Switch to English

ప్రత్యక్ష పోరుకే పీకే మొగ్గు?

ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అలియాస్ పీకే.. ప్రత్యక్ష ఎన్నికలకే సన్నద్ధమవుతున్నారా? రాజ్యసభకు ఆయన్ను నామినేట్ చేస్తామంటూ తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఇచ్చిన ఆఫర్ ను పీకే తిరస్కరించారా? అంటే ఔననే సమాధానాలు వినిపిస్తున్నాయి. బీజేపీకి వ్యతిరేకంగా గళం విప్పి, జేడీయూ నుంచి బహిష్కరణకు గురైన ప్రశాంత్ కిషోర్ సేవలను తాము ఉపయోగించుకోవాలని మమత భావించారు.

ఆయనలాంటి ప్రముఖ వ్యక్తి పార్లమెంటులో ఉంటే బీజేపీతో పోరుకు ఉపకరిస్తుందని అనుకున్నారు. దీంతో ప్రస్తుతం తమకు రాబోయే నాలుగు రాజ్యసభ సీట్లలో ఒకటి పీకేకి ఇవ్వాలని నిర్ణయించారు. దీంతో పెద్దల సభలోకి పీకే ఎంట్రీ ఖాయమనే ప్రచారం జరిగింది. అయితే, తాజాగా వస్తున్న సమాచారాన్ని బట్టి మమత ప్రతిపాదనను పీకే సున్నితంగా తోసిపుచ్చినట్టు తెలుస్తోంది.

పరోక్ష ఎన్నికల ద్వారా చట్టసభలకు వెళ్లదలుచుకోలేదని, ప్రత్యక్షంగానే బరిలోకి దిగుతానని చెప్పినట్టు సమాచారం. బీహార్ లోనే తన రాజకీయ సామ్రాజ్యాన్ని నిర్మించుకోవాలని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే ఇందుకు సంబంధించిన కార్యాచరణ మొదలుపెట్టి రాష్ట్రవ్యాప్తంగా పర్యటన చేయాలని నిర్ణయించుకున్నట్టు చెబుతున్నారు. తద్వారా క్షేత్ర స్థాయిలో తనకంటూ ప్రత్యేక కేడర్ నిర్మించుకుంటూ ఐదు నుంచి పదేళ్లలో బలమైన శక్తిగా బీహార్లో ఎదగాలని ప్రణాళిక రచించుకున్నట్టు పేర్కొంటున్నారు.

గతంలో జేడీయూలో చేరి తప్పు చేశానని, ఇకపై అలాంటి పొరపాటు చేయకుండా తన మార్కు సిద్ధాంతాలతో ప్రజల్లోకి వెళ్లాలన్నదే పీకే ఆలోచనగా తెలుస్తోంది. బీహార్ లో బలంగా ఎదగడంతోపాటు జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా కూటమి ఏర్పాటు చేయాలనే సమాంతర లక్ష్యంతో ముందుకెళ్లాలని ప్రశాంత్ కిషోర్ భావిస్తున్నట్టు సమాచారం.

ఇందుకోసం కలిసి వచ్చే పార్టీలను కలుపుకొని వెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి ఎన్నికల వ్యూహాల్లో విజయవంతమైన వ్యక్తిగా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న పీకే.. పార్టీ పెట్టి విజయం సాధిస్తారా లేదా అనేది తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే.

సినిమా

నా భర్తతో ఉండలేక పోతున్నా అంటూ ట్వీట్‌.. సోనూ సూద్‌ సమాధానం...

గత నెల రోజులుగా సోషల్‌ మీడియాలో సోనూ సూద్‌ పేరు ఒక రేంజ్‌ లో మారు మ్రోగి పోతుంది. వలస కార్మికుల పాలిట దేవుడు అంటూ...

తమిళ, మలయాళ స్టార్స్‌తో తెలుగు మల్టీస్టారర్‌

ఈమద్య కాలంలో మల్టీస్టారర్‌ చిత్రాలు వరుసగా వస్తున్నాయి. మల్టీస్టారర్‌ చిత్రాలకు ఉన్న క్రేజ్‌ను క్యాష్‌ చేసుకునేందుకు మేకర్స్‌ ఎక్కువగా మల్టీస్టారర్‌ చిత్రాలను చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు....

ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ.. మల్టీస్టారర్ పై బాలయ్య స్పందన..

నందమూరి నట సింహం బాలకృష్ణ సినిమా గురించి మాట్లాడినా.. రాజకీయం గురించి మాట్లాడినా స్పష్టత ఉంటుంది. నిజాన్ని నిర్భయంగా చెప్పే ఆయన ఓ యూట్యూబ్ చానెల్...

క్షమాపణ చెప్పాలన్న నాగబాబు కామెంట్స్ పై బాలకృష్ణ రియాక్షన్.!

గత కొద్దిరోజులుగా తెలుగు సినీ పరిశ్రమలో కొన్ని వివాదాలు జరుగుతున్నాయి. ఈ వివాదం నందమూరి బాలకృష్ణ 'సినీ వర్గ మీటింగ్స్ కి నన్ను పిలవలేదు' అంటూ...

అనసూయకు పొలిటికల్‌ ఆఫర్స్‌ కూడా వస్తున్నాయా?

