ప్రివ్యూ: ‘గ్యాంగ్‌ లీడర్‌’ నాని.. బాక్సాఫీస్‌ దమ్మెంత.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

91,454FansLike
57,764FollowersFollow

నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘గ్యాంగ్‌ లీడర్‌’ మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ రోజు రాత్రి యూఎస్‌ ప్రీమియర్స్‌ కోసం భారీ ఏర్పాట్లు చేశారు. కాస్త అటూ ఇటూగా తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రివ్యూ షోలకు రంగం సిద్ధమయ్యింది. 50 కోట్ల రూపాయలకు కాస్త అటూ ఇటూగా ఈ సినిమా కోసం ఖర్చు చేశారన్న ప్రచారం జరుగుతోంది. నాని మీద అంత పెద్ద బడ్జెట్‌ పెట్టారా.? ఎందుకు.? అన్న ప్రశ్నలు ఓ పక్క విన్పిస్తుంటే, ‘అది నిజం కాదు’ అనే ఇంకో వాదన కూడా తెరపైకొస్తోంది.

బడ్జెట్‌ సంగతి పక్కన పెడితే, ‘గ్యాంగ్‌ లీడర్‌’ సినిమాతో ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ పరంగా సరికొత్త సంచలనాలకు నాని తెరలేపాడన్నది నిర్వివాదాంశం. సినిమా ప్రమోషన్స్‌ విషయంలో మైత్రీ మూవీ మేకర్స్‌ ఎక్కడా రాజీపడదని చాలా సినిమాలతో నిరూపితమయ్యింది. ఈ ‘గ్యాంగ్‌ లీడర్‌’కి కూడా ప్రమోషన్స్‌ ఓ రేంజ్‌లో చేసేశారు. సినిమా ఫలితం మరికొద్ది గంటల్లో తేలిపోనుంది. ప్రీ రిలీజ్‌ బజ్‌ అయితే చాలా పాజిటివ్‌గా కన్పిస్తుండడంతో ఓపెనింగ్స్‌ పరంగా నాని తన కెరీర్‌లోనే అత్యుత్తమ గణాంకాల్ని నమోదు చేస్తాడని ట్రేడ్‌ పండితులు అంచనా వేస్తున్నారు.

Also Read: ప్రీ రిలీజ్ బిజినెస్ లో.. దుమ్ము రేపిన గ్యాంగ్ లీడర్ !

‘ప్రోమోస్‌లో కన్పించే కంటెంట్‌ గోరంత.. సినిమాలో కంటెంట్‌ కొండంత.. అడుగడుగునా థ్రిల్లింగ్‌ అంశాలుంటాయి.. ఎవరూ ఊహించని ట్విస్టులుంటాయి.. సినిమాని ఇంకో లెవల్‌లో ఆడియన్స్‌ ఎంజాయ్‌ చేస్తారు..’ అంటూ సినిమాపై ప్రీ రిలీజ్‌ కబుర్లు బయటకు వస్తున్నాయి. విక్రమ్‌ కుమార్‌ సినిమాలు రొటీన్‌కి భిన్నంగా వుంటాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నాని సంగతి సరే సరి.. రొటీన్‌ కమర్షియల్‌ సినిమాల్ని పక్కన పెట్టి, విలక్షణ సినిమాల వైపు అడుగులేస్తున్నాడు.

ఈ నేపథ్యంలో ఈ ఇద్దరి నుంచి ఎవరూ ఊహించని ఓ మంచి సినిమా.. అదీ కమర్షియల్‌ అంశాలతో రాబోతోందనడం బహుశా అతిశయోక్తి కాకపోవచ్చు. ‘ఆర్‌ఎక్స్‌100’ ఫేమ్‌ కార్తికేయ ఈ సినిమాలో విలన్‌గా నటిస్తుండడం గమనార్హం. ‘గ్యాంగ్‌లీడర్‌’ హైలైట్‌ పాయింట్స్‌లో దీన్ని కూడా ఒకటిగా చెప్పుకోవచ్చు. సినిమా ప్రమోషనల్‌ సాంగ్‌ ఇప్పటికే అదనపు గ్లామర్‌ తీసుకొచ్చింది. అయితే, హీరోయిన్‌ గ్లామర్‌ ఒక్కటీ సినిమాకి పెద్ద మైనస్‌ పాయింట్‌ అనే ప్రచారం జరుగుతోంది. అయితే, గ్లామర్‌ లేకపోతేనేం.. హీరోయిన్‌, తన నటనతో మెప్పిస్తుందన్నది చిత్ర యూనిట్‌ వర్గాలు చెబుతున్న మాట.

