రీసెంట్ గానే మంచి హిట్ అందుకున్న ప్రియదర్శి త్వరలోనే మరో సినిమాతో రాబోతున్నాడు. హిట్ డైరెక్టర్ మోహన కృష్ణ ఇంద్రగంటి డైరెక్షన్ లో శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణప్రసాద్ నిర్మాణంలో ఈ సినిమా రాబోతోంది. శ్రీదేవి మూవీస్, మోహనకృష్ణలది హిట్ కాంబినేషన్. వీరిద్దరి కలయికలో వచ్చిన జెంటిల్ మెన్, సమ్మోహనం రెండు మంచి హిట్ అయ్యాయి. ఇప్పుడు మూడో సినిమాగా సారంపాణి జాతకం రాబోతోంది. ప్రియదర్శితో వీరు చేస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే మూవీ షూటింగ్ దాదాపు కంప్లీట్ అయిపోయింది. తాజాగా మూవీ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు.
సమ్మర్ స్పెషల్ గా ఏప్రిల్ 18న ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో తెలుగు అమ్మాయి రూప కొడువాయూర్ హీరోయిన్ గా చేస్తోంది. ఇప్పటికే వచ్చిన టీజర్ తెగ ట్రెండ్ అయింది. మూవీ కామెడీ బేస్ చేసుకుని వస్తున్నట్టు తెలుస్తోంది. టైటిల్ సాంగ్ ‘సారంగో సారంగా’, ‘సంచారి సంచారీ’ పాటలు బాగా ట్రెండ్ అయ్యాయి. ఇందులో సీనియర్ నరేశ్, వెన్నెల కిషోర్, తనికెళ్ల భరణి, వైవా హర్ష, అవసరాల శ్రీనివాస్ లాంటి వారు కీలక పాత్రలు చేస్తున్నారు. ప్రొడ్యూసర్ శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ సినిమా ఫస్ట్ హాఫ్ తో పాటు దాదాపు రెడీ అయిందన్నారు. సినిమాపై మంచి నమ్మకం ఉందని.. కుటుంబమంతా ఎంజాయ్ చేసేలా ఉంటుందన్నారు. సారంగపాణి పాత్ర అందరికీ గుర్తుండిపోతుంది అంటూ చెప్పుకొచ్చారు. వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు. లైన్ ప్రొడ్యూసర్ గా విద్య శివలెంక, సహ నిర్మాతగా చింతా గోపాలకృష్ణా రెడ్డి వ్యవహరిస్తున్నారు.