జబర్దస్త్‌ హాట్‌ యాంకర్‌ అనసూయ ప్రస్తుతం బుల్లి తెర మరియు వెండి తెరపై చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. సోషల్‌ మీడియాలో కూడా ఈమెకు...

రాజకీయం

అన్నదాతలకు శుభవార్త చెప్పిన కేంద్ర కేబినెట్

అన్నదాతలకు శుభవార్త: వివిధ పంటలకు మద్ధతు ధరలు పెంచిన కేంద్ర కేబినెట్( ఖరీఫ్ సీజన్ కోసం). ప్రతి క్వింటాల్ కు..... 1 . వరి - నూతన ధర రూ. 1,868/-( పెంచిన ధర రూ.53) 2....

నిమ్మగడ్డ ఇష్యూలో సుప్రీంను ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం

ఏపీ ఎన్నికల కమీషనర్‌గా విధులు నిర్వహిస్తున్న నిమ్మగడ్డ రమేష్‌ను ప్రభుత్వం అర్థాంతరంగా తొలగిస్తూ ఉతర్వులు తీసుకు వచ్చింది. ఆ ఉతర్వులను నిమ్మగడ్డ రమేష్‌ హైకోర్టులో సవాల్‌ చేశారు. ఏపీ హైకోర్టులో నిమ్మగడ్డ రమేష్‌కు...

జన్మంతా జగన్‌తోనేనంటున్న విజయసాయిరెడ్డి.. నమ్మొచ్చంటారా.?

‘వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డితో నాకున్న అనుబంధం చాలా విలువైనది. ఇప్పుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డితోనూ అదే అనుబంధం కొనసాగుతోంది. ఇకపైనా, అదే కొనసాగుతుంది. జన్మంతా జగన్‌ వెంటే నా ప్రయాణం. ఇందులో ఇంకో మాటకు...

కరోనా వారియర్లే రక్షకులు.. వారిపై దాడులు సహించం: ప్రధాని మోదీ

దేశంలో కరోనా విపత్కర పరిస్థితుల్లో అత్యుత్తమ సేవలు అందిస్తున్న వైద్యులు, హెల్త్ వర్కర్లపై దాడులు చేస్తే సహించేది లేదని ప్రధాని మోదీ తెలిపారు. కర్ణాటకలోని రాజీవ్ గాంధీ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్.....

బెజవాడలో గ్యాంగ్‌ వార్‌: హత్యా ‘రాజకీయం’లో కొత్త కోణం.!

రాష్ట్ర రాజధాని అమరావతి పరిధిలోని బెజవాడ ఒక్కసారిగా ‘గ్యాంగ్‌ వార్‌’తో ఉలిక్కిపడింది. రెండు గ్యాంగ్‌ల మధ్య గొడవలో ఓ గ్యాంగ్‌ లీడర్‌ హతమయ్యాడు. ఓ అపార్ట్‌మెంట్‌కి సంబంధించిన గొడవలో ఇద్దరు వ్యక్తులు ‘సెటిల్‌మెంట్‌’కి...

ఎక్కువ చదివినవి

టీడీపీ మహానాడు.. కొత్త నాయకత్వమే దిక్కు.!

తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం వస్తుందా.? ఈ ప్రశ్న ఇప్పుడు మహానాడు సందర్భంగా టీడీపీ కార్యకర్తల్ని వేధిస్తోంది. నిజానికి, 2014 ఎన్నికలకు ముందే తెలుగుదేశం పార్టీ తన ఉనికిని దాదాపుగా కోల్పోయింది. అయితే,...

క్రికెట్‌పై కరోనా ఎఫెక్ట్‌: ఇకపై అవేవీ కన్పించవా.?

కరోనా వైరస్‌ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా అన్ని రంగాల్లోనూ పెను మార్పులు చోటు చేసుకోనున్నాయి. ‘ఏదీ ఇంతకు ముందులా వుండదు..’ అని కరోనా వైరస్‌పై నిపుణులు తమ అభిప్రాయాల్ని కుండబద్దలుగొట్టేస్తున్న విషయం విదితమే....

వైఎస్‌ జగన్‌ పాలనకు ఏడాది: రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఏదీ.?

‘మేం అధికారంలోకి వస్తే, కేంద్రం మెడలు వంచి ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా సాధిస్తాం..’ అని 2014 నుంచి 2019 వరకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నినదించింది. 2014 ఎన్నికల్లోనూ ఈ ప్రత్యేక హోదా...

ఇండియాలో మొదటగా అక్కడ గుడి గంట మ్రోగబోతుంది

కరోనా విపత్తు నేపథ్యంలో ఇండియాలో గత రెండు నెలలుగా ప్రార్థన మందిరాలు పూర్తిగా మూత పడి ఉన్నాయి. కరోనా భయంతో చర్చ్‌లు, మసీద్‌లతో పాటు దేవాలయాలు పూర్తిగా క్లోజ్‌ చేశారు. సామాజిక దూరం...

లాక్‌ డౌన్‌ నెంబర్‌ 5: సడలింపులే సడలింపులు.!

కేంద్రం మరోమారు లాక్‌డౌన్‌ని పొడిగించింది. జూన్‌ 30 వరకు దేశంలో లాక్‌డౌన్‌ని పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. అయితే, ఈసారి లాక్‌డౌన్‌ నుంచి చాలా సడలింపులు ఇచ్చారు. దశల వారీగా లాక్‌డౌన్‌ని ఎత్తివేసేందుకు...