Switch to English

తెలుగు ప్రేక్షకులను కన్ఫ్యూజ్‌ చేస్తున్న కేజీఎఫ్‌ డైరెక్టర్‌

కన్నడ స్టార్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌ ప్రస్తుతం కేజీఎఫ్‌ 2 చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెల్సిందే. ఈ ఏడాది చివర్లో కేజీఎఫ్‌ 2 చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తే ఆ తర్వాత చిత్రాన్ని ప్రశాంత్‌ నీల్‌ తెలుగులో మైత్రి మూవీ మేకర్స్‌ బ్యానర్‌లో ఒక స్టార్‌ హీరోతో చేయబోతున్నాడు అనే విషయం చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే కరోనా కారణంగా కేజీఎఫ్‌ 2 ఆలస్యం అవుతుంది. అలాగే ప్రశాంత్‌ నీల్‌ తెలుగు సినిమా కూడా వచ్చే ఏడాదికి పోస్ట్‌ పోన్‌ అవుతోంది.

సినిమా ఎప్పుడు ప్రారంభం అయ్యేనో కాని తెలుగు ప్రేక్షకుల్లో గత కొన్ని నెలలుగా ఈ సినిమా గురించే చర్చ జరుగుతోంది. మొదట ఎన్టీఆర్‌తో ఈయన సినిమా ఉంటుందని అన్నారు. ఆ తర్వాత మహేష్‌బాబుతో ప్రశాంత్‌ నీల్‌ చర్చలు జరిపినట్లుగా వార్తలు వచ్చాయి. ఇద్దరి కాంబో దాదాపుగా కన్ఫర్మ్‌ అయినట్లుగానే అనుకున్నారు. కాని ఇప్పుడు ప్రభాస్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్‌ పాన్‌ ఇండియా మూవీ అంటూ వార్తలు వస్తున్నాయి.

ప్రస్తుతం ప్రభాస్‌ రాధాకృష్ణ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఒక సినిమా చేయాల్సి ఉంది. ఈ రెండు సినిమాలు పూర్తి అయ్యేప్పటి వరకు ప్రశాంత్‌ నీల్‌ వెయిట్‌ చేస్తాడా అనేది అనుమానమే. కనుక ప్రభాస్‌, ప్రశాంత్‌ నీల్‌ల కాంబో గాలి వార్తలు అయ్యి ఉంటాయి. అయితే మహేష్‌ బాబు లేదా ఎన్టీఆర్‌లతో ఈయన ఎవరితో సినిమా చేస్తాడు అనేది ఆసక్తికరంగా ఉంది. ప్రేక్షకులు ప్రశాంత్‌ నీల్‌ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు. ఆ హీరోతో ఈ హీరోతో అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో కొంత కన్ఫ్యూజన్‌ కూడా క్రియేట్‌ అవుతోంది.

సినిమా

కంగనా 50 కోట్ల ఆఫీస్‌ ప్రత్యేకతలు చూద్దాం రండి

సినిమా ఆఫీస్‌ లు ఎంత రాయల్‌ గా ఎంతో అహ్లాదకరంగా ఉంటాయి. ప్రతి చోట కూడా క్రియేటివిటీ కలగలిపి ఉంటాయి. అన్ని విధాలుగా కూడా ప్రశాంతతను...

సోను సూద్ ఆచార్య గురించి ఏమంటున్నాడు?

సోను సూద్ అనే పేరుకు టాలీవుడ్ లో పరిచయం అవసరం లేదు. అరుంధతిలో విలన్ గా చేసిన దగ్గరనుండి సోను సూద్ కు తెలుగులో పాపులారిటీ...

బన్నీకి ఇష్టమైన బాలీవుడ్ సినిమాలివే

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గత కొన్నేళ్లుగా ప్యాన్ ఇండియా సినిమా చేయాలని అనుకుంటున్నాడు. అయితే అందుకు సరైన సందర్భం రావట్లేదు. ఇక ఇప్పుడు అల...

నాని మూవీకి ఎన్ని ఆఫర్స్ వచ్చినా నో అంటున్న దిల్ రాజు.!

టాలీవుడ్ అగ్రనిర్మాతల్లో ఒకరు దిల్ రాజు.. ప్రతి ఏడాది దిల్ రాజు నిర్మాణ సంస్థ నుంచి ఐదారు సినిమాలు విడుదలవుతుంటాయి, అంతే కాకుండా పలు సినిమాల...

టీటీడీని ప్రశ్నించిన ఏకైక హీరో

టీటీడీకి చెందిన ఆస్తులను వేలం వేసేందుకు అధికారులు సిద్దం అయిన విషయం తెల్సిందే. ఇందుకోసం ఇప్పటికే ఉతర్వులు కూడా సిద్దం అయ్యాయి. దేశ వ్యాప్తంగా ఉన్న...

