Switch to English

కరోనా దెబ్బకి విలవిల్లాడుతున్న ప్రింట్‌ మీడియా.!

కరెన్సీ నోటు ద్వారా కరోనా వైరస్‌ వ్యాప్తి చెందే అవకాశాలున్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే డిజిటల్‌ లావాదేవీలవైపు మొగ్గు చూపాలనే సూచనలు తెరపైకొస్తున్నాయి. మరి, వార్తా పత్రికల ద్వారా కరోనా వైరస్‌ ఎందుకు వ్యాపించదు.? ఈ ప్రశ్న సాధారణ ప్రజానీకంలో తలెత్తడం సహజమే. ‘ఆ అవకాశమే లేదు..’ అంటూ పలు మీడియా సంస్థలు నిపుణుల్ని తీసుకొచ్చి మరీ చెప్పిస్తున్నాయి.

వార్తా పత్రికలు అత్యాధునిక సాంకేతిక పద్ధతుల్లో తయారవుతున్నాయనీ, దాంతో వాటి ద్వారా కరోనా వైరస్‌ వ్యాప్తి చెందదనీ సదరు నిపుణులు చెబుతున్నారు. మీడియా సంస్థలు ఎంత మొత్తుకుంటున్నా, వార్తా పత్రికలు ఇంటికి చేరాలంటే, దానికి చాలా పెద్ద కథే వుంటుంది. కూరగాయలు, అవసరమైన వస్తువులు కొనేందుకు కూడా చాలామంది బయటకు వెళ్ళడానికి ఇష్టపడ్డంలేదు. ఒకవేళ వెళ్ళినా, వాటిని శుభ్రం చేసేందుకు చాలా కష్టాలు పడాల్సి వస్తోంది. వార్తా పత్రికల విషయంలో అలాంటిది చేయలేం కదా.! పరిస్థితి తీవ్రత ఆయా మీడియా సంస్థలకు కూడా తెలుసు. అందుకే, టాబ్లాయిడ్‌ ఎడిషన్స్‌ని రద్దు చేసుకుంటూ వస్తున్నాయి.

ఇప్పటికే ఆంధ్రజ్యోతి తమ ట్యాబ్లాయిడ్‌ని రద్దు చేసి, ఆ విశేషాల్ని మెయిన్‌ ఎడిషన్స్‌లో కలిపేస్తోంది. మరోపక్క, ఈనాడు కూడా అదే బాటలో నడవనున్నట్లు తెలుస్తోంది. ఆ పత్రిక ఈ పత్రిక అన్న తేడాల్లేవు.. దాదాపుగా అన్ని ప్రధాన పత్రికలూ ఇదే బాటలో నడవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎప్పటికప్పుడు వార్తలు డిజిటల్‌ మీడియా ద్వారా అందుతుండడంతో గత కొన్నాళ్ళుగా ప్రింట్‌ మీడియాపై జనంలో కూడా ఆసక్తి తగ్గిన మాట వాస్తవం. ఈ కరోనా దెబ్బకి, వార్తా పత్రికల అలవాటు పూర్తిగా జనాలకు తగ్గిపోయే అవకాశముంది. అదే జరిగితే, ప్రింట్‌ మీడియాకి అదొక ప్రమాదకరమైన పరిస్థితి అని నిస్సందేహంగా చెప్పొచ్చు.

కానీ, మీడియా సంస్థలు మాత్రం, ప్రింట్‌ మీడియాకి వుండే ఆ ప్రత్యేకత ఎప్పటికీ తగ్గబోదని చెబుతున్నాయి. ఏదిఏమైనా, కరోనా దెబ్బకి ప్రింట్‌ మీడియా విలవిల్లాడుతున్న మాట వాస్తవం.

సినిమా

నా భర్తతో ఉండలేక పోతున్నా అంటూ ట్వీట్‌.. సోనూ సూద్‌ సమాధానం...

గత నెల రోజులుగా సోషల్‌ మీడియాలో సోనూ సూద్‌ పేరు ఒక రేంజ్‌ లో మారు మ్రోగి పోతుంది. వలస కార్మికుల పాలిట దేవుడు అంటూ...

తమిళ, మలయాళ స్టార్స్‌తో తెలుగు మల్టీస్టారర్‌

ఈమద్య కాలంలో మల్టీస్టారర్‌ చిత్రాలు వరుసగా వస్తున్నాయి. మల్టీస్టారర్‌ చిత్రాలకు ఉన్న క్రేజ్‌ను క్యాష్‌ చేసుకునేందుకు మేకర్స్‌ ఎక్కువగా మల్టీస్టారర్‌ చిత్రాలను చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు....

ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ.. మల్టీస్టారర్ పై బాలయ్య స్పందన..

నందమూరి నట సింహం బాలకృష్ణ సినిమా గురించి మాట్లాడినా.. రాజకీయం గురించి మాట్లాడినా స్పష్టత ఉంటుంది. నిజాన్ని నిర్భయంగా చెప్పే ఆయన ఓ యూట్యూబ్ చానెల్...

క్షమాపణ చెప్పాలన్న నాగబాబు కామెంట్స్ పై బాలకృష్ణ రియాక్షన్.!

గత కొద్దిరోజులుగా తెలుగు సినీ పరిశ్రమలో కొన్ని వివాదాలు జరుగుతున్నాయి. ఈ వివాదం నందమూరి బాలకృష్ణ 'సినీ వర్గ మీటింగ్స్ కి నన్ను పిలవలేదు' అంటూ...