ఓవర్సీస్‌లో ప్రీమియర్స్‌కి ప్రీ-బుకింగ్‌ ఆల్‌మోస్ట్‌ ఫినిష్‌ అయిపోయింది. తెలుగు రాష్ట్రాల్లోనూ అడ్వాన్స్‌ బుకింగ్‌లు దాదాపు ఫుల్‌ అయిపోయినట్లు ఎర్లీ రిపోర్ట్స్‌ చెబుతున్నాయి. నానికి క్లాస్‌ సెంటర్స్‌తోపాటు, మాస్‌ సెంటర్స్‌తోనూ పట్టున్న దరిమిలా, రూరల్‌ ఏరియాస్‌లోనూ థియేటర్లు అడ్వాన్స్‌ బుకింగుల జోరుతో కళకళ్ళాడుతుండడం గమనార్హం. ‘జెర్సీ’తో ఈ మధ్యనే మంచి విజయాన్ని అందుకున్న నాని, ఈసారి 50 కోట్లు కొల్లగొట్టడం ఖాయమని ట్రేడ్‌ వర్గాలూ అంచనా వేస్తున్నాయి. ‘మీ అంచనాలైతే తప్పబోం.. ఖచ్చితంగా ఓ మంచి సినిమా అవుతుంది.. కమర్షియల్‌ అంశాల గురించి సినిమా విడుదలయ్యాక మాట్లాడుకుందాం.. సినిమాలో అన్నీ వుంటాయ్‌..’ అని సాక్షాత్తూ నాని భరోసా ఇస్తుండడం గమనార్హం.

6 COMMENTS

సినిమా

‘దిల్ రాజు వర్సెస్ మైత్రీ కోల్డ్ వార్ వల్లే సమస్యలు’: నట్టి...

తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం కొనసాగుతున్న నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల సమస్యలపై సీనియర్ నిర్మాత నట్టి కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో బుధవారం సాయంత్రం...

Producers Guild: ఇన్నాళ్లూ గుర్తురాని సమస్య ‘పెద్ది’ వస్తుంటే గుర్తొచ్చిందా?: రవిశంకర్

Producers Guild: తెలుగు సినీ పరిశ్రమలో నెలకొన్న పర్సంటేజీ వివాదంపై ఇప్పుడు మరో వర్గం తన వాదన వినిపించింది. నిన్న తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ఓ...

‘కలెక్షన్లు పెరిగాయి.. కానీ ప్రేక్షకులు తగ్గారు’: బన్నీ వాస్

తెలుగు సినీ పరిశ్రమ ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలపై నిర్మాత Bunny Vas చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. థియేటర్ల ఆదాయం తగ్గిపోవడం, ప్రేక్షకులు సినిమాలకు...

Sirish: ‘పెద్ది’ రిలీజ్ టైమ్‌లోనే సమస్య గుర్తొచ్చిందా..? శిరీష్ వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు

రామ్ చరణ్ నటిస్తున్న భారీ చిత్రం ‘పెద్ది’ విడుదలకు సిద్ధమవుతున్న వేళ తెలంగాణ థియేటర్ వ్యవహారం ఒక్కసారిగా హాట్ టాపిక్‌గా మారింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లకు...

The Paradise: నాని ‘ది ప్యారడైజ్’ రీషూట్స్..! ఏం జరుగుతుందో క్లారిటీ...

The Paradise: నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ది ప్యారడైజ్’. ఇప్పటికే చాలా భాగం తెరకెక్కిన సినిమా ఇంకా కొంత భాగం...

రాజకీయం

పిఠాపురం టెన్త్ టాపర్లకు పవన్ కళ్యాణ్ భారీ గిఫ్ట్.. 31 మందికి ఉచిత ఉన్నత విద్య

Pawan Kalyan పిఠాపురం నియోజకవర్గ విద్యార్థులకు మరో కీలక నిర్ణయంతో అండగా నిలిచారు. పదో తరగతిలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు ఉచితంగా ఉన్నత విద్య అందించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలల్లో...

