తెలుగు తెర మీద తన గ్లామర్ తో మెప్పించాలని చూస్తుంది హీరోయిన్ ప్రిషా సింగ్. 2020లో బాలీవుడ్ సినిమా గులాబో సితాబో సినిమాలో జస్ట్ అలా కనిపించి మురిపించిన అమ్మడు తెలుగులో నిఖిల్ తో స్పై సినిమాలో నటించింది. ఆ నెక్స్ట్ అల్లు శిరీష్ తో బడ్డీ సినిమా కూడా చేసింది. ఐతే చేసిన సినిమాలు ఏవి పెద్దగా ప్రేక్షకాదరణ పొందలేదు. ఐతే ప్రిషా సింగ్ గ్లామర్ షోకి ఆడియన్స్ ఫిదా అవుతున్నారు.
సినిమాలతో సంబంధం లేకుండా ప్రిషా చేస్తున్న ఫోటో షూట్స్ కి సెపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు. లేటెస్ట్ గా అమ్మడు మరోసారి తన క్రేజీ ఫోటో షూట్ తో సర్ ప్రైజ్ చేసింది. పరువాల విందుతో ప్రేక్షకులను పిచ్చెక్కించేలా చేస్తుంది చిన్నది. కరెక్ట్ సినిమా పడాలే కానీ తన టాలెంట్ ఏంటో చూపిస్తా అనే రేంజ్ లో అమ్మడి గ్లామర్ షో ఉంది.
ప్రిషా సింగ్ లేటెస్ట్ ఫోటో షూట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఫోటో షూట్ చూస్తే అమ్మడు కచ్చితంగా స్టార్ మెటీరియల్ అనిపించేలా ఉన్నా కథల ఎంపికలో తన తెలివి తేటలను బట్టి పాపులారిటీ వస్తుందని చెప్పొచ్చు. తెలుగులో సరైన ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్న ప్రిషా సింగ్ ఫోటో షూట్స్ తో మాత్రం ఆడియన్స్ ని మెస్మరైజ్ చేస్తుంది. అమ్మడి గ్లామర్ షోకి సోషల్ మీడియా అంతా షేక్ అవుతుందని అంటే అతిశయోక్తి కాదేమో.. ఇంకెందుకు ఆలస్యం ప్రిషా సింగ్ గ్లామర్ ఎటాక్ ని మీరు ఓ లుక్కేయండి..