి సంబంధించి గత కొద్ది నెలలుగా మీడియా రంగంలో చాలా ఊహాగానాలు విన్పిస్తున్నాయి. ‘అబ్బే, అదేం లేదు..’ అని చెబుతూ వస్తున్న సదరు ఛానల్ యాజమాన్యం, ‘కారోనా కష్టకాలాన్ని’ సరిగ్గా వాడేసుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
అన్నీ అనుకున్నట్లు జరిగితే, కరోనా లాక్డౌన్ ముగిసేలోపే.. సదరు ఛానల్ ‘రంగు’ మారిపోబోతోందట. అంటే, ‘ప్రో’ టీడీపీ నుంచి ‘యాంటీ’ టీడీపీకి మారడం అన్న మాట. చిత్రమేంటంటే ఒకప్పటి టీడీపీ ‘ప్రో’ ఛానల్స్ అన్నీ, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని అధికార పార్టీలకు ‘ప్రో’ ఛానల్స్‌గా మారుతుండడం. ప్రస్తుతానికైతే ఆ ఛానల్ ఏది.? అన్నదానిపై కొంత గోప్యత కొనసాగుతోంది. ఎక్కువ రోజులు ఆ ‘గోప్యత’ కొనసాగే అవకాశం లేదన్నది నిర్వివాదాంశం.
12761 860934Superb post but I was wanting to know in case you could write a litte far more on this topic? Id be extremely thankful in the event you could elaborate just a little bit much more. Thanks! 64619
991860 489368If youre still on the fence: grab your favorite earphones, head down to a Very best Buy and ask to plug them into a Zune then an iPod and see which one sounds greater to you, and which interface makes you smile a lot more. Then youll know which is proper for you. 943477
253286 734017You may uncover effective specific development of any L . a . Weight loss program and each and every you are really crucial. To begin with level is an natural misplacing during the too much weight. shed belly fat 773330