అనసూయకు పొలిటికల్‌ ఆఫర్స్‌ కూడా వస్తున్నాయా?

జబర్దస్త్‌ హాట్‌ యాంకర్‌ అనసూయ ప్రస్తుతం బుల్లి తెర మరియు వెండి తెరపై చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. సోషల్‌ మీడియాలో కూడా ఈమెకు...

రాజకీయం

అన్నదాతలకు శుభవార్త చెప్పిన కేంద్ర కేబినెట్

అన్నదాతలకు శుభవార్త: వివిధ పంటలకు మద్ధతు ధరలు పెంచిన కేంద్ర కేబినెట్( ఖరీఫ్ సీజన్ కోసం). ప్రతి క్వింటాల్ కు..... 1 . వరి - నూతన ధర రూ. 1,868/-( పెంచిన ధర రూ.53) 2....

నిమ్మగడ్డ ఇష్యూలో సుప్రీంను ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం

ఏపీ ఎన్నికల కమీషనర్‌గా విధులు నిర్వహిస్తున్న నిమ్మగడ్డ రమేష్‌ను ప్రభుత్వం అర్థాంతరంగా తొలగిస్తూ ఉతర్వులు తీసుకు వచ్చింది. ఆ ఉతర్వులను నిమ్మగడ్డ రమేష్‌ హైకోర్టులో సవాల్‌ చేశారు. ఏపీ హైకోర్టులో నిమ్మగడ్డ రమేష్‌కు...

జన్మంతా జగన్‌తోనేనంటున్న విజయసాయిరెడ్డి.. నమ్మొచ్చంటారా.?

‘వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డితో నాకున్న అనుబంధం చాలా విలువైనది. ఇప్పుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డితోనూ అదే అనుబంధం కొనసాగుతోంది. ఇకపైనా, అదే కొనసాగుతుంది. జన్మంతా జగన్‌ వెంటే నా ప్రయాణం. ఇందులో ఇంకో మాటకు...

కరోనా వారియర్లే రక్షకులు.. వారిపై దాడులు సహించం: ప్రధాని మోదీ

దేశంలో కరోనా విపత్కర పరిస్థితుల్లో అత్యుత్తమ సేవలు అందిస్తున్న వైద్యులు, హెల్త్ వర్కర్లపై దాడులు చేస్తే సహించేది లేదని ప్రధాని మోదీ తెలిపారు. కర్ణాటకలోని రాజీవ్ గాంధీ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్.....

బెజవాడలో గ్యాంగ్‌ వార్‌: హత్యా ‘రాజకీయం’లో కొత్త కోణం.!

రాష్ట్ర రాజధాని అమరావతి పరిధిలోని బెజవాడ ఒక్కసారిగా ‘గ్యాంగ్‌ వార్‌’తో ఉలిక్కిపడింది. రెండు గ్యాంగ్‌ల మధ్య గొడవలో ఓ గ్యాంగ్‌ లీడర్‌ హతమయ్యాడు. ఓ అపార్ట్‌మెంట్‌కి సంబంధించిన గొడవలో ఇద్దరు వ్యక్తులు ‘సెటిల్‌మెంట్‌’కి...

ఎక్కువ చదివినవి

లారెన్స్ సినిమాకి ‘లక్ష్మీ బాంబు’ లాంటి ఆఫర్

ఈ కరోనా కష్టకాలంలో ఎన్నో విధాలుగా నష్టాలను ఎదుర్కుంటున్న పరిశ్రమల్లో సినీ పరిశ్రమ ముందు వరుసలో ఉంటుంది. థియేటర్లు మూతపడి నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు నష్టబోతుంటే చిత్రీకరణలు లేక చిన్న స్థాయి నటీనటులు, రోజు...

ఫ్లాష్ న్యూస్: ఈ విపత్తు సమయంలో చైనా ఎంతటి నీచానికి పాల్పడినదో తెలుసా?

ప్రపంచం మొత్తం కరోనా విలయతాంఢవం చేస్తున్న ఈ సమయంలో పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాదులు ఏదో ఒక విధంగా ఇండియాపై దాడి చేస్తూనే ఉన్నారు. ఇదే సమయంలో చైనా కూడా తమ నీచమైన బుద్దిని...

ఆ కుర్రాడు పాములా నెలకు ఒకసారి కుబుసాన్ని వదులుతూ ఉంటాడు

పాములు తమ చర్మ అమరిక అనుసారంగా కుబుసంను వదులుతూ ఉంటాయి. పాములు కుబుసం వదలడం చాలా కామన్‌ విషయం. కాని ఒక మనిషి పాము మాదిరిగా కుబుసం వదలడం ఎప్పుడైనా చూశారా. మనిషి...

లాక్ డౌన్ ఎత్తివేతకు 7 కమిటీలతో బ్లూ ప్రింట్ సిద్ధం చేసిన ఏపీ ప్రభుత్వం

దశల వారీగా లాక్ డౌన్ ఎత్తివేతకు బ్లూ ప్రింట్‌ సిద్ధం చేయాలన్న ప్రధాని మోదీ సూచనల మేరకు కమిటీలు ఏర్పాటు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు ఆరు అంశాలపై 7 కమిటీలు నియమించించిన ఏపీ...

ఫోన్‌ గొడవతో గృహిణి ఆత్మహత్య

కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం వగరూరు గ్రామానికి చెందిన నాగరాజు మరియు పార్వతిలకు ఆరు సంవత్సరాల క్రితం వివాహం అయ్యింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కూతురు నాలుగు సంవత్సరాలు కాగా ఏడాది...