రాజకీయం

హైకోర్టు మొట్టికాయలేస్తే.. టీడీపీని టార్గెట్ చేస్తారెందుకు?

ప్రభుత్వ పాఠశాలల్లోంచి తెలుగు మీడియంని తొలగించి, ఇంగ్లీషు మీడియంని తీసుకురావాలని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నానికి న్యాయస్థానం మొట్టికాయలేసింది. దాంతో, రకరకాల మార్గాల్లో తన ఆలోచనను అమలు చేసేందుకు వైఎస్‌...

టీడీపీకి ‘మహా’ షాక్‌: వైసీపీలోకి ‘ఆ’ తెలుగు తమ్ముళ్ళు.?

తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం ‘మహానాడు’కి ముందే పార్టీ అధినేతకు ఝలక్‌ ఇచ్చేందుకు వైసీపీ...

లబ్ధిదారుల ఎంపికలో చెప్పేదొకటి.. జరుగుతోంది మరొకటి

‘‘ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి అవకతవలకు ఆస్కారమివ్వం. ఈ ప్రక్రియ మొత్తం పూర్తి పారదర్శకంగా జరుగుతుంది. వాలంటీర్లే నిబంధనల ప్రకారం అర్హులను ఎంపిక చేస్తారు. నాకు ఓటేయనివారికి కూడా మా ప్రభుత్వ...

ఏపీలో బలవంతపు మత మార్పిడులపై ఏకిపారేసిన నేషనల్ మీడియా

రఘురామకృష్ణంరాజు.. భారతీయ జనతా పార్టీ సానుభూతిపరుడు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ. ఇంగ్లీషు మీడియం విషయంలోనూ, ఇతరత్రా అనేక విషయాల్లోనూ అధికార పార్టీకి కొరకరాని కొయ్యిలా తయారయ్యారు ఈ ఎంపీ. నిజానికి, రఘురామకృష్ణంరాజు...

కేసీఆర్‌పై పోరాటంలో జనసేనాని, బీజేపీతో కలిసొస్తారా.?

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌, తెలంగాణలో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి వ్యతిరేకంగా నినదిస్తారా.? అదే జరిగితే, పవన్‌ కళ్యాణ్‌ సినిమాల పరిస్థితి తెలంగాణలో ఏమవుతుంది.? ఈ చర్చ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ...

ఎక్కువ చదివినవి

ఫ్లాష్ న్యూస్: దున్నపోతును హింసించారు.. ఎలా పగ తీర్చుకుందో తెలుసా..

కర్మ సిద్ధాంతం ప్రకారం.. మనం చేసిన పనులే మనల్ని వెంటాడుతూ మన జీవిత గమనాన్ని నిర్దేశిస్తూ ఉంటాయి. కొంతమంది ఆకతాయిలు చేసిన ఆ తుంటరి పనే వారికి కర్మ రూపంలో జరిగింది. తనను...

‘పింజ్రాతోడ్‌’ యువతుల అరెస్ట్‌

గృహ హింసకు గురి అవుతున్న బాలికలను రక్షించి స్వచ్చంద సంస్థలు నిర్వహిస్తున్న హోంకు తరలిస్తూ అందరి ధృష్టిని ఆకర్షించిన పింజ్రాతోడ్‌ సంస్థ నిర్వాహకులు అయిన ఇద్దరు యువతులను పోలీసులు అరెస్ట్‌ చేయడం ప్రస్తుతం...

నిశ్చితార్థ వార్తలు కొట్టి పారేసిన సురేష్‌బాబు

ఈ రోజు ఉదయం నుండి కూడా సోషల్‌ మీడియాలో రానా వివాహ నిశిత్చార్థం అంటూ తెగ ప్రచారం జరుగుతున్న విషయం తెల్సిందే. తాను ప్రేమించిన అమ్మాయి మిహీకా బజాజ్‌తో రానా వివాహ నిశ్చితార్థం...

బన్నీ కోసం మారుతి కథ రెడీ అయిపోయిందా?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు, సక్సెస్ఫుల్ చిత్రాల దర్శకుడు మారుతికి మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉంది. ఇద్దరూ చాలా క్లోజ్. ఇటీవలే మారుతి మాట్లాడుతూ తామిద్దరం వాట్సాప్ లో తరచూ టచ్...

ఫ్లాష్ న్యూస్: రోడ్డు మీద మిలియన్‌ డాలర్ల డబ్బు దొరికితే అతడేం చేశాడో తెలుసా?

రోడ్డు మీద పది రూపాయలు దొరికితే అటు ఇటు చూసి దాన్ని జేబులో పెట్టుకునే రోజులు. వేల రూపాయలతో ఉన్న పర్స్‌ రోడ్డు మీద కనిపిస్తే ఎవరిదో అనే విషయం కనీసం ఆలోచించకుండా...