గ్లామర్ రంగంలో డేటింగ్ అన్నది ఎంత సర్వ సాధారణమో కొత్తగా చెప్పేది ఏమి లేదు. ఇప్పటికే పలువురు హీరోలు, హీరోయిన్స్ డేటింగ్ అంటూ కలిసే ఉంటున్నారు. తాజాగా రోబో 2. 0 గ్లామర్ హీరోయిన్ అమీ జాక్సన్ పెళ్లి కాకుండానే తల్లయిన విషయం తెలిసిందే. పెళ్ళికాకుండా తల్లయిన విషయాన్నీ ఏమాత్రం దాచకుండా బాహాటంగానే బేబీ బంప్స్ ఫోటోలు సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ నానా రచ్చ చేస్తున్నారు. తాజాగా ఇదే లిస్టులోకి చేరింది మరో గ్లామర్ హీరోయిన్. ఆమె ఎవరో కాదు బాలీవుడ్ లో పలు చిత్రాల్లో నటించిన బ్రునా అబ్దుల్లా ?
బ్రునా అబ్దుల్లా తాజాగా తాను ప్రెగ్నెంట్ అయినట్టు తెలిపేలా బేబీ బంప్ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ ఫోటో చుసిన జనాలు షాక్ అవుతున్నారు. బ్రునా పెళ్లి కాకుండా తల్లయిందా అంటూ ? పెళ్లి కాకుండా తల్లి అవ్వడం అన్నది ఫారెన్ కంట్రీస్ లో కామన్ కావొచ్చు కానీ మన ఇండియాలో మాత్రం ఇది కరెక్ట్ కాదు. ఈ విషయంలో బ్రునా పలు విమర్శలు ఎదురుకొంటుంది.
అయితే నెటిజన్స్ పెట్టె కామెంట్స్ కూడా కాస్త ఘాటుగానే సమాధానం ఇస్తుంది ఈ అమ్మడు. పెళ్లి కాకుండా తల్లయితే తప్పేమిటి ? ఎంతమంది పెళ్లయ్యాక విడిపోవడం లేదు ? అంటూ కాస్త ఘాటుగానే స్పందించింది. బ్రునా అబ్దుల్లా గత కొంత కాలంగా బ్రిటన్ కు చెందిన అలెన్ ఫ్రెజర్ అనే వ్యక్తిలో ప్రేమలో ఉంది. గత ఏడాది జులై లో నిశ్చితార్థం కూడా జరిగిందట. ఆ తరువాత ఇద్దరు డేటింగ్ చేయడంతో ఈ అమ్మడు ప్రెగ్నెంట్ అయింది. తాను గర్భవతిని అవ్వడం వల్ల చాలా ఆనందంగా ఉన్నానని చెప్పింది. అన్నట్టు త్వరలోనే వీరి వివాహం జరగనుందట. అది విషయం.