దర్శకులలో ప్రశాంత్ వర్మ ఎప్పుడూ కూడా భిన్నమైన దారిలోనే వెళుతుంటాడు. అ! సినిమాతో అందరినీ ఆశ్చర్యపరిచిన ప్రశాంత్ వర్మ తర్వాత కల్కి, జాంబీ రెడ్డి చిత్రాలను చేసాడు. జాంబీ రెడ్డి చిత్రం ప్రేక్షకుల మన్ననలు అందుకుంది. ప్రస్తుతం తేజ సజ్జా హీరోగా హనుమాన్ అనే భారీ చిత్రాన్ని చేస్తున్నాడు. ఈ సినిమా కోసం భారీ లెవెల్లో ఖర్చుపెట్టిస్తున్నాడు కూడా.
ఇదిలా ఉంటే ప్రస్తుతం నాగార్జునకు యాక్షన్… కట్ చెబుతున్నాడట ప్రశాంత్ వర్మ. అయితే ఇది సినిమా కోసం కాదు. బిగ్ బాస్ 6 ప్రోమోల షూటింగ్ ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోస్ లో జరుగుతోంది. ఇదివరకటిలా కాకుండా ఇప్పుడు యాడ్ షూటింగ్స్ దగ్గరనుండి, టివి ప్రోమోల వరకూ కూడా దర్శకుల ప్రమేయం ఉండాల్సిందే.
యాడ్ డైరెక్టర్లు అని ఇదివరకూ వేరేగా ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు దర్శకులే ఇవి కూడా చేస్తున్నారు. ఈ కోవలో బిగ్ బాస్ కు సంబంధించిన ప్రోమోలను ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేస్తున్నాడు. వచ్చే నెలలో బిగ్ బాస్ సీజన్ 6 ప్రారంభం కానుంది.
354508 990938I see something really special in this internet web site . 667429