సాక్షులను బెదిరించిన కేసు ప్రభావం.. అనంతబాబు బెయిల్ రద్దు

డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్సీ అనంతబాబుకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో గతంలో సుప్రీంకోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను రాజమహేంద్రవరం ప్రత్యేక న్యాయస్థానం రద్దు చేసింది....

మాట నిలబెట్టుకున్న పవన్ కళ్యాణ్‌ .. పెదపాడు పిల్లలకు కొత్త స్కూల్ భవనం

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి Pawan Kalyan ఇచ్చిన మరో హామీ కార్యరూపం దాల్చింది. అరకు నియోజకవర్గంలోని డుంబ్రిగూడ మండలం పెదపాడు గ్రామంలో శిథిలావస్థకు చేరిన ప్రాథమిక పాఠశాల స్థానంలో కొత్త భవనం నిర్మాణం పూర్తయింది....

హనుమాన్ జయంతి వేడుకల్లో పాల్గొన్న జనసేన నేత ప్రేమ్ కుమార్

హనుమాన్ జయంతి సందర్భంగా అల్లాపూర్ డివిజన్ వివేకానంద నగర్‌లోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు, భజన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. దేవస్థానం కమిటీ చైర్మన్ మరియు సభ్యుల ఆహ్వానం...

ప్రసంగించడానికి వెళ్లి పెట్టుబడులు తెచ్చిన చంద్రబాబు.. అమరావతిలో EY ఎంట్రీ!

అమరావతిని అంతర్జాతీయ స్థాయి ఐటీ మరియు ఆర్థిక కేంద్రంగా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి N. Chandrababu Naidu విజన్‌కు మరో కీలక ముందడుగు పడింది. ప్రపంచ ప్రఖ్యాత కన్సల్టింగ్, ఐటీ సంస్థ Ernst &...

ఎక్కువ చదివినవి

అమరావతి రైతులకు ప్లాట్ల కేటాయింపులో భారీ పురోగతి.. 97 శాతం పంపిణీ పూర్తి!

అమరావతి రాజధాని భూముల పూలింగ్‌కు సంబంధించిన ప్లాట్ల కేటాయింపుపై కీలక గణాంకాలు వెలుగులోకి వచ్చాయి. రైతులకు ప్లాట్లు కేటాయించడం లేదంటూ వస్తున్న ఆరోపణల మధ్య ప్రభుత్వం విడుదల చేసిన తాజా వివరాలు ఇప్పుడు...

బీజేపీకి మద్దతిస్తా.. కానీ అలాంటి వారికాదు!: రష్మీ గౌతమ్

బండి భగీరథ్ పోక్సో కేసు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీస్తున్న వేళ, యాంకర్ మరియు నటి రష్మీ గౌతమ్ చేసిన పోస్టు ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ వ్యవహారంలో తనను ట్యాగ్...

గుర్రపు స్వారీలో విజయ్ దేవరకొండ కష్టాలు.. ‘రణబాలి’ బర్త్ డే గ్లింప్స్ వైరల్

విజయ్ దేవరకొండ హీరోగా, రష్మిక మందన్న హీరోయిన్‌గా తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం “రణబాలి” నుంచి విడుదలైన బర్త్ డే స్పెషల్ మేకింగ్ గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో...

విజయ్ సీఎం ప్రమాణ స్వీకారంలో అందరి చూపు త్రిష పైనే !

తమిళనాడు రాజకీయాల్లో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన విజయ్ సీఎం ప్రమాణ స్వీకారం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. చెన్నై నెహ్రూ స్టేడియంలో జరిగిన ఈ భారీ కార్యక్రమానికి సినీ, రాజకీయ ప్రముఖులు...

Dhurandhar: ‘ధురంధర్’ నుంచి మరో సర్ ప్రైజ్..! నిర్మాత కామెంట్స్ వైరల్

Dhurandhar: ఈమధ్య భారతీయ సినిమా బాక్సాఫీస్ స్టామినా ఏంటో చూపించిన సినిమా ‘ధురంధర్’. రణవీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. పాకిస్థాన్ లో ఇండియన్...